- Home
- Entertainment
- ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?
ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?
తెలుగు పరిశ్రమకు ఎన్టీఆర్ కీర్తి కిరీటం.. ఆయన నటన,పర్సనాలిటీ.. ఎదురుగా వస్తే ఎంతటివారైనా చేతులెత్తి మొక్కాల్సిందే. ఆయన ఎదురుగా ఉంటే ఎంతటి నటులైనా బెదరక తప్పదు. అటువంటి సందర్భంమే ఎదురయ్యింది ఓ స్టార్ కమెడియన్ కు.

ఎన్టీఆర్ అంటే భయం..
తెలుగు సినీ పరిశ్రమంలో నందమూరి తారకరామారావు లాంటి పర్సనాలిటీ మళ్లీ పుట్టలేదు. ఆయన చేసిన ప్రయోగాలు, మల్టీ టాస్కులు ఎవరు చేసి ఉండరు. ఆయనఆహార్యం, నటన, చూపులు, వాయిస్ లో భేస్.. అన్నీ అద్భుతాలే. ఒక సినిమాలో మూడు పాత్రలు చేస్తూ.. ఆ సినిమాను డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఇలా దానవీరశూరకర్ణ లాంటి ప్రయోగాలెన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి. షూటింగ్ లో ఎన్టీఆర్ ఉన్నారంటే.. ఎంత పెద్ద నటులకైనా ఓ వైపు భయం ఉండేది. ఇక పెద్దాయని ఎదురుగా నిలబడి డైలాగ్ చెప్పాలంటే.. బెదిరిపోయేవారు నటులు. అలాంటి సందర్భమే ఎదురయ్యింది స్టార్ కమెడియన్ బ్రహ్మానందానికి.
కడుపుబ్బా నవ్వించిన నటుడు.
టాలీవుడ్ లో చాలామంది కమెడియన్లు ఉన్నారు.. కానీ చాలా తక్కువ టైమ్ లో పాపులర్ అయిన నటుడు మాత్రం బ్రహ్మానందం ఒక్కడే.. 80 దశకం చివర్లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన.. డైలాగ్ చెప్పకపోయినా.. తన ఎక్స్ ప్రెషన్స్ తోనే కడుబ్బా నవ్వించేవాడు. బ్రహ్మానందం కంటే ముందు ఇండస్ట్రీకి వచ్చినవారు, ఆయనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసినవారు ఎందరో ఉన్నారు.
వారు స్టార్ కమెడియన్స్ అయ్యారు కానీ.. బ్రహ్మానందానికి వచ్చినంత పాపులారిటీ మాత్రం వారు సాధించలేకపోయారు. చాలా తక్కువ టైమ్ లోనే ఆయన 15 వందలకు పైగా సినిమాల్లో నటించి..గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును కూడా సాధించారు. అటువంటి నటుడు ఎన్టీఆర్ ముందు డైలాగ్ చెప్పడానికి ఎన్ని తిప్పలు పడ్డాడంటే?
మేజర్ చంద్రకాంత్ షూటింగ్ లో ఏం జరిగిందంటే?
ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భాలు బ్రహ్మానందానికి ఒకటీ రెండు సార్లు మాత్రమే వచ్చింది. అది కూడా ఒకటీ రెండు సీన్లు మాత్రమే. ఎన్టీరామారావుతో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు బ్రహ్మీ. ఈసినిమాలో రిక్షావాడిగా ఆయన పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. ఈక్రమంలో ఈసినిమాలో ఎన్టీఆర్ తో కలిసి రెండు మూడు సీన్లు బ్రహ్మీకి ఉంటాయి. ఆయన ఎదురుగా నిలబడి డైలాగ్ చెప్పాలంటే భయపడుతూనే షాట్ కు రెడీ అయ్యాడట స్టార్ కమెడియన్.. ఎంత ధైర్యం తెచ్చుకున్న.. ఓ చిన్న డైలాగ్ చెప్పడం కూడా బ్రహ్మానందం వల్ల కాలేదు.
ఎదురుగా ఎన్టీఆర్.. బ్రహ్మానందం ఏం చేశారంటే?
మేజర్ చంద్రకాంత్ లో ఎన్టీ రామారావుతో నటించిన అనుభవాన్ని.. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ముందు వెల్లడించాడు బ్రహ్మానందం. '' ఆ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. నేను ఆయన్ను పిలుచుకుంటూ రావాలి.. చంద్రకాంత్ గారు.. చంద్రకాంత్ గారు అనుకుంటూ వచ్చాను.. ఎదురుగా ఆయన కనిపించారు.. వెంటనే భయంతో డైలాగ్ మర్చిపోయి బిక్క ముఖం వేశాను.. ఇక మళ్లీ లోపలికి వెళ్లి.. ప్రిపేర్ అయ్యి.. మళ్లీ వచ్చాను.. చంద్రకాంత్ గారు.. చంద్రకాంత్ గారు అనుకుంటూ.. రాగానే.. ఎదురుగా ఎన్టీఆర్ గంభీరంగా కనిపించేవరకూ.. మళ్లీ డైలాగ్ మర్చిపోయాను.. ఇలా రెండు మూడు సార్లు అయ్యే సరికి.. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి కోపం వచ్చి.. హేయ్.. బ్రహ్మీ సరిగ్గా చేయి అని మందలించారు. అప్పుడు ఏదైతే అది అయ్యిందని.. మళ్లీ డైలాగ్ మొదలు పెట్టి.. ఈసారి ఆయన ముఖం చూడకుండా.. అటు పక్కా ఇటు పక్కా చూస్తూ.. డైలాగ్ కంప్లీట్ చేశాను'' అని బ్రహ్మానందం అన్నారు.

