- Home
- Entertainment
- ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు అత్యధిక పారితోషికం తీసుకున్న తొలితరం హీరో ఎవరో తెలుసా? వేల కోట్లకు అధిపతి
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాదు అత్యధిక పారితోషికం తీసుకున్న తొలితరం హీరో ఎవరో తెలుసా? వేల కోట్లకు అధిపతి
తొలితరం హీరోల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వీరిలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో ఎవరో తెలుసా? ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్.

ntr, anr, krishna, sobhan babu, krishnam raju
ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, కైకాల సత్యనారాయణ వంటి వారిని తొలితరం హీరోలుగా చెబుతుంటారు. అప్పట్లో వీరంతా తమనలో ఉన్న ఆర్ట్ ని, నటన అనే ఆసక్తిని వెల్లడించేందుకు,
తాము కళాకారులుగా రాణించేందుకు, తమ ప్రతిభని చాటి చెప్పేందుకు ప్రయత్నించారు. అందులో సక్సెస్ కావాలని తపించారు. అంతేకాదు ఆర్థికంగా సంపాదించాలని, కోటీశ్వరులు కావాలని సినిమాలు చేసేవారు కాదు. ఆర్టిస్ట్ లంతా ఉద్యోగులుగానే భావించేవారు.
ntr, anr, krishna, sobhan babu, krishnam raju
అప్పట్లో రెమ్యూనరేషన్స్ పెద్దగా ఉండేవి కావు, పెద్దగా డిమాండ్ చేసేవారు కూడా కాదు. నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకునేవారు. అప్పట్లో దర్శకుడు, నిర్మాతల డామినేషన్ ఎక్కువగా ఉండేది.
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సూపర్ స్టార్స్ అయ్యాక వారు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లారు. వాళ్లు ఇండస్ట్రీని శాషించే స్థాయికి ఎదిగారు.మరి అప్పట్లో ఎవరు ఎక్కువ పారితోషికం తీసుకునేది? ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉండేది అనేది చూస్తే.
ntr, anr, krishna, sobhan babu, krishnam raju
ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాలు ఎక్కువగా చేశారు. సంఘీకాలు తక్కువ అనే చెప్పాలి. ఏఎన్నార్ లవ్ స్టోరీలు, కొన్ని సంఘీక చిత్రాలు చేశారు. కృష్ణ యాక్షన్ సినిమాలు చేశారు. కృష్ణంరాజు సైతం యాక్షన్ మూవీస్, కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేశారు.
కానీ శోభన్ బాబు చాలా వరకు ఫ్యామిలీ చిత్రాలు చేశారు. ప్రారంభంలో నటుడిగా నిలబడేందుకు ఆయన పౌరాణికాలు, సంఘీకాలు, జానపద చిత్రాలు చేసినా, అవి కొంత వరకు ఆ తర్వాత, కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాలు చేశారు. అలా ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. తెలుగు తెర `సోగ్గాడి`గా వెలిగారు.
sobhan babu
అప్పట్లో ఎక్కువ క్రేజ్ ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కంటే శోభన్‌బాబు కి ఉండేదట. ఆయన సినిమాలనే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వచ్చి చూడటంతో డిమాండ్ ఎక్కువగా ఉండట. అలా ఆయన అప్పట్లో ఎక్కువ పారితోషికం తీసుకునేవారట. అప్పట్లోనే ఆయన పారితోషికం ఒక్కో సినిమాకి రెండు లక్షలకుపైగానే ఉండేడట.
హీరోల్లో ఆయనదే హైయ్యెస్ట్ అని ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ `ఐడ్రీమ్` ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా సోగ్గాడు అప్పట్లో కొన్నాళ్లపాటు గట్టిగానే సంపాదించాడు. తన పారితోషికాలతోనే ఆయన కోట్ల ఆస్తులు కొన్నారు. ఇప్పుడు అవి వేల కోట్లు అయ్యాయి.
Sobhan Babu
అప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు తక్కువ పారితోషికమే తీసుకునేవారని, సినిమాలకే ప్రయారిటీ తప్ప, పారితోషికాలకు వ్యాల్యూ ఇచ్చేవారు కాదన్నారు. అయితే ఎన్టీఆర్ `బడిపంతులు` కొంత కాలం డౌన్ అయ్యారు. సినిమాలు పెద్దగా ఆడలేదట. దీంతో కొంత గ్యాప్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేసి బాగా పుంజుకున్నాడని, పారితోషికం కూడా గట్టిగానే అందుకున్నాడని తెలిపారు.