- Home
- Entertainment
- 'వార్ 2' సెన్సార్ రివ్యూ.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సృష్టించే విధ్వంసానికి హద్దులు లేవు
'వార్ 2' సెన్సార్ రివ్యూ.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సృష్టించే విధ్వంసానికి హద్దులు లేవు
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 చిత్రం మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రివ్యూ బయటకి వచ్చింది.

ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన వార్ 2
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కలిసి తొలిసారి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న చిత్రం ఇది. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ దేశం కోసం ఏమైనా చేసే సైనికులుగా నటిస్తున్నారు.
KNOW
వార్ 2 సెన్సార్ కంప్లీట్
అలాంటి వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఎందుకు తలపడుతున్నారు అనేది కథలో కీలకం. ఆగష్టు 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే చిత్రం అవుతుందని అంతా భావిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ అందించారు.
వార్ 2 రన్ టైం ఏంటంటే
సెన్సార్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 3 గంటల 2 నిమిషాల చిత్రాన్ని సెన్సార్ సభ్యుల ముందు ఉంచారట. ఫైనల్ వెర్షన్ మాత్రం 7 నిమిషాలు తగ్గించి 2 గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది భారీ రన్ టైం అనే చెప్పాలి. అంత నిడివి ఉన్న ఈ చిత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్ చేస్తూ యాక్షన్ సన్నివేశాలతో అబ్బుర పరిచేలా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న.
యాక్షన్ ఎపిసోడ్స్ అంత త్వరగా మరచిపోలేరు
కానీ సెన్సార్ సభ్యుల నుంచి వార్ 2 చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కథ ఎలా ఉన్నప్పటికీ ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు, ఎన్టీఆర్, హృతిక్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ కాలం గుర్తు పెట్టుకునే విధంగా ఉంటాయని సమాచారం. సినిమాటోగ్రఫీ, విజువల్స్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటాయట. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ ఇటీవల కాలంలో రాలేదని సెన్సార్ సభ్యులు అభినందించినట్లు తెలుస్తోంది.
కూలీ X వార్ 2
వార్ 2 చిత్రానికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే.. అదే రోజున సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ తొలిసారి నటించిన చిత్రం కాబట్టి ఈ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల ప్రచార కార్యక్రమాలు పోటాపోటీగా జరుగుతున్నాయి.