సినిమాలన్నా మానేయ్, ఆ మాట చెప్పడమన్నా మానుకో.. విసిగిపోయిన ఎన్టీఆర్, జయసుధకి వార్నింగ్
జయసుధ, ఎన్టీ రామారావు కలిసి చాలా సినిమాలు చేశారు. హిట్ కాంబోగానూ నిలిచింది. అయితే ఓ విషయంలో మాత్రం జయసుధకి గట్టిగా ఝలక్ ఇచ్చాడట రామారావు.
ఎన్టీ రామారావు, జయసుధ కాంబినేషన్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అప్పట్లో వీరిది మంచి హిట్ కాంబినేషన్‌గానూ నిలిచింది. అయితే ఈ ఇద్దరు మాత్రం చాలా సెలక్టీవ్‌గానే కలిసి సినిమాలు చేశారు. వాటిలో చాలా వరకు బ్లాక్ బస్టర్స్ చిత్రాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో `అనురాగ దేవత`, `డ్రైవర్ రాముడు`, `గజదొంగ`, `సింహం నవ్వింది`, `అడవి రాముడు`, `యుగంధర్`, `శ్రీనాథ కవి సర్వభౌముడు`, `కేడీ నెం 1`, `లాయర్ విశ్వనాథ్`, `మహాపురుషుడు`, `సరదా రాముడు` వంటి పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన ఈ జంట మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఓ విషయంలో విసిగిపోయిన ఎన్టీఆర్.. జయసుధకి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందట. సినిమాలన్నా మానేయ్, లేదంటే ఆ మాట చెప్పడమన్నా మానేయ్ అనే పరిస్థితి వచ్చిందట. రామారావు ఇచ్చిన ఝలక్ తర్వాత గాడిలో పడిందట జయసుధ. మరి ఇంతకి వీరి మధ్య జరిగిందేంటి? ఎన్టీఆర్ ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందనేది చూస్తే..
జయసుధ - రోజు 2 లక్షలు డైలీ పేమెంట్
జయసుధ చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. కేవలం 13ఏళ్లకే ఆమె సినిమాల్లోకి వచ్చింది. ప్రముఖ దర్శకురాలు, నటి విజయ నిర్మల వరుసకి పిన్ని అవుతుంది. ఇద్దరి మధ్య మంచి బంధుత్వం ఉంది. చిన్నప్పుడు సరదాగా విజయ నిర్మలతో కలిసి సినిమా షూటింగ్‌లకు వెళ్లేదట. అలా సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.
విజయ నిర్మల సపోర్ట్ తోనే ఆమె సినిమాల్లోకి వచ్చింది. తాను నటించిన `పండంటి కాపురం` సినిమాలో చిన్న పాత్ర కోసం జయసుధని ఎంపిక చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోయిన్‌గా మారి ఓ ఊపు ఊపేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు, బ్లాక్ బస్టర్స్ అందుకుంది జయసుధ.
ఆమెకి 19ఏళ్లు వచ్చేసరికి మంచి క్రేజ్ వచ్చింది. స్టార్ ఇమేజ్ వచ్చింది. అప్పట్లో ఆ ఏజ్‌లో ఏ హీరోయిన్‌కి రాని క్రేజ్ వచ్చింది. టాప్ హీరోయిన్‌గా రాణించింది. ఇమేజ్, పాపులారిటీ, ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసింది. అత్యధిక పారితోషికం కూడా అందుకుంది. దీంతో ఇక తాను సినిమాలు మానేయాలనుకుందట. ఇక చాలు తాను సినిమాలు మానేస్తాను, ఒప్పుకున్న సినిమాలు చేసి ఇక చేయను అనేదట.
ఇలా చాలా సార్లు ఇలానే చెబుతూనే వచ్చింది. కానీ ఆమెకున్న క్రేజ్‌కి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. వరుసగా మేకర్స్ క్యూ కడుతూనే ఉన్నారు. తాను కూడా నో చెప్పలేక చేస్తూనే వెళ్లింది. ఎట్టకేలకు పెళ్లి కూడా కుదిరింది. దీంతో ఇక మ్యారేజ్ తర్వాత సినిమాలు మానేస్తా అని చెప్పుతూ తిరిగిందట. కానీ యదావిధిగా సినిమాలు చేస్తూనే ఉందట.
ఈ మాట ఎన్నో సార్లు విన్నారు ఎన్టీ రామారావు. ఆమె మాటలను వినీ వినీ విసిగిపోయాడు. సినిమాలు మానేస్తా అని చెబుతుంది కానీ మానేయడం లేదు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఆమెని పట్టుకుని ఝలక్ ఇచ్చాడట. మరోసారి ఆమె ఆ మాట అనకుండా చేశాడు. ఫస్ట్ నువ్వు సినిమాలన్నా మానేయ్, లేదంటే `నేను సినిమాలు మానేస్తా` అని చెప్పడం అయినా మానేయ్, ఏదో ఒకటి ఫస్ట్ చేయ్ అని వార్నింగ్ ఇచ్చాడట.
అప్పటి వరకు నార్మల్ చెబుతూ వచ్చిన జయసుధ రామారావు అంతటి సీరియస్‌గా చెప్పడంతో ఇక అప్పట్నుంచి ఆ మాట చెప్పడం మానేసిందట. తనకు వచ్చిన ఆఫర్లు చేసుకుంటూ వచ్చింది. కాకపోతే సెలక్టీవ్‌గా వెళ్లింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా నటిస్తున్న జయసుధ ఇప్పటి వరకు 300లకుపైగా సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇందులో తెలుగు సినిమాలే మేజర్‌గా ఉన్నాయి. తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ సినిమాలు చేస్తూ వచ్చింది జయసుధ. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరుస్తుంది.