- Home
- Entertainment
- Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్ న్యూస్
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్ న్యూస్
Dhurandhar Collections: రణ్‌వీర్ సింగ్ సినిమా 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు తెలుగులో రిలీజ్‌కి ప్లాన్ జరుగుతుంది. ఈ వారమే ఆడియెన్స్ ముందుకు రాబోతుందని టాక్.

'ధురంధర్' థియేటర్లలో సంచలనం
రణ్‌వీర్ సింగ్ చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తారు. కానీ వచ్చినప్పుడు మాత్రం రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. తాజాగా ఆయన `ధురంధర్` మూవీతో వచ్చారు. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై 11 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీకి ఎంత కలెక్షన్లు వచ్చాయంటే?
'ధురంధర్' 10 రోజుల వసూళ్లు ఎంతంటే
'ధురంధర్' మొదటి రోజు రూ.28 కోట్లు, రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.43 కోట్లు, నాలుగో రోజు రూ.23.25 కోట్లు, ఐదో రోజు రూ.27 కోట్లు, ఆరో రోజు రూ.27 కోట్లు, ఏడో రోజు రూ.29.40 కోట్లు, ఎనిమిదో రోజు రూ.19.77 కోట్లు, 9వ రోజు రూ.53.70 కోట్లు, పదో రోజు రూ.58.20 కోట్లు వసూలు చేసింది. సాధారణంగా డేస్ పెరిగే కొద్ది కలెక్షన్లు తగ్గుతాయి. కానీ ఈ చిత్రానికి పెరుగుతున్నాయి. ఇదే ఈ మూవీ సంచలనానికి కేరాఫ్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.
'ధురంధర్' మొత్తం కలెక్షన్లు
'ధురంధర్' 11వ రోజు రూ.16.55 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా మొత్తం రూ.367.3 కోట్ల కలెక్షన్ సాధించింది. ఊహించని విధంగా థియేటర్లలో సందడి చేస్తోంది. మూడో వారంలోనూ ఈ సినిమాకి కలెక్షన్లు పెరుగుతుండటం ఆశ్చర్యపరుస్తుంది. మేకర్స్ ని సైతం షాక్‌కి గురి చేస్తోంది.
'ధురంధర్' సినిమా కథ ఏంటి?
'ధురంధర్' సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో రణ్‌వీర్ సింగ్ అండర్‌కవర్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. కరాచీలోని టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌ను నాశనం చేయడానికి పంపిన సీక్రెట్ ఏజెంట్ జీవితం ఆధారంగా రూపొందిన యాక్షన్, స్పై-థ్రిల్లర్ ఇది.
'ధురంధర్' స్టార్ కాస్ట్
'ధురంధర్' సినిమాకు ఆదిత్య ధర్ రచన, దర్శకత్వం వహించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సౌమ్య టాండన్, సారా అర్జున్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతుంది. ఈ నెల 19న విడుదల చేసే అవకాశం ఉందట. దీనిపై మరింత క్లారిటీ రానుంది.

