- Home
- Entertainment
- రెండు షిఫ్టుల్లో ప్రభాస్ హీరోయిన్.. మార్నింగ్ పవన్, మధ్యాహ్నం డార్లింగ్.. రెండు స్టేట్స్ లో చక్కర్లు
రెండు షిఫ్టుల్లో ప్రభాస్ హీరోయిన్.. మార్నింగ్ పవన్, మధ్యాహ్నం డార్లింగ్.. రెండు స్టేట్స్ లో చక్కర్లు
ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ వెండితెరపై మెరిసి చాలా రోజులవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లతో కలిసి నటిస్తుంది. వారి కోసం రెండు షిఫ్ట్ ల్లో వర్క్ చేస్తుండటం విశేషం.

ఒకప్పుడు హీరోహీరోయిన్లు రెండు, మూడు షిఫ్ట్ ల్లో పనిచేసేవారు. మార్నింగ్ ఓ మూవీ, మధ్యహ్నాం మరో సినిమా, రాత్రి ఇంకో సినిమా చేసేవారు. అందుకే అప్పట్లో ఒక్కో హీరోహీరోయిన్ మూవీ ఏడాదికి పదికిపైగా రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు అలాంటి సంఘటనలు చాలా అరుదు. కనీసం రెండు షిఫ్ట్ లు కూడా చేసే పరిస్థితి లేదు. కానీ ఓ హీరోయిన్ చేస్తూ కష్టపడుతుంది. రెండు షిఫ్ట్ లు చేస్తుంది. మార్నింగ్ పవన్, సాయంత్రం ప్రభాస్‌తో చేస్తుంది.
ఒకప్పుడు హీరోహీరోయిన్లు రెండు, మూడు షిఫ్ట్ ల్లో పనిచేసేవారు. మార్నింగ్ ఓ మూవీ, మధ్యహ్నాం మరో సినిమా, రాత్రి ఇంకో సినిమా చేసేవారు. అందుకే అప్పట్లో ఒక్కో హీరోహీరోయిన్ మూవీ ఏడాదికి పదికిపైగా రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు అలాంటి సంఘటనలు చాలా అరుదు. కనీసం రెండు షిఫ్ట్ లు కూడా చేసే పరిస్థితి లేదు. కానీ ఓ హీరోయిన్ చేస్తూ కష్టపడుతుంది. రెండు షిఫ్ట్ లు చేస్తుంది.
నిధి అగర్వాల్ ప్రస్తుతం `హరిహర వీరమల్లు`, `ది రాజా సాబ్` చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా `హరిహర వీరమల్లు` రూపొందుతుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం విజయవాడలో జరుగుతుంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్‌కి దగ్గర్లోనే ఓ సెట్ వేశారట. అందులోనే ఈ మూవీని షూట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ పాల్గొంటుంది. మార్నింగ్ ఆరు గంటల నుంచి 12 గంటల వరకు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటుందట నిధి అగర్వాల్.
అనంతరం సాయంత్రానికి హైదరాబాద్ వస్తుంది. ఇక్కడ `ది రాజా సాబ్` మూవీ చిత్రీకరణలో పాల్గొంటుందట. ఇలా రెండు రాష్ట్రాలు తిరుగుతూ ఏక కాలంలో రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటూ తన డెడికేషన్‌ని చాటుకుంటుంది.
సినిమా షూటింగ్‌లు పూర్తి చేసేందుకు తనవంతుగా సపోర్ట్ చేస్తుందీ నిధి. ఇక ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `ది రాజా సాబ్`లో నిధి అగర్వాల్‌తోపాటు మాళవిక మోహనన్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఈ రెండు సినిమాలపైనే హోప్స్ పెట్టుకుంది నిధి. ఈ మూవీస్‌తో హిట్ కొట్ట కమ్ బ్యాక్ కావాలని భావిస్తుంది. అందుకోసం తనవంతుగా డెడికేషన్‌తో వర్క్ చేస్తుంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లపైనే కొండంత ఆశలు పెట్టుకుంది. మరి ఈ మూవీస్ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. నిధికి పూర్వ వైభవం వస్తుందా? మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అవుతుందా అనేది చూడాలి.
`ఇస్మార్ట్ శంకర్` తో కమర్షియల్ బ్రేక్ అందుకున్న నిధి అగర్వాల్, ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఆ పేరుని తీసుకురాలేకపోయాయి. దీంతో కొంత బ్రేక్ కూడా వచ్చింది. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మళ్లీ తాను సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.
read more: శంకర్ కి రెండోసారి చుక్కలు చూపించిన డైరెక్టర్.. కానీ ఈసారి బలైంది దిల్ రాజు
also read: `గేమ్ ఛేంజర్`, `వణంగాన్`, `కాదలిక్క నేరమల్లై`.. విశాల్ దెబ్బకి సంక్రాంతి సినిమాలు వాష్ ఔట్