శంకర్ కి రెండోసారి చుక్కలు చూపించిన డైరెక్టర్.. కానీ ఈసారి బలైంది దిల్ రాజు
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తోంది.

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 100 కోట్లకి పైగా గ్రాస్ తో సంచలనం సృష్టించింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ కామెడీ టైమింగ్, గోదావరి యాసలో ఐశ్వర్య రాజేష్ డైలాగులు, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటన ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.
ఈ చిత్ర సక్సెస్ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక ఆసక్తికర విషయం పంచుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో డైరెక్టర్ శంకర్ కి అనిల్ రావిపూడి షాక్ ఇచ్చారు. అయితే అనిల్ రావిపూడి ఇలా శంకర్ ని బీట్ చేయడం ఇది తొలిసారి కాదు.
2015లో అనిల్ రావిపూడి పటాస్ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం షూటింగ్ పూర్తయి రిలీజ్ కి రెడీగా ఉన్న తరుణంలో సంక్రాంతికి శంకర్ ఐ చిత్రం విడుదలయింది. అదే విధంగా గోపాల గోపాల చిత్రం కూడా రిలీజ్ అయింది. వారం గ్యాప్ లో పటాస్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ రెండు పెద్ద చిత్రాల మధ్య వద్దులే అని అనుకున్నారట.
కానీ దిల్ రాజు పటాస్ చిత్రాన్ని చూసి ఈ సినిమా వర్కౌట్ అవుతుంది.. శంకర్ సినిమా ఉన్నా పర్వాలేదు రిలీజ్ చేయండి అని చెప్పారట. అలా పటాస్ చిత్రాన్ని రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయింది. ఐ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. 2015 సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్ అవుతుండగా సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ దిల్ రాజుని బలవంతం చేసి ఈ చిత్రం సంక్రాంతికి వచ్చేలా చేశారు అనిల్ రావిపూడి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు చిత్రాలు దిల్ రాజువే. ఈసారి శంకర్ తో పాటు దిల్ రాజు కూడా బలయ్యారు. గేమ్ ఛేంజర్ తో దిల్ రాజుకి నష్టాలు తప్పేలా లేవు.