MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • కొడుకు సినిమా అని చూడకుండా చెత్తకుంపలో వేయండన్న అల్లు అరవింద్‌, స్టార్‌ డైరెక్టర్‌కి ఫ్యూజులు ఎగిరిపోయిన ఘటన

కొడుకు సినిమా అని చూడకుండా చెత్తకుంపలో వేయండన్న అల్లు అరవింద్‌, స్టార్‌ డైరెక్టర్‌కి ఫ్యూజులు ఎగిరిపోయిన ఘటన

అల్లు అరవింద్‌ సినిమాలు చేయడంలో చాలా సెలక్టీవ్ గా ఉంటారు. సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేసే ఆయన కొడుకు సినిమాని చెత్తకుంపలో వేయండని చెప్పడం సంచలనంగా మారింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 20 2024, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అల్లు అర్జున్‌ ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌ గా రాణిస్తున్నారు. `పుష్ప` సినిమాతో ఆయన రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు. `పుష్ప 2` సినిమాతో అంతర్జాతీయంగా సత్తా చాటేందుకు వస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే బన్నీ రేంజ్‌ మరో స్థాయిలో ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అల్లు వారి వారసుడుగా ఎంట్రీ ఇచ్చి, మెగా ఫ్యామిలీ హీరోగా ఎదిగి ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌గా తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని, మార్కెట్‌ ని క్రియేట్‌ చేసుకున్నాడు బన్నీ. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అల్లు అర్జున్‌ కి తొలి బ్రేక్‌ వచ్చింది `ఆర్య` సినిమాతోనే. సుకుమార్‌ లాంటి క్రియేటివ్‌ జీనియస్‌ని పట్టుకుంది బన్నీ అని చెప్పాలి. ఆయన అంతగా నమ్మకపోతే `ఆర్య` వచ్చేది కాదు. అయితే అల్లు అర్జున్‌ ఈ బిగ్‌ బ్రేక్ కి ముందు `గంగోత్రి` చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

చాలా మంది కొత్త హీరోలను, ముఖ్యంగా స్టార్‌ వారసులను పరిచయం చేయడంలో దిట్ట దర్శకేంద్రుడు రాఘవేంద్రావు. బన్నీని హీరోగా పరిచయం చేసే బాధ్యతలు కూడా నిర్మాతల అల్లు అరవింద్‌.. ఆయనపై పెట్టారు. అశ్వినీదత్ తో కలిసి ఈ సినిమాని నిర్మించారు అల్లు అరవింద్‌. 

35

2003 మార్చిలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ పెద్ద రేంజ్‌ హిట్ అయితే కాదు. డీసెంట్‌గానే ఆడిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా సమయంలో ఓ షాకింగ్‌ ఇన్సిడెంట్‌ చోటు చేసుకుంది. సినిమాని చెత్త కుంపలో పడేసేంతటి పరిస్థితి ఏర్పడింది.

నిర్మాత అల్లు అరవింద్‌ చాలా డిజప్పాయింట్‌లో ఉన్నారు. ఔట్‌ పుట్‌ చూసి సినిమాని చెత్తకుంప(గోదాం)లో పడేయమని అన్నాడట. ఆయన ఓ రేంజ్‌లో ఊగిపోయాడట. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని అవమానించేంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలేమైందంటే?
 

45

`గంగోత్రి` సినిమా పూర్తయ్యాక కొంత మందికి మూవీని చూపించారు రాఘవేంద్రరావు. వాళ్లు చూసి అంతగా లేదన్నారట. ఈ మూవీ రిలీజ్‌ అయితే అల్లు అర్జున్‌ కెరీర్‌ అయిపోయినట్టే అన్నారట. ఈ విషయం అల్లు అరవింద్‌ వరకు వెళ్లింది. ఆయన కూడా చూసి సినిమా బాగా రాలేదు, దీన్ని తీసి గోదాంలో పడేయండి అన్నారట. వంద సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

ఏంటి సినిమాని ఇలా అంటున్నారని ఆయన ఆందోళనకు గురయ్యారు. చాలా టెన్షన్‌ పడ్డారట. మళ్లీ కుదురుకుని అందరిని కూర్చోబెట్టి ముందుగా తాను చెప్పిన కథ చెప్పాడట. కథగా బాగుందని, సినిమాగా చూస్తే అంతగా ఎక్కడం లేదన్నారట. మళ్లీ సీన్‌ బై సీన్‌ వివరించారు రాఘవేంద్రరావు. దీంతో కొంత వరకు కన్విన్స్ అయ్యారు.

కానీ అల్లు అరవింద్‌కి ఎక్కడో కొడుతుంది. ఫైనల్‌ మిక్సింగ్‌ అయ్యాక సినిమాని ఎట్టకేలకు రిలీజ్‌ చేశారు. మూవీకి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. బాగానే ఆడింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు స్టార్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావు. 

55

ఇలా బన్నీని పరిచయం చేసిన `గంగోత్రి` సినిమా రాఘవేంద్రరావుకి వందవ మూవీ కావడం విశేషం. తాను వంద సినిమాలు చేసినా నిత్య విద్యార్థినే అని, ప్రతి సినిమాకి నిరూపించుకోవాల్సిందే అని, అప్పుడే దర్శకుడిగా మనం నిలబడగలం అని తెలిపారు రాఘవేంద్రరావు. సౌందర్య లహరి ప్రోగ్రామంలో ఈ విషయాన్ని చెప్పారు స్టార్‌ డైరెక్టర్‌.

ఇలా కొడుకు హీరోగా సినిమా ఎంట్రీ అదిరిపోయేలా ఉండాలని భావించిన అల్లు అరవింద్‌ ఇలా రియాక్ట్ కావడం విశేషం. దర్శకుడు రాఘవేంద్రరావు ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. ఆయన నిర్మాతగా చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. సీరియల్స్ చేస్తున్నారు. 

Read More: ప్రశాంత్‌ నీల్‌తో రామ్‌ చరణ్‌ సినిమా.. ఆనంద పడలా, బాధ పడాలో అర్థం కాని పరిస్థితి.. నిరాశ పరిచే అంశమిదే!
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved