MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డుని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్‌, భారీ ఈవెంట్‌లో సంచలన నిర్ణయం.. మెగాస్టార్‌ ఫిదా

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డుని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్‌, భారీ ఈవెంట్‌లో సంచలన నిర్ణయం.. మెగాస్టార్‌ ఫిదా

ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ కి అవార్డు వరించింది. చిరంజీవి అవార్డుని అందించారు. కానీ ఎన్టీఆర్‌..అందరికి ముందు, భారీ ఈవెంట్‌లోనే తన అవార్డుని రిజెక్ట్ చేయడం అందరిని షాక్‌కి గురిచేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 06 2026, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవికి షాక్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌
Image Credit : idlebrain

చిరంజీవికి షాక్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ అద్భుతమైన నటుడు. ఆయన నటనకు చాలా అవార్డులు వచ్చాయి. అయితే ఓ సారి ఎన్టీఆర్‌ తనకు వచ్చిన అవార్డుని రిజెక్ట్ చేశాడు. చిరంజీవి ఇచ్చిన అవార్డుకి ఆయన నో చెప్పారు. అందరి ముందు బహిరంగ సభలో ఈ అవార్డుని రిజెక్ట్ చేశారు. ఆయన చెప్పిన కారణం తెలిసి అంతా షాక్‌ అయ్యారు. మెగాస్టార్‌ ఏకంగా ఫిదా అయ్యారు. అసలేం జరిగిందనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యమదొంగకి బెస్ట్ యాక్టర్‌ అవార్డు
Image Credit : X/@AmardeepKushw20

యమదొంగకి బెస్ట్ యాక్టర్‌ అవార్డు

అప్పట్లో స్టార్‌ మా అవార్డుల వేడుక నిర్వహించింది. ఇది 2007-08 టైమ్ లో. ఇందులో ఆల్మోస్ట్ బిగ్‌ స్టార్స్ అంతా హాజరయ్యారు. చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఇందులో ఉత్తమ నటుడి కేటగిరిలో ఎన్టీఆర్‌కి అవార్డు వరించింది. `యమదొంగ` చిత్రానికిగానూ తారక్‌కి బెస్ట్ యాక్టర్‌ అవార్డు వరించింది. ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ఈ అవార్డుని ప్రకటించిన తారక్‌కి అందించారు.

Related Articles

Related image1
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Related image2
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
35
చిరంజీవి అందించిన అవార్డుని రిజక్ట్ చేసిన ఎన్టీఆర్‌
Image Credit : instagram

చిరంజీవి అందించిన అవార్డుని రిజక్ట్ చేసిన ఎన్టీఆర్‌

కానీ అవార్డుని ఎన్టీఆర్‌ తిరస్కరించారు. కాకపోతే అది పాజిటివ్‌ వేలో. ఆ సమయంలోనే లెజెండరీ నటుడు, మన తెలుగు తెర సోగ్గాడు శోభన్‌ బాబు మరణించారు. ఆయన మృతికి సంతాపంగా, ఆయనకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు ఎన్టీఆర్‌. అవార్డుని అందించిన వెంటనే ఆయన చిరంజీవికి ఇచ్చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, `ఈ అవార్డుని చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే, చిరంజీవిగారి సినిమాలు, మా బాలయ్య బాబాయ్‌ సినిమాలు, నాగార్జునగారి సినిమాలు చూస్తూ పెరిగాను. అయితే ఇటీవలే శోభన్‌బాబుగారు చనిపోయారు. ఆయన్ని దర్శించుకునే అర్హత ఇంకా తనకు రాలేదు, అందుకే నేను వెళ్లలేదు.

45
శోభన్‌ బాబుకి అవార్డు అంకితం..చిరంజీవి ఫిదా
Image Credit : Facebook/sobhan babu abhimanulu

శోభన్‌ బాబుకి అవార్డు అంకితం..చిరంజీవి ఫిదా

ఈ అవార్డుని శోభన్‌బాబుగారికి అంకితమిస్తున్నా. ఈ అవార్డు వారి కుటుంబ సభ్యులకు చేరేలా, దయజేసి చిరంజీవిగారే, వారి కుటుంబానికి అందించాలని ఈ అవార్డుని వారికే ఇచ్చేస్తున్నా` అని తెలిపారు ఎన్టీఆర్‌. దీనికి చిరంజీవి ఫిదా అయ్యారు. ఆయన దీనిపై రియాక్ట్ అవుతూ, అవార్డుని అంకితమిస్తున్నట్టు చెబితే చాలు, ఇచ్చినట్టే. శోభన్‌బాబు గారికి యంగ్‌ హీరోలలో మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కడున్న ఆశీస్సులు ఎన్టీఆర్‌కి దక్కాలని, వారి తృప్తిమేరకు ఈ అవార్డుని శోభన్‌ బాబు గారి ఫ్యామిలీకి అందించే ప్రయత్నం చేస్తాన`ని చిరంజీవి తెలిపారు. ఈ అరుదైన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్‌ గొప్ప మనసుకి అంతా ఫిదా అవుతున్నారు.

55
డ్రాగన్‌లో నటిస్తోన్న ఎన్టీఆర్‌
Image Credit : Asianet News

డ్రాగన్‌లో నటిస్తోన్న ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 1970నాటి కోల్‌ కత్తా బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో తారక్‌ మాఫియా డాన్‌గా కనిపిస్తారని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవలే ఫారెన్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ఇందులో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే విలన్‌గా మలయాళ హీరో టోవినో థామస్‌ ని ఎంపిక చేశారట. కానీ ఆయన తప్పుకున్నారు. ఇటీవలే `పళ్లి చట్టాంబి` మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన తాను `డ్రాగన్‌`లో నటించడం లేదని తెలిపారు. ఇది పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: ఐరన్ లెగ్ అంటూ రోజాపై దారుణంగా ట్రోల్స్, నేపాల్ వరదలు, నగరి పులిహోర ఘటనపై విమర్శలు
Recommended image2
ANR: ఏఎన్నార్ ఇచ్చిన 1 లక్ష రెమ్యునరేషన్ తో 5 ఎకరాలు కొని, కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Rashmika Mandanna: సిగ్గు పడ్డట్లు అస్సలు అనిపించలేదు, మరిది సినిమాపై రష్మిక క్రేజీ కామెంట్స్
Related Stories
Recommended image1
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Recommended image2
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved