- Home
- Entertainment
- గేమ్ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్, సేమ్ డేట్ రజనీకాంత్ టార్గెట్.. అమీర్ ఖాన్‌తో పోటీ తప్పదా?
గేమ్ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్, సేమ్ డేట్ రజనీకాంత్ టార్గెట్.. అమీర్ ఖాన్‌తో పోటీ తప్పదా?
ఎన్టీఆర్ గేమ్ నుంచి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో ఇప్పుడు రజనీకాంత్ రాబోతున్నారు. అయితే అమీర్ ఖాన్ సూపర్ స్టార్ తో పోటీ పడే అవకాశం ఉంది.

rajiniikanth, jr ntr
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతున్నాయి. భారీ తనంతో వస్తున్న నేపథ్యంలో బెస్ట్ ఔట్‌పుట్ విషయంలోనూ మేకర్స్ రాజీపడటం లేదు. క్వాలిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ కూడా వాయిదా పడుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఆ డేట్‌ని రజనీకాంత్ టార్గెట్ చేస్తున్నారట.
ntr,war2
ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `వార్ 2` చిత్రంలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. యష్ రాజ్ ఫిల్మ్ నుంచి వస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఇప్పుడు వాయిదా పడుతుందట. వర్క్ పూర్తికాకపోవడంతో వాయిదా వేసే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.
ఇక ఇప్పుడు ఆ స్థానంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నారు. ఆయన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌తోపాటు నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ పోషిస్తారని తెలుస్తుంది. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. కానీ ఇప్పుడు ఆగస్ట్ 15కి వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ సినిమా(వార్ 2) డేట్‌ని రజనీకాంత్ టార్గెట్ చేశాడని చెప్పొచ్చు.
Rajinikanth Aamir Khan
ఇంకోవైపు అదే డేట్‌కి అమీర్ ఖాన్ కూడా రాబోతున్నారట. ఆయన తన ప్రొడక్షన్‌లో `లాహోర్1947` పేరుతో సినిమాని నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ సంతోషి దర్శకుడు. ఈ మూవీని కూడా ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకుంటున్నారట. ఇదే నిజమైతే బాక్సాఫీసు వద్ద రజనీకాంత్, అమీర్ ఖాన్ పోటీతప్పదు. ఇందులో విచిత్రమేంటంటే `కూలీ`లోనూ అమీర్‌ఖాన్ గెస్ట్ గా కనిపిస్తున్నారు. అలాగే `లాహోర్1947`లో సన్నీ డియోల్, ప్రీతి జింటా జంటగా నటిస్తుండగా, అమీర్ కీలక పాత్రలో మెరవబోతున్నారు. దీని కారణంగా అమీర్ తనతోనే తాను పోటీ పడబోతున్నాడని చెప్పొచ్చు.
rajinikanth, aamir khan
ఇదే నిజమైతే..సౌత్ రజనీకాంత్ పంచుకుంటాడు. నార్త్ అమీర్ ఖాన్ చూసుకుంటారు. కానీ సౌత్ విషయంలో అమీర్ ఖాన్ సినిమాకి, నార్త్ విషయంలో రజనీ సినిమాకి దెబ్బ పడే ఛాన్స్ ఉంది. కలెక్షన్ల పరంగా ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఎంత ఎఫెక్ట్ పడినా, రెండు సినిమాలకు ఛాన్స్ ఉంటుందని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు.
read more: రాజమౌళితో `జబర్దస్త్` రష్మి రొమాన్స్, రేడియో ప్రేమ.. సంచలనంగా మారిన రేర్ వీడియో