సౌందర్య 100 కోట్ల ఆస్తి చుట్టు మోహన్ బాబు - మనోజ్ వివాదం, మంచువారి లొల్లి పై నిజానిజాలు ఏంటి..?
మంచువారి ఇంటి వివాదానికి.. హీరోయిన్ సౌందర్యకు సబంధం ఏంటి..? సౌందర్య ఆస్తి గురించే వీరి మధ్య వివాదం చెలరేగిందా..? అసలు నిజానిజాలు ఏంటి..? రూమర్స్ వెనుక విషయం ఏంటి..?
ప్రస్తుతం మంచువారి వివాదం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇంటి గుట్టు రచ్చకెక్కిడంతో అది కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అసలు విషయం ఎక్కడ మొదలయ్యింది. ఎటువైపు వెళ్తోంది అనేది తెలియడంలేదు. మొన్నటి వరకూ నాలుగు గోడల మధ్య కుటుంబ విషయంగా ఉన్న ఈ గొడవ.. ప్రస్తుతం వీధికెక్కి రచ్చ రచ్చగా మారింది.
Also Read: రెచ్చిపోయిన మోహన్ బాబు, కొడుకు మనోజ్ తో పాటు మీడియా ప్రతినిధులపై దాడి,
మంటకు పెట్రోలో తోడయినట్టు.. మోహన్ బాబు కోపంలో మీడియా ప్రతినిధిని గాయపరచడంతో.. ఇది కాస్త మరింత వివాదంగా మారింది. మోహన్ బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా మండిపడుతున్నాయి జర్నలిస్ట్ సంఘాలు.
అటు మీడియా ప్రతినిధి అయ్యప్ప మాలలో ఉండటంతో.. అటు అయ్యప్పలు కూడా మోహన్ బాబును శిక్షించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే అసలు ఈ వివాదం ఎక్కడ మొదలయ్యింది. ఈ వివాదానికి 20 ఏళ్ళ క్రితం మరణించిన హీరోయిన్ సౌందర్యకు సబంధం ఏంటి..?
Also Read: రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు..? రహస్య ప్రేమ వెనుక నిజానిజాలు..?
ప్రస్తుతం శంషాబాద్ శివారు ప్రాతంలోని జల్ పల్లి లో భారీ బంగ్లాలో ఉంటున్నాడు మోహన్ బాబు. ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటున్నారు. అయితే ఈ బంగ్లా కట్టిన ప్లేస్ హీరోయిన్ సౌందర్యదని, ఆమె మరణం తరువాత అతితక్కువ ధరకు వారి ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు ఈ ప్లేస్ ను కొనుగోలు చేశారని అంటున్నారు.
హీరోయిన్ గా బిజీగా ఉన్న టైమ్ లో సౌందర్య భాగా సంపాదించింది. ఆ సంపాదనతోనే ఇక్కడ భూమి కొనుగోలు చేసిందట. అసలు ఇక్కడ బంగ్లా కూడా ఆమె కట్టిందని. దాన్ని మోహన్ బాబు ఇంకాస్త పెద్దదిగా కట్టించారని మరికొంత మంది వాదన.
అంతే కాదు ప్రస్తుతం ఈ ఆస్తి విలువ 100 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఇందులో నిజానిజాలు ఎన్ని ఉన్నయో తెలియదు కాని.. ఈ స్థలం మోహన్ బాబు సౌందర్య ఫ్యామిలీ నుంచి లాక్కున్నారు అని అనేవారు కూడా లేకపోలేదు. అసలు నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
Also Read:ఏ ఆర్ రెహమాన్ ను అవమానించిన సూర్య, ఇంత పని చేశాడేంటి..?
అయితే ఈ స్థలం.. ఆ పెద్ద విలాసవంతమైన బంగ్లా చుట్టునే వివాదం రాజుకుంది అని సమాచారం. ఆస్తుల పంపకాలు జరిగితే ఈ ప్లేస్, ఆబంగ్లా తరకు కావాలి అంటున్నాడట మనోజ్. కాని మనోజ్ రెండో పెళ్లి.. భూమా మౌనిక అంటే నచ్చని మోహన్ బాబు, విష్ణు.. ఈ బంగ్లాను ఇవ్వడానికి నిరాకరించినట్టు సమాచారం. అంతే కాదు వీరి పెళ్ళి జరిగినప్పటి నుంచి ఈ వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది.
మౌనిక మొదడి భర్తకు కలిగినతనయుడు మనోజ్ తో ఉండటం కూడా మంచు ఫ్యామిలీకి ఇష్టంలేదని తెలుస్తోంది. ఇక మంచువారి విద్యాసంస్థలు, విష్ణు దుబాయ్ వ్యాపారాలకుసబంధించిన విషయాలు బయటపెడతానని మనోజ్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియో ప్రకారం మనోజ్, అతని భార్య మౌనిక కలిసి తాగి ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని. పనివాళ్లను కొడుతున్నారని, ఆస్తి కోసం అన్న విష్ణును చంపుతానని బెధిరించాడని, రోజంతా తాగుతూ గొడవ చేస్తున్నాడని మోహన్ బాబు వర్షన్.
ఆస్తి తన కష్టార్జితం, నచ్చినవారికి ఇస్తాను. లేకపోతే ఏట్లో కలిపేస్తాను.. అడిగే హక్కు మనోజ్ కు లేదు. ఆ ఇంట్లోకి రావాలన్నీ.. తన అనుమతి తీసుకోవల్సిందే. నీ కష్టార్జితం ఉంటే.. ఆ ఇంట్లో నువ్వు ఉండు. అందరికంటే గారాబంగా పెంచినందుకు గుండెలపై తన్నివాంటు మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కొలిక్కి రావల్సి ఉంది.
మోహన్ బాబు దాడి చేయించారంటూ మనోజ్.. మనోజ్ కొట్టాడంటూ మోహన్ బాబు హస్పిటల్ లోఉన్నారు. ఇద్దరికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది. మరి అసలు నిజానిజాలు ముందు ముందు తెలుస్తాయేమో చూడాలి. మీడియాపై దాడి విషయంలోమాత్రం మోహన్ బాబుపై కేసు నమోదు అయ్యింది.