Nithiin: ఏడు ఫ్లాపుల తర్వాత తేరుకున్న నితిన్.. సైన్స్ ఫిక్షన్ కథతో పెద్ద ప్రయోగం
Nithiin: వరుస పరాజయాల తర్వాత నితిన్ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేశారు. తాజాగా నితిన్ తదుపరి చిత్రానికి సంబందించిన ప్రకటన వెలువడింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

నితిన్ వరుస ఫ్లాపులు
యంగ్ హీరో నితిన్ కి భీష్మ చిత్రం తర్వాత వరుసగా 7 ఫ్లాపులు పడ్డాయి. ఇటీవల అయితే నితిన్ కి కెరీర్ లో దారుణమైన డిజాస్టర్లు ఎదురయ్యాయి. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు ఇలా నితిన్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే.
తమ్ముడు డిజాస్టర్
ఇలా వరుస ఫ్లాపులు ఉన్నప్పుడు నెక్స్ట్ మూవీని ప్రారంభించడం అంత సులభం కాదు. నితిన్ నటించిన చివరి చిత్రం తమ్ముడు. గతేడాది జూలైలో విడుదలయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నితిన్ త్వరగానే తేరుకుని తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు.
సైన్స్ ఫిక్షన్ మూవీ
వరుస ఫ్లాపుల్లో కూడా ప్రయోగాలు చేయడం ఆపడం లేదు. నితిన్ కొత్త చిత్రం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఉండబోతోంది. ఈ ఆసక్తికర కాంబినేషన్ కి సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని కథ..అయినప్పటికీ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని చిత్ర యూనిట్ ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నో బడీ నో రూల్స్
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ప్రకటించలేదు కానీ.. నో బడీ నో రూల్స్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో షాడోలో నితిన్ లుక్ కూడా పాక్షికంగా కనిపిస్తోంది.నితిన్ సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నాడు.
విఐ ఆనంద్ సినిమాలు
గతంలో దర్శకుడు విఐ ఆనంద్.. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవ కోన లాంటి చిత్రాలని తెరకెక్కించారు. ఆయన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యమైన పాయింట్ ఉంటుంది. కానీ ఆడియన్స్ కి తన చిత్రాలని నచ్చేలా తెరకెక్కించడంలో విఫలమవుతున్నారు. ఈ చిత్రం విజయం సాధించడం నితిన్, విఐ ఆనంద్ ఇద్దరికీ అవసరమే.

