- Home
- Entertainment
- బిగ్ సర్ప్రైజ్, నితిన్ తమ్ముడు చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్.. ఆ సీన్లు తొలగించేందుకు దిల్ రాజు నో
బిగ్ సర్ప్రైజ్, నితిన్ తమ్ముడు చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్.. ఆ సీన్లు తొలగించేందుకు దిల్ రాజు నో
తాజాగా ‘తమ్ముడు’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ఆశించినట్టుగా యూఏ సర్టిఫికెట్ కాకుండా సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికేట్ మంజూరు చేసింది.

నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో ఈ చిత్రం వస్తోంది. అయితే పవన్ తమ్ముడు చిత్రానికి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. కథ పరంగా తమ్ముడు టైటిల్ పర్ఫెక్ట్ అని పెట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. జూలై 4న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతుండడంతో.. రిలీజ్ కి అవసరమైన కార్యక్రమాలని చిత్ర యూనిట్ పూర్తి చేస్తోంది.
తాజాగా ‘తమ్ముడు’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా ఆశించినట్టుగా యూఏ సర్టిఫికెట్ కాకుండా సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికేట్ మంజూరు చేసింది. దీనిపై చిత్ర బృందం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.ఇది ప్రేక్షకులకు షాకింగ్ అనే చెప్పాలి. అందరూ తమ్ముడు చిత్రానికి ఎ సర్టిఫికెట్ రావడంతో ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం ఉంది. ఇందులో హింసాత్మక సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. వాటిని తొలగిస్తేనే యుఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు తెలిపింది. కానీ దిల్ రాజు ఆ సన్నివేశాలని తొలగించేందుకు అంగీకరించలేదు. అందువల్లే సెన్సార్ వాళ్ళు ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్ అందించారు.
సినిమా థీమ్ కి హింసాత్మక సన్నివేశాలు కీలకమైనవి కావడంతో, వాటిని తక్కువ చేయకుండా అలాగే ఉంచాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా 'తమ్ముడు'కు ఎ సర్టిఫికేట్ వచ్చింది.
ఇది సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని రూపొందించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా. నితిన్ ఇందులో తమ్ముడు పాత్రలో కనిపించగా, ప్రముఖ నటి లయ సోదరి పాత్ర పోషిస్తున్నారు. కథలో రాజకీయాలు, బిజినెస్ మాఫియా అంశాలు కీలకంగా ఉంటాయి. కథ నేపథ్యం ఆంధ్రా ప్రాంతంలో చోటుచేసుకుంటుంది.
ఇక ఈ సినిమా ద్వారా కాంతారా చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సప్తమి గౌడ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇది ఆమె తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రమోషన్లకు సన్నద్ధమవుతోంది. ‘తమ్ముడు’ సినిమా 2025 జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సర్టిఫికేషన్ విషయంలో చిత్ర యూనిట్ తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఎమోషన్‌తో పాటు యాక్షన్ హై రేంజ్ లో ఉన్నట్లు ఎ సర్టిఫికెట్ ద్వారా అర్థం అవుతోంది. పైకి సిస్టర్ సెంటిమెంట్ మూవీలా కనిపిస్తున్నప్పటికీ ఇది ఫ్యామిలీ చిత్రం కాదని.. విజువల్స్ అద్భుతంగా ఉండే థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అని దిల్ రాజు ఆల్రెడీ ప్రకటించారు.
వరుస పరాజయాల తర్వాత నితిన్ నుంచి వస్తున్న చిత్రం ఇది. ఈ మూవీ నితిన్ కెరీర్ కి కీలకం కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అదే విధంగా ఈ చిత్రంతో సీనియర్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తుండడం కూడా మరో విశేషం.