- Home
- Entertainment
- 40కిపైగా సినిమాల్లో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లిగా నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా?
40కిపైగా సినిమాల్లో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లిగా నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా?
ఎన్టీఆర్, సావిత్రి టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటిది వీరిద్దరు ఒక మూవీలో అన్నా చెల్లిగా నటించారు. సెంటిమెంట్‌తో కన్నీళ్లు పెట్టించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హిట్ పెయిర్‌గా ఎన్టీఆర్, సావిత్రి
నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్), సావిత్రి జంట అప్పట్లో హిట్ పెయిర్. వీరిద్దరు కలిసి ఏ మూవీ చేసినా బాక్సాఫీసు వద్ద హిట్టే. అయితే అప్పట్లో హీరోయిన్లు తక్కువ. బాగా నటించగలిగేవాళ్లు, అందంగా ఉన్నవాళ్లకే ఎక్కువగా హీరోయిన్ అవకాశాలు వచ్చేవి. అలా ఎన్టీఆర్, సావిత్రి కలిసి ఎన్నో సినిమాలు చేశారు. వీరి కాంబినేషన్‌లో నలభైకి పైగానే సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు.
వెండితెరపై పోటీ పడి నటించిన రామారావు, సావిత్రి
కొన్ని మూవీస్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి కలిసి నటించారు. వాటిలో కొన్ని సావిత్రి.. ఏఎన్నార్ కి జోడీగా కూడా చేసింది. కానీ రామారావు, సావిత్రిలది తిరుగులేని హిట్ పెయిర్ అని చెప్పొచ్చు. వీరిమధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అంతే బాగా కుదిరేది. అంతేకాదు వీరిద్దరు వెండితెరపై పోటీ పడి నటించేవారు. అలా తెలుగు ఆడియెన్స్ ని వీరిద్దరు తమదైన రొమాన్స్ తో అలరించారు. ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయారు.
`రక్తసంబంధం`లో అన్నా చెల్లిగా ఎన్టీఆర్, సావిత్రి
ఇదిలా ఉంటే ఎన్నో సినిమాల్లో జంటగా చేసిన ఎన్టీఆర్, సావిత్రి ఒక్క మూవీలో మాత్రం అన్నా చెల్లిగా నటించారు. అటు ఇండస్ట్రీ వర్గాలను, ఇటు ఆడియెన్స్ ని ఆశ్చర్యపరిచారు. వీరిద్దరు అన్నా చెల్లిగా నటించడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. ఈ చర్చనే సినిమాపై ప్రత్యేకమైన అటెన్షన్ క్రియేట్ చేసింది. ఆ సినిమానే `రక్తసంబంధం`. అన్నా చెల్లి అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ 1962లో విడుదలైంది.
`రక్త సంబంధం` సినిమా టీమ్
ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి వి.మధుసూదనరావు దర్శకుడు. సుందర్ లాల్ నహత, దూండి నిర్మాతలు. ఇందులో ఎన్టీఆర్, సావిత్రిలతోపాటు కాంతారావు, దేవిక, రేలంగి, ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంతం వంటి వారు నటించారు. ఈ సినిమా తమిళంలో వచ్చిన `పసమలార్`కి రీమేక్. అందులో సావిత్రి, జెమినీ గణేషన్ నటించడం విశేషం.
బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `రక్తసంబంధం`
ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లిగా నటించిన `రక్తసంబంధం` మూవీ 1962 నవంబర్ 1న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 11 సెంటర్లలో వంద రోజులు ఆడింది. విజయవాడలో ఏకంగా 25 వారాలు ప్రదర్శించబడింది. అంతేకాదు ఈ మూవీని 1988లో మరోసారి రీ రిలీజ్ చేశారు. అప్పుడు కూడా మంచి ఆదరణ పొందడం విశేషం.
లవర్స్ గా, భార్యాభర్తలుగా వెండితెరపై రొమాన్స్ తో రెచ్చిపోయిన ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లిగానూ అంతే అద్భుతమైన బాండింగ్‌ని చూపించి ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఈ మూవీ వీరిద్దరి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది.