ఏ ఆర్ రెహమాన్ ను అవమానించిన సూర్య, ఇంత పని చేశాడేంటి..?
పాపం సూర్య భారీ ప్రాజెక్ట్ తో పాన్ ఇండియాను ఇంప్రస్ చేయాలని చూశాడు. కాని గట్టి దెబ్బ తిన్నాడు. ఇక సూర్యకు సంబంధించిన ఓన్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో నిజం ఎంత..?

Pan Indian Movies
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ ను చూసి ఇతర భాషల్లో కూడా స్టార్స్ పాన్ ఇండియా రేంజ్ లో.. భారీ బడ్జట్ తో సినిమాలు చేయాలి అని చూస్తున్నారు. అయితే అది అందరికి సాధ్యం కావడంలేదు. తమిళంతో పాటు బాలీవుడ్, మాలీవుడ్ హీరోలు ఎంత ప్రయత్నం చేసినా.. టాలీవుడ్ హీరోలంత సక్సెస్ ను అందుకోలేకపోతున్నారు.
కన్నడ వాళ్లు మాత్రం రెండు సినిమాలతో పాన్ఇండియాను ఇంప్రెస్ చేయగలిగారు. కెజియఫ్ తో పాటు కాంతార సినిమాలు కన్నడ సినిమాకు దేశ వ్యాప్తం గుర్తింపు తీసుకువచ్చాయి. ఇది పక్కన పెడితే తమిళ సినిమాలు మాత్రం ఎంత ప్రయత్నం చేస్తున్నా.. పాన్ ఇండియా స్ధాయిని అందుకోలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారు తమిళ హీరోలు.
తాజాగా సూర్య కూడా ఇదే ప్రయత్నం చేశాడు. మంచి మంచి కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేస్తూ వస్తున్న సూర్య. అదే కాన్సెప్ట్ తో.. భారీ బడ్జెట్ ను జోడించి.. కంగువ అనే అద్భుతమైన సినిమా చేశాడు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని నమ్మారు. నిర్మాత అయితే వెయ్యి కాదు ఏకంగా 2000 కోట్ల కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యపోవలసరం లేదు అన్నారు.
ఫ్యాన్స్ కూడా ఈమూవీకు బాగా హైప్ ఇచ్చారు. అన్ని భాషల్లో ప్రమోషన్స్ ను భారీగా నిర్వహించారు. కాని ఈసినిమా 100 కోట్లు కూడా సాధించలేకపోయింది. అంతేకాదు భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో సూర్య భాగా డిస్సపాయింట్ అయ్యారు. సూర్య ఫ్యాన్స్ కూడా నెక్ట్స్ సినిమాల మీద హోప్స్ ను కంప్లీట్ గా వదిలేసుకున్నారు.
ఇక సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ తో ఒక మూవీ చేస్తున్నారు. అటు ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ తో సూర్య నటిస్తున్న సినిమాకి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. అది ఒక రకంగా షాకింగ్ అని చెప్పవచ్చు. ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ని తీసుకున్నాడట దర్శకుడు.
అయితే ఆయన చేసిన ట్యూన్స్ సినిమాకు ఏమాత్రం సూట్ అవ్వలేదట. దాంతో వెంటనే రెహమాన్ ను తొలగించి కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అయిన అభయంకర్ ను తీసుకున్నారట. ఈ విషయంలో సూర్య కూడా డైరెక్టర్ ఆర్జే బాలాజీకి సపోర్ట్ చేయడంతో పాటు అండగా నిలిచాడట. దాంతో సూర్య రెహమాన్ ను అవమానించడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
దర్శకుడికి రెహమాన్ ను వాడుకోవడం రాక .. ట్యూన్స్ బాలేవు అంటున్నాంటున్నారు సోషల్ మీడియాలో దీనిపై సోషల్ మీడియా లో కొన్ని నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలాజీ కి సరిగా రెహమాన్ ని ట్యూన్స్ కొట్టించుకోవడం రాలేదని, దానిని కవర్ చేసుకోవడానికే ఇలా తప్పు మొత్తం రెహమాన్ మీదకు నెట్టేస్తున్నాడని అంటున్నారు నెటిజెన్స్. ఇక కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అయిన అభయంకర్ ప్రస్తుతం సౌత్ లో ఇప్పుడిప్పుడే స్టార్ గా మారుతున్నాడు. అనిరుధ్ టైప్ లో ఆయన ఎదిగేప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.