- Home
- Entertainment
- రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Laalo Krishna Sada Sahaayate: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఇండస్ట్రీ ఏదైనా కూడా కంటెంట్ ఉంటే చాలు.. ప్రేక్షకులు దాన్ని సూపర్ హిట్ చేయడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లు వచ్చేలా చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటంటే.?

చిన్న సినిమాల హవా..!
ఎన్ని మంచి సినిమాలు థియేటర్లలోకి వచ్చినా ప్రేక్షకులు రావట్లేదని దర్శకనిర్మాతలు అంటుంటారు. చిన్నా లేదు పెద్దా లేదు కంటెంట్ మంచిగా ఉంటే.. కచ్చితంగా ప్రేక్షకులు ఆ సినిమాను విజయం సాధించేలా చేస్తారు. అలా తక్కువ బడ్జెట్‌తో హిట్ కొట్టిన చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అన్ని ఇండస్ట్రీలలోనూ ఇదే తంతు. ఈ ఏడాది మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు విజయం సాధించాయి.
టాలీవుడ్‌తో పాటు మిగతా ఇండస్ట్రీలలోనూ..
తెలుగులో లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి.. కన్నడంలో మహావతార్ నరసింహా లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవి. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయితే చాలు.. ఊహించని రేంజులో కలెక్షన్లు వచ్చి పడతాయి. అలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా.. ఈ సినిమాను కేవలం రూ. 50 లక్షలతో నిర్మిస్తే.. రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మౌత్ పబ్లిసిటీతోనే మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
కంటెంట్ తోనే విజయం..
సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అది చిన్న సినిమానా..? లేక పెద్ద సినిమానా..? అని ప్రేక్షకులు చూడరు. ఎలాంటి హడావుడి లేకుండా.. కంటెంట్‌తోనే సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ రేంజ్ లో కలెక్షన్ల రాబట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమా ఇది. తెలుగు ఇండస్ట్రీలో కాదు తెరకెక్కింది. గుజరాతీలో రూపొందింది.
ఆ సినిమా ఏంటంటే.?
గుజరాత్ లో ఓ చిన్న సినిమా విడుదలై.. పెద్ద సంచలనం సృష్టించింది. రిలీజై 50 రోజుల కావొస్తున్నా.. రూ. 100 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సినిమాలోని 24 ఫ్రేమ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా మరేదో కాదు.. 'లాలో'. ఈ మూవీకి అంకిత్ సఖియా దర్శకత్వం వహించారు. రీవా రచ్, శృహద్ గోస్వామి, కరణ్ జోషిలు కీలక పాత్రల్లో కనిపించారు. అక్టోబర్ 10న ఈ చిన్న సినిమా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మెల్లగా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
మలయాళంలోనూ ఇదే తరహ..
అన్ని ఇండస్ట్రీలు పక్కన పెడితే.. మలయాళంలో తక్కువ బడ్జెట్‌తో నిర్మించి.. బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆ ఇండస్ట్రీలో నిర్మించిన నార్మల్ బడ్జెట్ చిత్రం 'దృశ్యం', 'సూక్ష్మదర్శిని' లాంటి చిత్రాలు ఎంతలా హిట్ కొట్టాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

