జిమ్ లుక్‌లో ఝలక్ ఇచ్చిన నిహారిక.. విదేశీ రెస్టారెంట్లో కిర్రాక్ పోజులు.. అందరి ఫోకస్ నాభిపైనే
మెగా డాటర్ నిహారికా కొణిదెల అసలైన జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తుంది. ఆమె ఆ మధ్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విదేశీ టూర్లతో ఎంజాయ్ చేస్తుంది. ఆ ఎక్స్ పీరియెన్స్ ని పంచుకుంటుంది.
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక(Niharika).. మెగా ఫ్యామిలీలో ఓ గారాల పట్టి. ఆమెని అందరు గారాభంగా చూసుకుంటారు. తను కూడా జోవియల్, ఎప్పుడూ జోష్‌లో ఉంటుంది. లైఫ్ ఎంజాయ్ అనే యాంగిల్లో వ్యవహరిస్తుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు చాలా వరకు ఎంటర్టైన్మెంట్ పంచేలా ఉంటాయి.
నిహారిక(Niharika Konidela) తన భర్త చైతన్య జొన్నలగడ్డకి విడాకులు ఇచ్చిన తర్వాత అసలైన జీవితాన్ని అనుభవిస్తుంది నిహారిక. ఆమె తరచూ విదేశాల్లో గడుపుతుంది. కెరీర్ పరంగా బిజీ అవుతూ, అదే సమయంలో ఎంటర్టైన్మెంట్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది.
ఆ మధ్య ఫ్యామిలీతో కలిసి విదేశాలను చుట్టేసి వచ్చారు. నాగబాబు, ఆయన సతీమని, వరుణ్ తేజ్, నిహారికలు ఫారెన్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారు. ఆయా ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది నిహారిక. ఇప్పుడు మరికొన్ని పీక్స్ ని షేర్ చేసింది.
విదేశీ రెస్టారెంట్లో ఫుడ్‌ని అస్వాదిస్తూ, అలాగే అక్కడి వీధుల్లో కలియ తిరుగుతూ కనిపించింది. దీంతోపాటు స్టయిలీష్ ఫోటో షూట్లు చేసింది. మరోవైపు జిమ్‌లోనూ శ్రమించింది. జిమ్ లుక్‌లో ఫోటోలను పంచుకుని అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది. అలరిస్తుంది. తన హాట్ పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
అయితే ఇందులో ప్రధానంగా ఓ ఫోటోపై మాత్రం అందరి ఫోకస్ ఉంది. ఇందులో హ్యాపీ అని వాల్‌పై రాసి ఉండగా, ఆ వాల్కి వొరిగి ఓ క్రేజీ లుక్ ఇచ్చింది. పోజు స్టయిల్‌గా ఉన్నా, అందులో ఆమె ఓ ఎలిమెంట్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. అదే నిహారిక ఇందులో తన నాభి అందాన్ని చూపించింది. దీంతో అందరు ఆ నాల్గో పిక్‌ని ఫోకస్ చూడంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. నానా రచ్చ చేస్తున్నారు.
నిహారిక యాంకర్‌గా కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్గా టర్న్ తీసుకుంది. మూడు సినిమాలు కూడా చేసింది. కానీ ఆమె నటించిన సినిమాలు ఆడలేదు. దీంతో యాక్టింగ్ ఆమెకి కలిసి రాదా? అనే ప్రశ్న స్టార్ట్ అయ్యింది. నటన పక్కన పెట్టి ప్రొడక్షన్ వైపు ఫోకస్ పెట్టింది. అక్కడ ఫర్వాలేదనిపించింది.
ఇంతలోనే పెళ్లి చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డని రెండేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరి మ్యారేజ్ చాలా గ్రాండియర్‌గా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. కొన్నాళ్లపాటు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు ప్రచారం జరిగింది.
ఓ పబ్‌లో నిహారిక దొరికింది. ఆ విషయంలో చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు చైతన్య జొన్నలగడ్డ తన ఫ్లాట్‌లో గొడవ చేశాడని, రాత్రి సమయంలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడనే అపార్ట్ మెంట్ వాసులు పోలీస్ కంప్లెయింట్ చేసినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ఇలాంటి పరిణామాల అనంతరం అనూహ్యంగా ఇద్దరు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు.
దీంతో ఈ ఇద్దరు విడిపోతున్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి. ఎన్నో వార్తలొచ్చినా, వాళ్లు స్పందించలేదు. చివరికి తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ఇద్దరు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటనేది మాత్రం పెద్ద సస్పెన్స్. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే నిహారిక చాలా స్వేచ్ఛగా విహరిస్తుంది. అసలు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.