- Home
- Entertainment
- `గేమ్ ఛేంజర్`, `వణంగాన్`, `కాదలిక్క నేరమల్లై`.. విశాల్ దెబ్బకి సంక్రాంతి సినిమాలు వాష్ ఔట్
`గేమ్ ఛేంజర్`, `వణంగాన్`, `కాదలిక్క నేరమల్లై`.. విశాల్ దెబ్బకి సంక్రాంతి సినిమాలు వాష్ ఔట్
ఈ సంవత్సరం తమిళంలో పొంగల్ పండుగకు విడుదలైన `వణంగాన్`, `నేసిప్పాయ`, `గేమ్ ఛేంజర్`, `కాదలిక్క నేరమిల్లై` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలయ్యాయి.

పొంగల్ రిలీజ్ సినిమాల బాక్సాఫీస్
2025 పొంగల్ కి కోలీవుడ్‌లో శంకర్ `గేమ్ ఛేంజర్`, బాలా-అరుణ్ విజయ్ `వణంగాన్`, కృతిక ఉదయనిధి దర్శకత్వంలో `కాదలిక్క నేరమిల్లై`, విష్ణువర్ధన్ `నేసిప్పాయ` విశాల్ `మదగజరాజా `విడుదలయ్యాయి. ఈ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయి? విన్నర్ ఎవరు ? అనేది చూద్దాం.
గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్
గేమ్ ఛేంజర్
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా నటించిన `గేమ్ ఛేంజర్` కి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా ₹25 కోట్లకు అమ్ముడుపోయింది. ₹50 కోట్లు వసూలు చేయాలి. కానీ ₹7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కోలీవుడ్‌లో ఇది డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
వణంగాన్ బాక్సాఫీస్
వణంగాన్
బాలా దర్శకత్వంలో అరుణ్ విజయ్ నటించిన `వణంగాన్` సినిమాను సురేష్ కామాక్షి నిర్మించారు. ఈ సినిమా ₹4.69 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఒక్క రోజు కూడా కోటి రూపాయలు వసూలు కాలేదు. పరాజయం దిశగానే ఇది వెళ్తుంది.
కాదలిక్క నేరమిల్లై బాక్సాఫీస్
కాదలిక్క నేరమిల్లై
కృతిక ఉదయనిధి దర్శకత్వంలో రవి మోహన్ నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా రెండు రోజుల్లో ₹3.3 కోట్లు వసూలు చేసింది. పాజిటివ్ టాక్ వచ్చినా, బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది.
నేసిప్పాయ బాక్సాఫీస్
నేసిప్పాయ
విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్, అదితి శంకర్ నటించిన `నేసిప్పాయ` సినిమా రెండు రోజుల్లో ఒక కోటి మాత్రమే వసూలు చేసింది. ఇది పెద్ద ఫ్లాప్ దిశగా వెళ్తుంది.
మదగజరాజా బాక్సాఫీస్
పొంగల్ విన్నర్
విశాల్ మదగజరాజా సినిమా మిగతా సినిమాలకు పోటీ ఇచ్చింది. ఈ సినిమా 4 రోజుల్లో ₹16 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకే ఎక్కువ థియేటర్లు దొరకడం వల్ల మిగతా సినిమాలు నష్టపోయాయి. విశాల్ కి చాలా రోజుల తర్వాత సక్సెస్ దక్కబోతుంది. మళ్లీ ఆయన పూర్వ వైభవం పొందబోతున్నారు.