- Home
- Entertainment
- Movie Reviews
- ఆ స్టార్ హీరో సౌందర్యకి లవ్ లెటర్ రాశారా ? ఆయన ఎంత రచ్చ చేశారో తెలుసా..
ఆ స్టార్ హీరో సౌందర్యకి లవ్ లెటర్ రాశారా ? ఆయన ఎంత రచ్చ చేశారో తెలుసా..
దివంగత నటి సౌందర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగారు. 90 దశకంలో సినిమాల్లోకి అడుగుపెట్టి 100 చిత్రాల్లో నటించిన అరుదైన నటిగా ఆమె ఘనత సాధించారు.

దివంగత నటి సౌందర్య దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగారు. 90 దశకంలో సినిమాల్లోకి అడుగుపెట్టి 100 చిత్రాల్లో నటించిన అరుదైన నటిగా ఆమె ఘనత సాధించారు. గ్లామర్ షో కి ఏ మాత్రం ఆస్కారం లేకుండా దక్షిణాదిలో అగ్ర హీరోలు అందరితో ఆమె నటించారు. ఎన్నో ఘన విజయాలు సాధించారు.
అయితే ఊహించని విధంగా సౌందర్య 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలో సౌందర్యకి చాలా తక్కువ మంది మాత్రమే స్నేహితులు ఉన్నారు. ఆమెతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేసిన హీరో అంటే జగపతి బాబు మాత్రమే. దీంతో వీరిద్దరి గురించి అప్పట్లో అనేక రూమర్స్ వచ్చాయి.
అప్పట్లో ఓ మ్యాగజైన్ లో జగపతిబాబు, సౌందర్య రిలేషన్ గురించి కథనం ప్రచురించారు. రూమర్స్ వల్ల జగపతిబాబు చాలా డిస్టర్బ్ అయ్యారట. ఆ మ్యాగజైన్ రామోజీరావు కి చెందినది. ఆ కథనం ప్రచురించిన వారిని అడిగితే కేర్ లెస్ గా సమాధానం ఇచ్చారట. అంతటితో ఆగకుండా జగపతిబాబు రామోజీరావు దగ్గరికి వెళ్లారు.
నేను నా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాను. మీ సంస్థలో వచ్చిన ఈ రూమర్స్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో తెలుసా? నా విషయం పక్కన పెట్టండి సౌందర్య పరిస్థితి ఏంటి.. భవిష్యత్తులో ఆమె పెళ్లి చేసుకోవాలి కదా అని జగపతిబాబు రామోజీరావుని ప్రశ్నించారట. తన ఆవేదన అర్థం చేసుకొని రామోజీరావు ఆ కథనం ప్రచురించిన వారిపై వెంటనే యాక్షన్ తీసుకున్నారని జగపతిబాబు తెలిపారు.
జగపతిబాబు, సౌందర్య గురించి ఇండస్ట్రీలో కూడా రూమర్స్ వచ్చాయి. వాటి గురించి జగపతిబాబు స్పందిస్తూ.. సౌందర్య నాకు క్లోజ్ ఫ్రెండ్. స్నేహం చేశాను కాబట్టి మా ఇద్దరి మధ్య పొగ పెట్టారు. దీంతో ఆ రూమర్స్ మంటలుగా మారి వ్యాపించాయి అని జగపతిబాబు అన్నారు. సౌందర్య చాలా సంప్రదాయ బద్ధమైన కుటుంబంలో పెరిగింది. అంత ఈజీగా ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయదు. కానీ నాతో చేసింది.
వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా తమ ఇంట్లోకి నన్ను రానిచ్చేవారు. సౌందర్య సోదరుడు అమర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. వాళ్లంతా నాతో మాత్రమే ఎందుకు అంత చనువుగా ఉన్నారు? ఎందుకంటే నేను చెడ్డ వ్యక్తిని కాదు అనేది వాళ్ళ నమ్మకం. సౌందర్య చనిపోయినప్పుడు నేను మలేషియాలో ఉన్నాను. ఆమె చనిపోయిందని ఫోన్ రాగానే నేను వెంటనే అడిగిన ప్రశ్న అమర్ బ్రతికున్నాడా లేదా? అమర్ గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు అడిగాను అంటే అతడు కూడా నాకు ఫ్రెండ్.
సౌందర్య, నాకు మధ్య రూమర్స్ రావడానికి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగాయి. దానివల్ల ఇండస్ట్రీలో ఏదేదో ఊహించుకున్నారు. ఒకసారి నేను డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వెళ్లాను. అనుకోకుండా ఆయనతోపాటు సౌందర్య కూడా వచ్చింది. దీంతో అంతా సౌందర్యని రిసీవ్ చేసుకోవడానికి జగపతిబాబు వెళ్ళాడని ప్రచారం చేశారు. నిజంగా నా మైండ్ లో చెడు ఉద్దేశం ఉంటే.. ఈ రూమర్స్ ని నా పబ్లిసిటీ కోసం వాడుకోవచ్చు. సౌందర్య తో ఎఫైర్ నిజమే అన్నట్లుగా లీకులు వదిలితే నాకు పబ్లిసిటీ పెరుగుతుంది. కానీ నేను అలా చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే సౌందర్య కి నాకు మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే.
కబడ్డీ కబడ్డీ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో జగపతిబాబు సౌందర్య కోసం లవ్ లెటర్ రాసినట్లు కూడా రూమర్స్ వచ్చాయి. ఈ వార్తలను జగపతిబాబు తీవ్రంగా ఖండించారు. ఈ రూమర్స్ వినడానికి కూడా కామెడీగా ఉన్నాయి. ఆ టైంలో నా వయసెంత? అలాంటి పనులు నేనెందుకు చేస్తాను? అని ప్రశ్నించారు. సౌందర్య జగపతిబాబు కలిసి పెళ్లి పీటలు, దొంగాట, భలే బుల్లోడు లాంటి చిత్రాల్లో నటించారు.