- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: మాళవిక చెప్పిన మాటలను వేద నమ్ముతుందా.. యష్ దాచిన నిజం ఏంటి?
Ennenno Janmala Bandham: మాళవిక చెప్పిన మాటలను వేద నమ్ముతుందా.. యష్ దాచిన నిజం ఏంటి?
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham). ఇక ఈ సీరియల్ సరికొత్త ట్విస్టులతో కొనసాగుతుంది. అలాంటి ఈ సీరియల్ లో ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం..

సీరియల్ ప్రారంభంలోనే కళ్యాణ మండపాన్ని చూపిస్తారు. చిత్ర, సులోచన పెళ్లికి వచ్చిన బంధువులను ఆహ్వానిస్తూ ఉంటారు. మాళవిక కూడా కళ్యాణ మండపానికి వస్తుంది సులోచన, వేద వాళ్ళ అక్క వేదను రెడీ చేసి ఎంత అందంగా ఉన్నావు అంటూ సులోచన వేద కు దిష్టి తీస్తుంది.
ఇక ముగ్గురు నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈలోపు మాళవిక వచ్చి వేద కు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతుంది. మాళవిక నీతో మాట్లాడాలి వేద అంటే సులోచన పెళ్లి ముహూర్తానికి ఆలస్యం అవుతుంది మళ్లీ మాట్లాడుకోవచ్చు అని వేద ను తీసుకు వెళుతూ ఉంటుంది. కానీ మాళవిక నీతో మాట్లాడాలి వేద కేవలం రెండు నిమిషాలే అంటు బతిమాలాడుతూ ఉంటుంది .
దాంతో వేద కూడా మాట్లాడడానికి ఒప్పుకుంటుంది. ఇక యశోదర్ తన ఫ్యామిలీతో కార్ లో బయలుదేరి కళ్యాణమండపానికి వస్తూ ఉంటారు.మాళవిక నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోబోయేది, ఎందుకు నా దగ్గర దాస్తున్నావు అంటూ, నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఎవరో నాకు తెలుసు అని అద్దం మీద వేద వెడ్స్ యశోధర్ అని రాసి వేద కు షాక్ ఇస్తుంది.
ఎందుకు ఈ విషయాన్ని నాకు చెప్పలేదు అంటూ వేద ను నిందిస్తూ ఉంటుంది. ఇక యశోదర్, తన ఫ్యామిలీ కళ్యాణ మండపం దగ్గరికి వస్తారు. సులోచన అందరికీ బొట్టుపెట్టి, హారతి ఇచ్చి కల్యాణ మండపం లోకి ఆహ్వానిస్తారు వేద కుటుంబం.
మాళవిక ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు రెండో పెళ్లి వాడిని ఎందుకు చేసుకుంటున్నావు అని అడుగుతుంది. దాంతో వేద ఈ పెళ్లి కేవలం ఖుషి కోసం చేసుకుంటున్నాను అని మాళవికకు చెప్తుంది. ఇక మాళవిక ఖుషికి తల్లిని నేను, నా నుంచి ఖుషిని లాగేసుకుని నువ్వు తల్లివి కావాలి అనుకుంటున్నావా వేద అని అంటుంది.
enn
మాళవిక యశోదర్ మోసగాడు, నీ విషయంలో కుట్ర చేస్తున్నాడు అని యశోదర్ వల్ల జరిగిన పొరపాట్లను గుర్తుచేస్తుంది. ఇక యశోదర్ ఫ్యామిలీ, వేద ఫ్యామిలీ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మాళవిక యశోదర్ స్వార్థపరుడు, కేవలం నా మీద గేలవడానికి ఖుషి ని కావాలి అనుకుంటున్నాడు అందుకే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు అని యశోదర్ గురించి తప్పుగా చెబుతూ ఉంటుంది.
ఇక మళ్లీ యశోదర్ డాన్స్ చేస్తున్న సీన్స్ ను చూపిస్తారు. ఇక మాళవిక యశోదర్ నీ దగ్గర ఒక నిజాన్ని దాచాడు. అది కేవలం నాకు మాత్రమే తెలుసు అని యశోదర్ గురించిన నిజాన్ని చెప్పేస్తుంది. దాంతో వేద షాక్ అయి బాధపడుతూ ఉంటుంది. ఇక యశోదర్ ఫ్యామిలీ ని కళ్యాణ మండపం లోకి తీసుకెళ్లి కాశి యాత్ర గురించి వివరిస్తారు.
మాళవిక పెళ్లి ఆగిపోవాలి అని వేదను రెచ్చగొడుతుంది. ఇక వేదను బుట్టలో తీసుకెళుతూ ఉంటారు. ఖుషి యశోదర్ దగ్గర నిలబడి ఉంటుంది. ఇక వేద మెడలో యశోదర్ తాళి కడతాడు. ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.