- Home
- Entertainment
- Karthika Deepam: జ్వాలనే శౌర్య అని నిజం తెలుసుకున్న నిరుపమ్.. హిమ గురించి ప్రేమ్ బెంగ!
Karthika Deepam: జ్వాలనే శౌర్య అని నిజం తెలుసుకున్న నిరుపమ్.. హిమ గురించి ప్రేమ్ బెంగ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంబంలోనే శౌర్య, చంద్రుడు ఆస్పుత్రి బయట బాధపడుతూ ఉంటారు. పిన్నికి ట్రీట్మెంట్ చేసేది పెద్ద డాక్టరేనట.. నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్తారు. అప్పడే ఐసీయూ నుంచి చంద్రమ్మను బయటకు తీసుకొస్తారు.. అప్పుడు అక్కడ హిమను చూసి ఆశ్చర్య పోయి ఏంటి ఇది అని అడిగితే తనే ఇక్కడకు తీసుకొచ్చింది అని చెప్తాడు. దాంతో సీరియస్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతే హిమ ఆపుతుంది.
కానీ అక్కడే అందరి ముందు హిమను తిడుతుంది. శౌర్య జరిగింది వేరు నువ్వు అర్థం చేసుకుంది వేరు అని హిమ ఎంత చెప్పిన ఏ మాత్రం అర్ధం చేసుకోకుండా శౌర్య హిమను మాటలు అంటూనే ఉంటుంది. నువ్వు ఏంటో నీ చరిత్ర ఏంటో అంత తెలుసు అని అంటుంది.. ఇక అప్పుడే ఏంటి అలా చూస్తున్నావ్.. శోభ అన్ని నాకు నిజాలు చెప్పింది అని శౌర్య అంటే అది చెప్పింది నిజం కాదు మోసకారి అని అంటుంది.
అబ్బబ్బా ఏం చెప్పావ్ అని శోభ మరి వెటకారంగా మాట్లాడుతుంది.. నా జీవితాన్ని నాశనం చేశావ్ అంటూ మళ్లీ మళ్లీ అవే మాటలు అంటూ హిమను ఘోరంగా అవమానిస్తూనే ఉంటుంది. నన్ను చంపడం ఒక్కటే మిగులుంది ఇంకేం ఉందని అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్ లో సౌందర్య, ఆనంద్ రావుల దగ్గరకు స్వప్న వచ్చి ఏంటిది అని అడుగుతుంది. హిమకు క్యాన్సర్ ఉన్నది అబద్దం.. పెళ్లి కోసం నాటకాలు ఆడారు అని నిలదీస్తుంది.
అప్పుడే హిమ, శౌర్య ఫోటోను చూసి ఏంటిది.. ఈ ఆటో దాని ఫోటో ఇక్కడ పెట్టారు అని అడిగితే.. ఈ జ్వాల ఎవరో కాదు మన శౌర్యనే అని సౌందర్య స్వప్నకు నిజం చెప్తుంది. అది విన్న స్వప్న ఈ లెక్కనా నాకు మరో తలనొప్పి తయారయ్యింది అని స్వప్న అంటుంది. నిరుపమ్ పెళ్లి కేవలం శోభతోనే జరుగుతుంది. నీ ఇద్దరి మానవరాళ్లకు నా కోడలు అయ్యే అర్హత లేదు అని వెళ్ళిపోతుంది. మరో సీన్ లో ప్రేమ్ హిమ గురించి ఆలోచిస్తూ అసలు ఏం జరుగుతుంది.. హిమ ఎందుకు బాధపడుతుంది.. తేల్చుకోవాలి అని వెళ్తాడు.
మరోవైపు నిరుపమ్ తో స్వప్న ఈ పెళ్లి నీకు అవసరమా.. అది దాని పిచ్చి అని తిట్టి వెళ్తాడు. అసలు ఆ హిమ ఎందుకు జ్వాలను పెళ్లి చేసుకోమని చెప్తుందో అర్థం కావడం లేదు అని అంటే జ్వాలనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శౌర్య అని నిజం చెప్తుంది. మమ్మి నువ్వు చెప్పింది నిజామా అంటే.. అవునురా ఆ జ్వాలనే శౌర్య అని గట్టిగా చెప్తుంది. అందుకే మీ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అందరూ అంత తపన పడుతుంది అని చెప్తుంది.
ఎవరు ఏది అయితే ఏంటి నాకు హిమ కావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. మరో సీన్ లో శౌర్య హిమ ఇంటికి లగేజ్ పట్టుకొని వస్తుంది. నేను ఇక్కడ ఉన్నాని నా స్టైల్ మార్చుకుంటను అనుకోవద్దు.. నాకు ఎదురు చెప్తే మరు క్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్తుంది. హారతి ఇచ్చి శౌర్యను ఇంట్లోకి తీసుకెళ్తారు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.