- Home
- Entertainment
- నిఖిల్, గౌరవ్ ల రెమ్యునరేషన్ ఇదే..బిగ్ బాస్ హౌస్ లో కనిపించలేదు, ముక్క తెలుగు రాదు అయినా ఇంత భారీగా ఇచ్చారా ?
నిఖిల్, గౌరవ్ ల రెమ్యునరేషన్ ఇదే..బిగ్ బాస్ హౌస్ లో కనిపించలేదు, ముక్క తెలుగు రాదు అయినా ఇంత భారీగా ఇచ్చారా ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తాజాగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. దీనితో వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వచ్చిన నిఖిల్, గౌరవ్ హౌస్ నుంచి బయటకి వెళ్లారు. వీళ్లిద్దరి రెమ్యునరేషన్ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

డబుల్ ఎలిమినేషన్ తో ఇద్దరు అవుట్
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ తెలుగు 9 షోకి కొందరు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వచ్చారు. ఫైర్ స్టార్మ్ వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వచ్చిన వారంతా ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్, గౌరవ్ బయటకి వెళ్లారు. వీళ్ళిద్దరూ అసలు హౌస్ కి ఎందుకు వచ్చారో కూడా ఆడియన్స్ కి అర్థం కావడం లేదు.
హౌస్ లో కనిపించని నిఖిల్
నిఖిల్ అయితే అసలు హౌస్ లో ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. హౌస్ మేట్స్ అంతా గ్రూప్ గా అసెంబుల్ అయినప్పుడు మాత్రమే కనిపిస్తాడు. మిగిలిన సమయంలో ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. బిగ్ బాస్ బజ్ లో శివాజీ కూడా నిఖిల్ పై ఇదే రకమైన సెటైర్ వేశారు. హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు చూశాను నిన్ను.. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కనిపించకుండా చాలా బాగా దాగుడుమూతలు ఆడావు అని అన్నారు.
ఒక్క ముక్క తెలుగు రాదు
నిఖిల్ శనివారం ఎలిమినేట్ కాగా ఆదివారం రోజు గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యాడు. గౌరవ్ గుప్తా నిఖిల్ కంటే కాస్త బెటర్ అని చెప్పొచ్చు. గౌరవ్ కి ఒక్క ముక్క తెలుగు రాదు. అయినప్పటికీ ఎంతోకొంత పెర్ఫామ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ లాంగ్వేజ్ రాకపోవడం అతడికి పెద్ద మైనస్ అనే చెప్పాలి. గేమ్ ఆడడానికి హౌస్ లోకి పంపిస్తే జర్నలిస్ట్ లా బిహేవ్ చేశావు ఏంటి అని శివాజీ గౌరవ్ పై సెటైర్లు వేశారు.
నిఖిల్ కి భారీగా రెమ్యునరేషన్
వీరిద్దరూ ఎలిమినేట్ కావడంతో నిఖిల్, గౌరవ్ రెమ్యునరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. నిఖిల్ తెలుగులో గృహలక్ష్మి లాంటి టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందాడు. అతడి గుర్తింపునకు తగ్గట్లుగానే బిగ్ బాస్ లో రెమ్యునరేషన్ కూడా లభించింది. నిఖిల్ వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో 5 వారాలు ఉన్నారు. వారానికి నిఖిల్ కి రూ.2.5 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే నిఖిల్ కి 5 వారాలకి గాను 12.5 లక్షల వరకు రెమ్యునరేషన్ అందింది. ఇది భారీ మొత్తమే అని చెప్పొచ్చు.
గౌరవ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
ఇక గౌరవ్ కూడా తెలుగులో మల్లి లాంటి టీవీ సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. గౌరవ్ కి వారానికి 2.1 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అంటే 5 వారాలకి గాను గౌరవ్ కి 10.5 లక్షల రెమ్యునరేషన్ ముట్టింది. బుల్లితెర నటులు ఇద్దరూ హౌస్ లో అంతగా కష్టపడకుండానే లక్షల్లో రెమ్యునరేషన్ తో బయటకి వెళుతున్నారు.