- Home
- Entertainment
- Karthika Deepam: హిమ ఇంటికి లగేజ్ తో వచ్చేసిన నిరుపమ్.. తాళి చూపించి ఇంట్లోవాళ్ళకి షాకిచ్చిన శౌర్య?
Karthika Deepam: హిమ ఇంటికి లగేజ్ తో వచ్చేసిన నిరుపమ్.. తాళి చూపించి ఇంట్లోవాళ్ళకి షాకిచ్చిన శౌర్య?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 25వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

మరొకవైపు శోభ(shobha)ఒకవైపు బ్యాంకు వాళ్ళు బెదిరిస్తున్నారు, మరొకవైపు నిరుపమ్ పని కూడా అవ్వట్లేదు అనే కోపంతో రగిలిపోతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు స్వప్న అన్న మాటలు తలుచుకొని మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది శోభ. మరొకవైపు హిమ,కార్తీక్,దీప ల ముందు నిలబడి సౌర్య(sourya) గురించి చెప్పుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలోనే సౌందర్య అక్కడికి వచ్చి ఏం జరిగింది హిమ అని అనగా నిరుపమ్ బావ వచ్చి సౌర్య గదిలోకి వెళ్ళాడు నానమ్మ మళ్ళీ ఏం గొడవ జరుగుతుందని భయంగా ఉంది అనడంతో సౌందర్య ఆలోచనలో పడుతుంది.
మరొకవైపు సౌర్య జరిగిన విషయాల గురించి తలచుకకొని నిరుపమ్(Nirupam)ఫోటో వైపు చూసి బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి నిరుపమ్ వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి సౌర్య అని అంటాడు. అప్పుడు నిరుపమ్ అక్కడికి వచ్చి జరిగిన విషయాల గురించి మాట్లాడడంతో సౌర్య బాధ పడుతూ ఉంటుంది. సౌర్యతో మాట్లాడుతూ మా అమ్మను నువ్వే మార్చాలి. నన్ను, హిమ(hima)ను ఒకటి చెయ్ సౌర్య అనడంతో సౌర్య బాధపడుతూ ఉంటుంది.
ఇంతలోనే అక్కడికి హిమ వచ్చి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. ఇదే మాట ఎప్పటినుంచో చెబుతున్నా నువ్వు వినిపించుకోవడం లేదు అని అంటుంది. అప్పుడు సౌర్య(sourya) అదంతా వాళ్ళిద్దరి ప్లాన్ అనుకోని వారిని అపార్థం చేసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పసుపు తాడు తీసుకుని వచ్చి మెడలో కట్టు డాక్టర్ సాబ్ అని అంటుంది. దాంతో సౌందర్య(soundarya) వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
అప్పుడు సౌర్య(sourya) మీ ఇద్దరూ అమర ప్రేమికుల ప్రేమ చూసి నాకు విసుగు వచ్చింది అని అంటుంది. అప్పుడు సౌర్య తాళిబొట్టు కట్టండి డాక్టర్ సాబ్ అనడంతో నిరుపమ్ ఆ పసుపు తాడుని తీసుకుంటాడు. అప్పుడు హిమ ఆగు బావ అనడంతో వెంటనే శౌర్య,హిమ(hima) పై సీరియస్ అయ్యి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత సౌర్య ఎమోషనల్ గా మాట్లాడి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గదిలో ఒంటరిగా కూర్చొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడు నిరుపమ్(hima), హిమతో జీవితాంతం నీతోనే కలిసి ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను తెగేసి చెప్తాడు. అప్పుడు హిమ ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా కూడా నిరుపమ్ వినిపించుకోకుండా హిమ పై సీరియస్ అవుతాడు. అప్పుడు హిమ కు అర్థం అయ్యే విధంగా చెప్పిన కూడా హిమ వినిపించుకోదు. రేపటి ఎపిసోడ్ లో సౌందర్య(soundarya), సౌర్యకి జడవేస్తూ ఇంట్లో జరిగే నాటకాలు ఆపు అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలోనే అక్కడికి నిరుపమ్ లగేజ్ సర్దుకొని కొద్ది రోజులు ఇక్కడే ఉండడానికి వచ్చాను అనడంతో అందరూ షాక్ అవుతారు.