- Home
- Entertainment
- ఎన్టీఆర్ కాళ్లు మొక్కించుకునే కల్చర్ వెనుక ఇంత కథ ఉందా? వామ్మో రామారావు లాజిక్ మాత్రం కేక
ఎన్టీఆర్ కాళ్లు మొక్కించుకునే కల్చర్ వెనుక ఇంత కథ ఉందా? వామ్మో రామారావు లాజిక్ మాత్రం కేక
ఎన్టీఆర్ నటుడిగా ఎంతగా కీర్తించబడ్డారో, రాజకీయాల్లోనూ అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రామారావు కాళ్లు మొక్కించుకునే కల్చర్‌ని కొనసాగించారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందట.

రాముడిగా, కృష్ణుడిగా కీర్తించబడ్డ ఎన్టీఆర్
ఎన్టీఆర్ లెజెండరీ నటుడిగా రాణించారు. నటుడిగా ఆయన విశ్వరూపం చూపించారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం, రక్తికట్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
సరదా పాత్ర అయినా, యాక్షన్ రోల్ అయినా, పౌరాణికమైనా, జానపద పాత్ర అయినా రక్తికట్టించారు. ఇంకా చెప్పాలంటే పాత్ర ఆయనకు బానిస అయిపోయింది. తెలుగు ప్రజలు ఆయన్ని రాముడిగా, కృష్ణుడిగా పూజించారు.
రాజకీయ నాయకుడిగా జనం గుండెల్లో నిలిచిపోయారు రామారావు
ఆ తర్వాత రాజకీయాల్లోనూ అదే స్థాయిలో సక్సెస్ అయ్యారు రామారావు. అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి జనం గుండెల్లో నిలిచిపోయారు.
రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి దశలోనే ఆయన విజయం సాధించారు. సీఎం అయ్యారు. అయితే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అందులోనూ తన డామినేషన్ చూపించారు రామారావు.
ఈ క్రమంలో సీఎంగా, పొలిటికల్ లీడర్‌గా ఆయన ఒక కల్చర్‌ని పాటించారు. తన కార్యకర్తలతో కాళ్లు మొక్కించుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.
ఎన్టీఆర్ కాళ్లు మొక్కించుకునే కల్చర్
ఎన్టీఆర్.. కాళ్లు మొక్కించుకునే కల్చర్ వెనుక ఒక స్ట్రాటజీ ఉందట. దాని వెనుక ఒక బలమైన కారణం ఉందట. ఈ విషయాన్ని ఏబీఎన్ ఛైర్మెన్ రాధాకృష్ణ తెలిపారు.
రామారావు సీఎంగా ఉన్న సమయంలో ఎక్కడ మీటింగ్‌లు జరిగినా కార్యకర్తలు స్టేజ్‌పైకి వచ్చి రామారావు కాళ్లకి దెండం పెట్టుకుని వెళ్లేవారట.
అంతేకాదు కార్యకర్తలు, లీడర్లు కాళ్లు మొక్కుతుంటే ఆయన ఎదురుగా ఉండే ఇతర లీడర్లని చూసేవారట. ఆయన చూస్తున్నారని చెప్పి చాలా మంది వచ్చి రామారావు కాళ్లు మొక్కేవారట.
కాళ్లు మొక్కించుకోవడం వెనుక ఎన్టీఆర్ చెప్పిన లాజిక్
ఇది చూసిన రాధాకృష్ణ ఓ సారి ఆయన్ని ప్రశ్నించారు. సీఎంగా దిగిపోయినప్పుడు ఆయన్ని కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రశ్నించారట. ఎందుకు ఈ కల్చర్‌ని పాటిస్తున్నారు , అది మీకు ఎఫెక్ట్ అవుతుంది కదా అని అడగ్గా,
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, అలా చేయడానికి బలమైన కారణం ఉంది. ఎవరికి వారు స్వతహాగా నా కాళ్లు మొక్కేవాళ్లు, నన్ను అభిమానించేవారు,
నేను చూస్తున్నానని చెప్పి వచ్చిన వారు దొంగలు. నేను చూసినా రాని వాడు నిజమైన నాయకుడు అని భావించేవారట. ఆ లెక్కన కార్యకర్తలను, లీడర్లని అంచనా వేసేవారట రామారావు.
ఈ లాజిక్ విని రాధాకృష్ణకి మతిపోయింది. ఈ విషయాన్ని రాధాకృష్ణ.. నటుడు శరత్ కుమార్ ని ఇంటర్వ్యూ చేసే సమయంలో తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది, దాన్ని రామారావు ఇక్కడ కూడా పాటించారని చెబుతూ, ఈ సంఘటన పంచుకున్నారు ఆర్కే.
మూడుసార్లు సీఎం అయిన రామారావు
ఎన్టీఆర్ నాటకాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లోకి వెళ్లారు. 1949లో `మనదేశం` చిత్రంతో నటుడిగా మారారు. ఆ తర్వాత హీరోగా ఎదిగారు. స్టార్ హీరోగా రాణించారు.
కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే తెలుగు దేశం పార్టీని స్థాపించి 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సీఎం అయ్యారు. మూడుసార్లు సీఎంగా గెెలుపొందారు. ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ తోపాటు, తన వాళ్ల కుట్రలకు బలయ్యారు.