- Home
- Entertainment
- మహేష్ బాబు పెద్ద మాయగాడు, సూపర్ స్టార్ తో 3 సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
మహేష్ బాబు పెద్ద మాయగాడు, సూపర్ స్టార్ తో 3 సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఓ స్టార్ డైరెక్టర్. ఆయనతో సినిమాలు చేసి పెద్ద పొరపాటు చేశానన్నాడు. మహేష్ బాబు పెద్ద మాయగాడంటూ.. సంచలన వాఖ్యలు చేసినదర్శకుడు ఎవరు?

వారణాసి బిజీలో మహేష్ బాబు..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ కె పరిమితం అయిన మహేష్.. ఈసినిమాతో హాలీవుడ్ రేంజ్ కు వెళ్లబోతున్నాడు. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ బాబు జోడీగా నడిస్తోంది.
కెరీర్ బిగినింగ్ లో ప్లాప్ సినిమాలు..
మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లో కొన్నిప్లాప్ సినిమాలను చూశారు. ఆతరువాత ఒక్కడు, పొకిరి లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ కూడా మహేష్ ఖాతాలో ఉన్నాయి. ఆతరువాత కాలంలో కూడా మహేష్ కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల డిజాస్టర్లు ఫేస్ చేసిన సంద్భాలు ఉన్నాయి. అయితే మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు.. ఒక యావరేజ్ మూవీ, ఒక భారీ డిజాస్టర్.. మొత్తంగా మూడు సినిమాలు చేసిన దర్శకుడు ఒకరున్నారు. ఆయన ఎవరో కాదు గుణశేఖర్. ఒక్కడు సినిమాతో మహేష్ బాబు కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన గుణశేఖర్.. ఆతరువాత కాలంలో సైనికుడు లాంటి డిజాస్టర్ ను కూడా ఇచ్చాడు.
మహేష్ బాబుపై గుణ శేఖర్ కామెంట్స్..
మహేష్ బాబు గురించి గతంలో గుణశేఖర్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ.. “మహేశ్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఒక్కసారి ఆయనతో సినిమా చేస్తే చాలు, ఆయన నటనకు, వ్యక్తిత్వానికి అడిక్ట్ అయిపోతాం.. మహేష్ బాబు ఒక మత్తు లాంటి వ్యక్తి, అందుకే నేను వరుసగా ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’ వంటి మూడు సినిమాలు మహేష్ బాబుతోనే చేశాను. అలా చేసి నా కెరీర్ లోనే పెద్ద తప్పు చేశాను. వరుసగా ఒకే హీరోతో మూడు సినిమాలు చేయడం వల్ల నా కెరీర్‌లో కొంత గ్యాప్ ఏర్పడింది. మహేష్ బాబు పెద్ద మాయగాడు.. ఆయన మాయలో పడకుండా వేరే హీరోలతో కూడా సినిమాలు చేయాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది'' అని గుణశేఖర్ వెల్లడించారు.
మహేష్ బాబును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది..
గుణశేఖర్ మాట్లాడుతూ.. మహేశ్ తన నటనతో ఎప్పుడూ బాబు దర్శకులను ఆశ్చర్యపరుస్తాడు. డైరెక్టర్ ఒక సన్నివేశానికి 100 శాతం అడిగితే, మహేష్ బాబు మాత్రం 200 శాతం అవుట్‌పుట్ ఇస్తారు. అందుకే ఆయనను ఒక ‘మాయగాడు’గా గుణశేఖర్ అభివర్ణించారు. మహేశ్ బాబు నటించిన ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాలు మహేష్ కెరీర్ ను బిల్డ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. సైనికుడు సినిమా ప్లాప్ అయినా.. ఆ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ స్టైల్.. అభిమానులను అలరించింది. ఈసినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

