- Home
- Entertainment
- చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌తో పోటీపడి ఖంగుతిన్న నాగార్జున మూవీ ఏంటో తెలుసా? మెగాస్టార్ దెబ్బకి అన్ని రికార్డులు బ్రేక్
చిరంజీవి ఇండస్ట్రీ హిట్‌తో పోటీపడి ఖంగుతిన్న నాగార్జున మూవీ ఏంటో తెలుసా? మెగాస్టార్ దెబ్బకి అన్ని రికార్డులు బ్రేక్
చిరంజీవి 90లో ఓ ఊపు ఊపేశారు. ఆ సమయంలో వచ్చిన `యముడికి మొగుడు` చిత్రంతో పోటీపడి మన్మథుడు డీలా పడ్డారు. మెగా సునామీ ముందు నిలబడలేకపోయారు.

చిరంజీవితో పోటీ పడ్డ నాగార్జున
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు మాస్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు. `ఖైదీ` నుంచి `ఠాగూర్` వరకు ఓ రకంగా దాదాపు రెండు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని శాసించారని చెప్పాలి. అప్పుడే చిరంజీవి నుంచి ఏ సినిమా వచ్చినా బాక్సాఫీసుకి పూనకాలే అనేలా సాగాయి.
మధ్యలో కొంత డీలా పడ్డారు. కానీ చాలా వరకు ఈ సమయంలో చిరంజీవి కెరీర్ పీక్‌లో ఉంది. అలాంటి సమయంలో ఓ సందర్భంగా మెగాస్టార్ మూవీతో పోటీపడి డీలా పడ్డారు నాగార్జున. ఆ కథేంటో చూద్దాం.
చిరంజీవి లైఫ్‌నే మార్చేసిన `ఖైదీ` హిట్
మెగాస్టార్ చిరంజీవి ప్రారంభంలో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆయన నటించిన సినిమాలు అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి, కానీ ఆయన టాలెంట్‌ని చూపించే మూవీ పడటం లేదు.
అలాంటి సమయంలో వచ్చిందే `ఖైదీ`. ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ తర్వాత చిరు రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోగా ఎదిగారు, మార్కెట్ పెరిగింది. నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు.
అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయంగా బిజీ కావడంతో ఆ ప్లేస్‌ని చిరు భర్తీ చేశారు. వరుసగా మాస్ కమర్షియల్ మూవీస్‌తో అదరగొట్టారు. ఆ టైమ్‌లో చిరు సినిమా వచ్చిందంటే ఒక సెలబ్రేషన్‌లా ఉండేందంటే అతిశయోక్తి కాదు.
చిరంజీవి స్నేహితులే నిర్మించిన `యముడికి మొగుడు`
చిరంజీవి కెరీర్‌ని పీక్‌కి తీసుకెళ్లిన చిత్రాల్లో `యముడికి మొగుడు` ఒకటి. కొంత ఫాంటసీ మేళవింపుతో ఈ చిత్రం సాగుతుంది. చిరంజీవి ఇందులో రెచ్చిపోయి యాక్ట్ చేశారు.
యాక్షన్ పరంగానూ అదరగొట్టారు. ఎమోషన్స్ పరంగానూ అలరించే మూవీ ఇది. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వ వహించగా, విజయశాంతి, రాధా హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో వీరి కాంబినేషన్‌కి యమ క్రేజ్ ఉండేది.
ఈ మూవీని డీజీ నారాయణరావు, హరిప్రసాద్, సుధాకర్ రెడ్డి సంయుక్తంగా డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు. వీరంతా చిరంజీవి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఫ్రెండ్స్ కావడం విశేషం. రూమ్మేట్స్ కూడా.
ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `యముడికి మొగుడు`
`యముడికి మొగుడు` మూవీ 1988 ఏప్రిల్ 29న విడుదలైంది. సంచలన విజయం సాధించింది. మొదట ఆట నుంచే కలెక్షన్ల సునామీ షురూ చేసింది. ఆ ఏడాది ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఇంకా చెప్పాలంటే అత్యధిక వసూళ్లని రాబట్టి టాలీవుడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గత సినిమాల అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. అప్పుడే ఐదు కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్ సాధించిందంటే అతిశయోక్తి కాదు. అంటే సుమారు పది కోట్ల గ్రాస్ వచ్చిందనే చెప్పాలి.
`యముడికి మొగుడు`తో పోటీ పడ్డ నాగార్జున `చినబాబు`
ఓవైపు `యముడికి మొగుడు` జోరు సాగుతున్న సమయంలో వారం గ్యాప్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన `చినబాబు` చిత్రం మే 6న విడుదలైంది.
డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి ఏ మోహన్ గాంధీ దర్శకుడు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓ వైపు చిరంజీవి మూవీ సునామీ సృష్టిస్తోన్న నేపథ్యంలో ఆ స్థాయిలో ఈ మూవీ లేకపోవడంతో కలెక్షన్ల పరంగా డీలా పడిపోయింది.
ఏమాత్రం సత్తా చాటలేకపోయింది. అలా చిరంజీవి `యముడికి మొగుడు` చిత్రంతో పోటీపడి నాగార్జున `చినబాబు` చిత్రం ఖంగుతిన్నదని చెప్పొచ్చు.