- Home
- Entertainment
- నాకంటే వెనకొచ్చిన చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్, నా బ్యానర్ కూడా కొట్టేశాడు.. సీనియర్ హీరో కామెంట్స్ వైరల్
నాకంటే వెనకొచ్చిన చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్, నా బ్యానర్ కూడా కొట్టేశాడు.. సీనియర్ హీరో కామెంట్స్ వైరల్
తన కంటే వెనకొచ్చిన చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారని ఓ సీనియర్ హీరో గుర్తు చేసుకున్నారు. తన బ్యానర్ కూడా కొట్టేశాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

స్లోగా మొదలు పెట్టి అగ్ర స్థానానికి చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ తన కెరీర్ ని నెమ్మదిగా ప్రారంభించారు. ఆరంభంలోనే చిరంజీవికి అదిరిపోయే క్యారెక్టర్లు దక్కలేదు. అవసరమైనప్పుడు నెగిటివ్ రోల్స్ కూడా చేశారు. గుర్తింపు వచ్చాక హీరోగా మెరుపు వేగంతో దూసుకుపోయారు. 80వ దశకంలో ఉన్న అగ్ర హీరోలని అధికమిస్తూ చిరంజీవి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. చిరంజీవివి ఇండస్ట్రీలో ఎదిగిన విధానాన్ని, ఆయన ట్యాలెంట్ ని పలువురు ప్రముఖులు అభినందిస్తుంటారు.
KNOW
నాకంటే వెనకొచ్చిన చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్
ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ చిరంజీవి కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ఇతర నటీనటుల్ని చూసి అసూయ పడలేదని మురళి మోహన్ అన్నారు. నేను ఎక్కువగా విజయ బాపినీడు గారి బ్యానర్ లో సినిమాలు చేసేవాడిని. చిరంజీవి వచ్చాక విజయ బాపినీడు ఆయనతో ఎక్కువగా సినిమాలు చేయడం ప్రారంభించారు. పైగా నాకంటే వెనుకొచ్చిన చిరంజీవికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు.
నేనే పరిచయం చేశా
అరె చిరంజీవి నా బ్యానర్ కొట్టేశాడే, నాకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడే అని నేనెప్పుడూ బాధపడలేదు. చిరంజీవి ట్యాలెంట్ కి ఆ విధంగా అవకాశాలు వచ్చాయి. నా ట్యాలెంట్ కి తగ్గ విధంగా నాకు ఛాన్సులు వచ్చాయి అని మురళీమోహన్ తెలిపారు. వాస్తవానికి బాపినీడు గారికి చిరంజీవిని పరిచయం చేసింది నేనే.
నెగిటివ్ ఆలోచనలు లేవు
చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటున్నాను. కానీ ఆయనతో నాకు పరిచయం లేదు.. నువ్వు పరిచయం చేస్తావా అని బాపినీడు గారు నన్ను అడిగారు. దీనితో నేనే బాపినీడుగారిని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసినట్లు మురళీమోహన్ తెలిపారు. అప్పటి నుంచి చిరంజీవి, బాపినీడు కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. నేను ఎప్పుడూ ఎవరి గురించి నెగిటివ్ గా ఆలోచించను అని మురళీమోహన్ అన్నారు.
మురళీ మోహన్ ని చిరంజీవి అడిగిన మాట
చిరంజీవితో నాకు మంచి స్నేహం ఉంది. మనవూరి పాండవులు చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము సొంత అన్నదమ్ముల్లాగే ఉండేవాళ్ళం. షూటింగ్ అయిపోయిన వెంటనే కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. అప్పట్లో నేను హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాను. దీనితో థియేటర్ కి వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్స్ కోసం ఆడియన్స్ ఎగబడేవారు. చిరంజీవి చూసి అన్నయ్య ఈ విధంగా నా కోసం కూడా ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు. దీనికి పది రెట్లు వస్తారు అని చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది అని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.