- Home
- Entertainment
- తండ్రితో ఎఫైర్, కొడుకుతో పెళ్లి ?, సిల్క్ స్మిత జీవితంలో మతిపోయే కోణం.. అందుకే ప్రియుడు ఆ పని చేశాడా?
తండ్రితో ఎఫైర్, కొడుకుతో పెళ్లి ?, సిల్క్ స్మిత జీవితంలో మతిపోయే కోణం.. అందుకే ప్రియుడు ఆ పని చేశాడా?
Silk Smitha: సిల్క్ స్మిత.. రాధాకృష్ణ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే విషయం అందరికి తెలిసిందే. అతనే మోసం చేశాడని ఆమె తెలిపింది. కానీ ఆయన కొడుకుని సిల్క్ స్మిత పెళ్లి చేసుకోవాలనుకుందా?

Silk Smitha
Silk Smitha: సిల్క్ స్మిత.. ఉవ్వెత్తున్న ఎగిసి పడ్డ అందాల కెరటం. వ్యాంప్ పాత్రలతో, బోల్డ్ రోల్స్ తో కనువిందు చేసిన నటి. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న నటి. తాను ఆఫర్ల కోసం వెంటపడటం నుంచి తన కోసం స్టార్ హీరోలు వెయిట్ చేసేంత స్థాయికి ఎదిగిన నటి. ఐటెమ్ సాంగ్స్, వ్యాంప్ రోల్స్, బోల్డ్ గా ఉండే పాత్రల్లో ఎక్కువగా నటించింది సిల్క్ స్మిత.
Silk Smitha
హీరోయిన్‌గానూ చాలా సినిమాలు చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్లకి పోటీ ఇచ్చింది. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, ఎంత పెద్ద హీరోయిన్ ఉన్నా, సిల్క్ స్మిత అందులో ఉండాల్సిందే అనేట్టుగా అప్పట్లో పరిస్థితి ఉండేది. ఆమె కోసం మాస్ ఆడియెన్స్ క్యూలు కట్టేవారు. ఆమె కోసమే సినిమాలకు వచ్చే వారు కోట్ల మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
silk smitha
చాలా పేదరికం నుంచి, తిండి లేని దశ నుంచి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగింది. ఆకలి కోసం అలమటించిన పరిస్థితి నుంచి నోట్ల కట్టలపై పడుకునే స్థాయికి ఎదిగింది. అంతలోనే తన కెరీర్‌ని నాశనం చేసుకుంది. ప్రియుడి వలలో పడి మోసపోయింది. మోసాలను తట్టుకోలేక దిక్కులేని మరణం పొందింది. అనాథలా ఆమె అంత్యక్రియలు జరిగడం అత్యంత బాధాకరం.
Silk Smitha
ఇదిలా ఉంటే సిల్క్ స్మిత కెరీర్ డౌన్ కావడానికి, ఆమె ఆత్మహత్య పరిస్థితికి వెళ్లడానికి కారణం ఆమె ప్రియుడు రాధాకృష్ణ అని అంటుంటారు. తన సూసైడ్ నోట్‌లో కూడా ఆమె ఈ విషయాన్ని మెన్షన్ చేసింది. ఆర్‌ఎంపీ డాక్టర్‌గా ఉన్న రాధాకృష్ణ సిల్క్ స్మితకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసకునేవాడట.
అందుకూ ఓ కారణం ఉంది. చెన్నైలో టీ నగర్ వీధుల్లో గ్యాంగ్‌లు ఉండేవట. ఒంటరిగా ఉన్న మహిళలు, సినిమాల్లో నటించిన ఆడవారంటే చిన్నచూపు, చులకన భావం ఉండేది. వారు అఘాయిత్యాలకు పాల్పడేవారు. వారి నుంచి రక్షణ పొందేందుకు సిల్క్ స్మిత రాధాకృష్ణకి దగ్గరయ్యింది. తనకు తెలిసిన వ్యక్తి, దగ్గరి ఊరు అనే భావనతో ఆయన్ని ఎంకరేజ్ చేసింది. ఆయనతో ఎఫైర్ కూడా పెట్టుకుంది. కానీ అతను తన డబ్బు మొత్తం కాజేసేవాడట.
Silk Smitha
అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గ్లామర్ పాత్రలతో మెప్పించిన ఆమె సిల్క్ స్మితకు సమకాలీకురాలు. తనముందు వచ్చిన సిల్క్ స్మిత తాను చూస్తుండగానే ఎదిగిపోయిందని, తనని చిన్న చూపు చూసినవారిని తన యాటిట్యూడ్‌తో సమాధానం చెప్పిందని, తనని తిప్పించుకున్న వాళ్లనే తాను తిప్పించుకుందని తెలిపింది.
ఈ క్రమంలోనే సిల్క్ స్మిత మరణానికి కారణం రాధాకృష్ణ అనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పింది. రాధాకృష్ణ కొడుకుని పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని, తనకంటూ ఓ ఫ్యామిలీని ఉండాలని కోరుకుందని,
కానీ ఈ విషయం రాధాకృష్ణకి తెలిసిన తర్వాత నుంచి గొడవలు ప్రారంభమయ్యాయని, చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది జయశీల. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించి షాకిచ్చింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
read more: మూడు గంటలు క్యాన్సర్ ఆపరేషన్, సాయిబాబా గుడిలో నాగార్జున.. ఏఎన్నార్ మాటలకు కన్నీళ్లు
also read: రజనీకాంత్‌కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? దానికోసం అర్థరాత్రి మారువేషంలో వాళ్లింటికి వెళ్లేవాడా?