- Home
- Entertainment
- నాకు చెప్పకుండా చైతూ అన్నీ సైలెంట్ గా చేసేస్తున్నాడు, బిగ్ బాస్ వేదికపై నాగార్జున.. రీతూ అతి ప్రేమ చూశారా
నాకు చెప్పకుండా చైతూ అన్నీ సైలెంట్ గా చేసేస్తున్నాడు, బిగ్ బాస్ వేదికపై నాగార్జున.. రీతూ అతి ప్రేమ చూశారా
బిగ్ బాస్ తెలుగు 9 లో భాగంగా ఆదివారం రోజు గౌరవ్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ వేదికపై అక్కినేని నాగ చైతన్య సందడి చేశారు. చైతు గురించి రీతూ చెప్పిన విషయాలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యేలా ఉన్నాయి.

బిగ్ బాస్ తెలుగు 9 సండే ఎపిసోడ్
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సండే ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో వేదికపై నాగార్జునతో పాటు కాసేపు అక్కినేని నాగ చైతన్య కూడా సందడి చేశారు. అదే విధంగా ఓ ఎలిమినేషన్ కూడా జరిగింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌరవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నాగార్జునతో కలిసి నాగ చైతన్య సందడి
ఈ వారం నామినేషన్స్ లో గౌరవ్, కళ్యాణ్, సంజన, పవన్, రీతూ, సుమన్, భరణి, దివ్య ఉన్నారు. వీరిలో ముందుగా రీతూ, భరణి సేఫ్ అయ్యారు. ఆ తర్వాత నాగార్జున హౌస్ మేట్స్ తో కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించారు. యానిమల్ బొమ్మలు చూపించిన నాగార్జున వాటి ఇంగ్లీష్ పేర్లని బోర్డు పై పెట్టాలి అని చెప్పారు. హౌస్ మేట్స్ సరదాగా ఈ గేమ్ ఆడారు. బిగ్ బాస్ వేదికపైకి అక్కినేని నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చారు.చైతు రాగానే నాగార్జున శివ రీ రిలీజ్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత చైతు మాట్లాడుతూ తన తాను ఓనర్ గా ఉన్న హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ అనే రేసింగ్ టీం గురించి తెలిపారు.
అన్నీ నాకు చెప్పకుండా చేసేస్తున్నాడు
నాగ చైతన్యకి రేసింగ్ అంటే ఇష్టం అనే సంగతి తెలిసిందే. నాకు తెలియకుండా ఎప్పుడు రేసింగ్ టీంకి ఓనర్ అయ్యావు అని నాగార్జున ఆశ్చర్యపోతూ అడిగారు. అన్నీ అలా సైలెంట్ గా జరిగిపోయాయి అని చైతు తెలిపాడు. నాకు చెప్పకుండా అన్నీ సైలెంట్ గా చేసేస్తున్నావ్ అంటూ నాగార్జున చైతుపై ఫన్నీ సెటైర్ వేశారు. బహుశా చైతు ప్రేమ, పెళ్లి గురించే నాగ్ అలా కామెంట్ చేశారేమో. ఆ తర్వాత ఇంటి సభ్యులు నాగ చైతన్యతో సరదాగా మాట్లాడారు. రీతూ చౌదరి అయితే చైతూని పొగడమే పనిగా పెట్టుకుంది.
చైతూపై రీతూ అతి ప్రేమ
అతడిని ఫ్లటింగ్ చేయడానికి రీతూ ప్రయత్నించింది. చైతు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అభిమానిని. ఒక సారి షూటింగ్ లో చైతు కాళ్ళు చూశాను.. ఎంత తెల్లగా ఉన్నాయో.. శిల్పం లా ఉన్నాయి అని రీతూ పొగిడేసింది. ఆ శిల్పాన్ని చిక్కింది నేనే అంటూ నాగార్జున ఫన్నీ కామెంట్స్ చేశారు. నాగార్జున రీతూకి ఒక ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికి ఇప్పుడు హౌస్ నుంచి బయటకి వచ్చేస్తే చైతూతో బైక్ రైడ్ కి వెళ్లొచ్చు అని అన్నారు. రీతూ వెంటనే నేను బయటకి వచ్చేయడానికి రెడీ అంటూ కామెంట్స్ చేసింది.
గౌరవ్ ఎలిమినేటెడ్
నువ్వు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా మనం బైక్ రైడ్ కి వెళ్లొచ్చు. దాని కోసం బిగ్ బాస్ వదులుకుని రావడం ఎందుకు అని చైతు ప్రశ్నించాడు. మిమ్మల్ని గెలుచుకోవడానికి జోష్ నుంచి ట్రై చేస్తున్నట్లు రీతూ తెలిపింది. మరీ శృతి మించేలా తనని రీతూ పొగుడుతుండడంతో చైతు నవ్వు ఆపుకోలేకపోయాడు. చైతు వెళ్ళిపోయాక ఎలిమినేషన్ ఉత్కంఠ పెరిగింది. చివరికి నామినేషన్స్ లో దివ్య, గౌరవ్ మాత్రమే మిగిలారు. ఉత్కంఠకి తెరదించుతూ గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. దివ్య సేఫ్ అయింది. కానీ నాగార్జున తనూజకి గోల్డెన్ బజర్ ఉపయోగించడానికి చివరి అవకాశం ఇచ్చారు. ఆమె గోల్డెన్ బజార్ యూజ్ చేసి గౌరవ్ ని సేవ్ చేస్తే దివ్య ఎలిమినేట్ అవుతుంది. కానీ దివ్య గోల్డెన్ బజార్ ఉపయోగించడానికి నిరాకరించింది. దీనితో ఆమె గోల్డెన్ బజార్ వృధా అయింది.