MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • చిరంజీవి ని భయపెట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా? కటౌట్ చూసి షాక్ అయిన మెగాస్టార్..

చిరంజీవి ని భయపెట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా? కటౌట్ చూసి షాక్ అయిన మెగాస్టార్..

చిరంజీవిని భయపెట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా? తనకు పోటీ వస్తాడేమో అని చిరు కంగారుపడింది ఏ హీరో కటౌట్ ను చూసి? మెగాస్టార్ స్వయంగా వెల్లడించిన షాకింగ్ నిజాలు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 24 2026, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి..
Image Credit : Face Book/KChiranjeeviFans

స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి..

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ.. స్టార్ హీరోగా ఎదిగారు. రొటీన్ కు భిన్నంగాఆలోచిస్తూ.. భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవికి పోటీగా చాలామంది హీరోలు వచ్చినా... మెగాస్టార్ మార్క్ మాత్రం సెపరేట్ గా ఉండేది. అదే ఆయన్ను స్టార్ హీరోగా నిలబెట్టింది. 

ఎంత మంది హీరోలు వచ్చినా.. చిరంజీవి స్టార్ డమ్ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ.. కుర్ర హీరోలు ఎంత మంది వచ్చినా.. 70 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ తన మార్క్ తో దూసుకుపోతున్నాడు. అయితే చిరంజీవిని కెరీర్ బిగినింగ్ లో స్టార్ గామారుతున్న టైమ్ లో .. భయపెట్టిన హీరో ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవిని భయపెట్టిన తెలుగు హీరో..
Image Credit : Asianet News

చిరంజీవిని భయపెట్టిన తెలుగు హీరో..

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఏహీరో పోటీగా వచ్చినా.. గెలిచి చూపించారు. అందరితో సఖ్యతతో ఉంటూ.. ముందుకు వెళ్లారు. కానీ చిరంజీవి విక్టరీ స్టార్ వెంకటేష్ ను చూసి ఓ సందర్భంలో భయపడ్డారట. ఈ విషయాన్ని ఓ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. 

సంఘర్షణ సినిమా షూటింగ్ టైమ్ లో.. సెట్స్ కు వచ్చిన వెంకటేష్ ను చూసి భయపడ్డానని చిరంజీవి వెల్లడించారు. అప్పటికి వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. ఎక్కడ అతను హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని తాను భయపడినట్టు ఆయన చిరంజీవి ఫన్నీకామెంట్స్ చేశారు.

35
చిరంజీవి ఏమన్నారంటే?
Image Credit : Asianet News

చిరంజీవి ఏమన్నారంటే?

ఓ ఈవెట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. '' రామానాయుడుగారు నిర్మించిన సంఘర్షణ షూటింగ్ జరుగుతున్న టైమ్ లో.. ఓ సారి సెట్స్ కు ఓ కుర్రాడు వచ్చాడు.. అప్పుడప్పుడు మీసాలు వస్తూ.. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. 20 నుంచి 25 ఏళ్ళ మధ్య వయసు ఉంటుంది. ఇంతకీ ఎవరా ఇతను అని ఆలోచిస్తుంటే.. నాయుడుగారబ్బాయి అని చెప్పారు. వెంటనే నాకు గుండెల్లో గుభేలుమనిపించింది. ఇంత అందంగా ఉన్నాడు.. రామానాయుడు గారు ఎక్కడ అతన్ని హీరోగా ఇంటర్డ్యూస్ చేస్తారా..? నాకు పోటీగా వస్తాడేమో... ఇక రామానాయుడిగారి సినిమాల్లో ఛాన్స్ లు వస్తాయో లేవో అని భయపడ్డాను''. అని చిరంజీవి అన్నారు.

45
రామానాయుడితో మెగాస్టార్ ఏమన్నాడు..?
Image Credit : Youtube/@GoldBoxEnt

రామానాయుడితో మెగాస్టార్ ఏమన్నాడు..?

వెంకటేష్ ను చూసి భయపడ్డ చిరంజీవి రామానాయుడితో ఏమన్నారంటే? '' కుర్రాడు బాగున్నాడు ఎక్కడ నాకు పోటీగా వస్తాడో అన్న భయంతో.. నేను రామానాయుడిని అడిగాను.. మీ అబ్బాయి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని.. అప్పుడు నాయుడుగారు లేదు రాజా ఫారెన్ కి చదువుకోడానికి వెళ్తున్నాడు అని అన్నారు. హమ్మయ్య అనుకున్నాను. నిజమే నండి.. ఈ సినిమాలు, కష్టం మనకెందుకు.. కుర్రోడిని చదవుకోనివ్వండి అని అన్నాను. కానీ రెండేళ్లు కాకముందే.. ఫారెన్ నుంచి వచ్చి వెంకీ సినిమాలు స్టార్ట్ చేశాడు.'' అని చిరంజీవి అన్నాడు.

55
ఇండస్ట్రీనికి నాలుగు పిల్లర్స్..
Image Credit : box office andhra

ఇండస్ట్రీనికి నాలుగు పిల్లర్స్..

టాలీవుడ్ ను 90వ దశకంలో నలుగురు హీరోలు ఏలారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురు నాలుగు పిల్లర్స్ గా మారి.. తెలుగు పరిశ్రమలో వెలుగు వెలిగారు. ఈ నలుగురిలో చిరంజీవి మాత్రమే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగారు. బాలయ్య నందమూరి వారసుడిగా, నాగార్జున అక్కినేని వారసుడిగా, వెంకటేష్ దగ్గుబాటి వారి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. తమ సొంత టాలెంట్ తో.. స్టార్ హీరోలుగా మారారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
నందమూరి బాలకృష్ణ
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Related Stories
Recommended image1
హిట్టు మీద హిట్టు, 65 ఏళ్ల వయసులో రెమ్యునరేషన్ భారీగా పెంచిన వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాకు ఎంతంటే?
Recommended image2
రామ్ చరణ్ హీరోగా 1000 కోట్లతో.. ధురంధర్ డైరెక్టర్ సినిమా? కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు, నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved