MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకోబోతోందా? ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మెగా డాటర్..

నిహారిక కొణిదెల రెండో పెళ్లి చేసుకోబోతోందా? ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మెగా డాటర్..

మెగా డాట్టర్ నిహారిక కొణిదెల పెళ్ళి.. వివాదం.. విడాకులు అన్ని జరిగిపోయాయి. డివోర్స్ తరువాత నిహారిక రెండో పెళ్లిపై రకరకాల వార్తలు వినిపించాయి. ఈ విషయంలో ట్రోలర్స్ కు గట్టిగా ఇచ్చిపడేసింది నిహారిక..

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 24 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నిర్మాతగా దూసుకుపోతున్న నిహారిక..
Image Credit : Asianet News

నిర్మాతగా దూసుకుపోతున్న నిహారిక..

మెగా డాటర్ నిహారిక కొనిదెల వ్యక్తిగత జీవితానికి, మూవీ కెరీర్ కు సంబంధించిన విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నిలుస్తూనే ఉన్నాయి. చైతన్య జొన్నలగడ్డతో వివాహ బంధం ముగిసిన తర్వాత, ఆమె తన పూర్తి దృష్టిని కెరీర్‌పై పెట్టింది. గతంలో హీరోయిన్ గా చేసిన నిహారిక..ప్రస్తుతం నిర్మాతగా ముందుకు సాగుతోంది. ఇటీవల ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా విజయాన్ని అందుకున్న నిహారిక, ఇప్పుడు ‘రాకాస’ అనే మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

25
ఆసక్తిర విషయాలు వెల్లడించిన మెగా డాటర్..
Image Credit : Asianet News

ఆసక్తిర విషయాలు వెల్లడించిన మెగా డాటర్..

ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత్ శోభన్, నయన్ సరిగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Related Articles

Related image1
చిరంజీవి ని భయపెట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా? కటౌట్ చూసి షాక్ అయిన మెగాస్టార్..
Related image2
రామ్ చరణ్ హీరోగా 1000 కోట్లతో.. ధురంధర్ డైరెక్టర్ సినిమా? కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు, నిజమెంత?
35
రెండో పెళ్లిపై నిహారిక క్లారిటీ..
Image Credit : niharika insta

రెండో పెళ్లిపై నిహారిక క్లారిటీ..

ప్రత్యేకంగా తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం పూర్తిగా లేదని చెప్పలేమని, కాలమే దానికి సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తన అన్నయ్య వరుణ్ తేజ్ , వదిన లావణ్య త్రిపాఠిల ప్రేమ కథ గురించి కూడా నిహారిక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

45
వరుణ్ తేజ్ ప్రేమ.. పెళ్లిపై కామెంట్స్..
Image Credit : Asianet News

వరుణ్ తేజ్ ప్రేమ.. పెళ్లిపై కామెంట్స్..

వరుణ్, లావణ్య ప్రేమలో ఉన్నారన్న విషయం తనకు నాలుగేళ్ల తర్వాతే తెలిసిందని, అప్పటివరకు ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారని చెప్పారు. వరుణ్ తేజ్ బయటకు ఇంట్రోవర్ట్‌లా కనిపించినప్పటికీ, వ్యక్తిగతంగా చాలా సరదాగా ఉంటాడని, ఎప్పుడూ తనను ఆటపట్టిస్తూనే ఉంటాడని నిహారిక తెలిపారు.

55
ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన నిహారిక..
Image Credit : nikiluu youtube screen shot

ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన నిహారిక..

ఇక సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌పై కూడా నిహారిక స్పందించారు. కొంతమంది సెలబ్రిటీలను ట్రోల్ చేయడం తమ హక్కుగా భావిస్తున్నారని, అయితే ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే మార్పు వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిగత జీవితంపై ఎన్ని విమర్శలు వచ్చినా, నిర్మాతగా తన ప్రయాణాన్ని ఆపకుండా వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతానని ఆమె స్పష్టం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Related Stories
Recommended image1
చిరంజీవి ని భయపెట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా? కటౌట్ చూసి షాక్ అయిన మెగాస్టార్..
Recommended image2
రామ్ చరణ్ హీరోగా 1000 కోట్లతో.. ధురంధర్ డైరెక్టర్ సినిమా? కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు, నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved