- Home
- Entertainment
- ఆ హీరోయిన్ నడుముని చూస్తే ఏఎన్నార్ ఏజ్ 25 అయిపోతుందా? అక్కినేని చిలిపి పనులు బయటపెట్టిన సీనియర్ నటి
ఆ హీరోయిన్ నడుముని చూస్తే ఏఎన్నార్ ఏజ్ 25 అయిపోతుందా? అక్కినేని చిలిపి పనులు బయటపెట్టిన సీనియర్ నటి
ANR: అక్కినేని హీరోలంటేనే రొమాంటిక్ అనే కామెంట్ వినిపిస్తుంది. నాగార్జున అత్యంత రొమాంటిక్ అంటుంటారు. కానీ కొడుకుని మించిన మన్మథుడు అక్కినేని నాగేశ్వరరావు అట. ఆ కథేంటో చూద్దాం.

ANR
ANR: అక్కినేని నాగేశ్వరరావు లెజెండరీ నటుడు. అలుపెరగని నటనా బాటసారిగా రాణించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరం హీరోల్లో ఎన్టీఆర్‌కి ధీటుగా రాణించిన నటుడు. ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణికాలు చేస్తే, ఏఎన్నార్ ప్రేమ కథలు, కుటుంబ కథలు, సాంఘీకాలు చేసి మెప్పించారు.
ANR
ఏఎన్నార్ అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఇమేజ్ మాత్రమే కాదు, రియాలిటీ కూడా అదే. ఆయన ఎప్పుడూ రొమాంటిక్‌గా ఉండేవాడట. హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన ఏజ్ తగ్గిపోతుందని, కుర్రాడిలా ప్రవర్తిస్తాడని అంటుంటారు. సీనియర్ నటి ఒకరు కూడా ఇదే విషయం చెప్పారు. తన నడుముని పట్టుకుని కామెంట్లు చేసేవాడని తెలిపింది.
Jayamalini
ఆ హీరోయిన్ నడుము చూస్తే ఏఎన్నార్ ఏజ్ 25 అయిపోతుందట. ఏజ్ మాత్రమే కాదు, మనసు కూడా అలానే ఉంటుందన్నారు. కుర్రాడిలా ప్రవర్తిస్తాడని తెలిపింది. ఆమె ఎవరో కాదు సీనియర్ నటి జయమాలిని. ఒకప్పుడు వ్యాంప్ పాత్రలతో మెప్పించారు ఆమె.
ముఖ్యంగా శృంగారభరిత పాటల్లో(ఐటెమ్ సాంగ్)ల్లో నర్తించి ఉర్రూతలూగించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాలం, హిందీ వంటి భాషల్లో 600లకుపైగా సినిమాలు చేశారు. వాటిలో పాటల్లోనే కాదు, నటిగానూ మెప్పించారు. హీరోయిన్‌గానూ నటించారు.
anr
ఆ మధ్య తెలుగు వన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయమాలిని.. ఏఎన్నార్ చిలిపి వ్యవహారాలు బయటపెట్టింది. ఆయన తన నడుముని చూసి కామెంట్ చేసేవాడట. తాను ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాం.
తనని హీరోయిన్‌లా చూడరు, ఓ అత్తకూతురిలా చూస్తుంటారు. సరదాగా ఉంటారు. కామెంట్లు చేస్తుంటారు. ఆయనకు ఎప్పుడు 25 ఏజ్, ఆల్వేస్ అలానే ఉంటారు. నేను సైలెంట్‌గా ఉంటానని నాతో సరసం ఆడుతుంటాడు.
Jayamalini
ఓ సినిమాలో నడుము పట్టుకుని ఆడాలి. ఆ సీన్ వచ్చినప్పుడు `అబ్బ నాకు హాయిగా ఉందబ్బ. ఈ నడుము పట్టుకుంటే స్టాండ్ వేయక్కర్లేదు, ఈజీగా ఉంది పట్టుకోవడానికి` అంటూ కామెంట్ చేసేవాడట.
హీరోయిన్లు కనిపిస్తే చాలు ఆయనలో చిలిపితనం బయటకు వస్తుందని, అందరిని ఏదో ఒకటి అంటుంటారని, జయమాలిని విషయంలో అది ఎక్కువగా ఉంటుందని, తనని చూడగానే కుర్రాడిలా మారిపోతాడని తెలిపింది జయమాలిని. ఆమె ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
read more: Mazaka Review: `మజాకా` మూవీ రివ్యూ