MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • సౌమ్యరావుపై బాడీ షేమింగ్‌ కామెంట్లు, హైపర్‌ ఆది వల్లే యాంకర్‌గా తప్పుకుందా?

సౌమ్యరావుపై బాడీ షేమింగ్‌ కామెంట్లు, హైపర్‌ ఆది వల్లే యాంకర్‌గా తప్పుకుందా?

జబర్దస్త్ యాంకర్‌ సౌమ్య రావుని ఈ కామెడీ షో నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీనికి హైపర్‌ ఆది కారణమనే రూమర్లు ఉన్న నేపథ్యంలో సౌమ్య రావు తాజాగా స్పందించి వాస్తవాలను బయటపెట్టింది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 20 2024, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యాంకర్‌ సౌమ్య రావు `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే. గతేడాది, ఈ ఏడాది ప్రారంభం వరకు ఆమె యాంకర్‌గా కొనసాగింది. తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ని రక్తికట్టించింది. కామెడీని పండించింది. కానీ ఉన్నట్టుంది షో నుంచి తప్పుకుంది. దీనితో అనేక రూమర్లు వచ్చాయి. హైపర్‌ ఆది కారణమనే కామెంట్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించింది సౌమ్య రావు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sowmya Rao

Sowmya Rao

సౌమ్య రావు చాలా గ్యాప్‌ తర్వాత తన షో గురించి మాట్లాడింది. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం, ఇక్కడ రాణించడం, జబర్దస్త్ షోకి యాంకర్‌గా చేయడం, తప్పుకోవడానికి సంబంధించిన ఆమె వెల్లడించింది. తాను కన్నడ నటినే అని, కానీ తెలుగు వారు తనని ఎంతగానో ఎంకరేజ్‌ చేశారని తెలిపింది.

వారి వల్లే తనకు ఇంతటి గుర్తింపు వచ్చిందన్నారు. తనని జబర్దస్త్ షో నుంచి తీసేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆసమయంలో చాలా హర్ట్ అయినట్టు తెలిపింది. దీనికో కథ చెప్పింది. 
 

36

ఒక వ్యక్తికి ఏమీ లేని స్థితిలో సైకిల్‌ని సంపాదించుకుని వెళ్తుంది, ఆ తర్వాత కష్టపడి ఓ చిన్నపాటి మారుతి కారు కొనుకుని వెళ్తుంది, ఇంతలో ఒకరు బెంజ్‌ కారులో వచ్చి, నువ్వు డ్రైవ్‌ చేయాల్సింది అది కాదు, బెంజ్‌ కారు డ్రైవ్‌ చేయమన్నారు.

బెంజ్‌ కారు అనేసరికి సంతోషంగా ఆ కారు ఎక్కితే కొంత దూరం వెళ్లాక మధ్యలోనే వదిలేశారు. దీంతో బెంజ్‌ కారు డ్రైవ్‌ చేసే అవకాశం ఇచ్చినందుకు సంతోషించాలా? లేక తనకు కారుకి దూరంగా వదిలేసినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందని, సరిగ్గా తన పరిస్థితి కూడా అదే అని చెప్పింది సౌమ్య రావు. 
 

46

అయితే తాను జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి హైపర్‌ ఆది, బాడీ షేమింగ్‌ కామెంట్స్ అనే రూమర్లు ఉన్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చింది సౌమ్య. హైపర్‌ ఆది వల్ల కాదు అని స్పష్టం చేసింది. వారంతా ఎంతో ఎంకరేజ్‌ చేస్తారని, ఒకరిని తొక్కేయాలని ఎప్పుడూ చూడరు అని, వాళ్లు కూడా ఏం లేని స్థితి నుంచి వచ్చినవల్లే అలా చేయరు,

హైపర్‌ ఆది ఎంతో ఎంకరేజ్‌ చేశాడు, పంచ్‌లు వేసినా, సెటైర్లు పేల్చినా అది కామెడీ కోసమే అని, కామెడీ షో చేస్తున్నప్పుడు తనపై పంచ్‌లు వేసినా తీసుకోవాలి, తాను వేసేలా కూడా ఉండాలి, అప్పుడే వినోదం పండుతుందన్నారు సౌమ్య రావు. తనని జబర్దస్త్ నుంచి తప్పించడానికి ఆది కారణం కాదని తెలిపింది. 
 

56

ఇదిలా ఉంటే తనపై బాడీ షేమింగ్‌ కామెంట్లకి రియాక్ట్ అయ్యింది. ఓ రోజు షో రోహిణి దిష్టిబొమ్మలా ఉందని కామెంట్‌ చేసిందని, అంతేకాదు తనపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యిందని, కాసేపు హీట్‌ మూమెంట్‌ నెలకొంది. ఆ క్షణంలో తాను ఫీలైనట్టు తెలిపింది సౌమ్యరావు. కాకపోతే అది జోక్‌ అని ఆ తర్వాత చెప్పడంలో కూల్‌ అయిపోయాను,

కానీ ముందు తనకు ఆ విషయం చెప్పలేదని, ఏంటీ ఇలా అంటున్నారని కాసేపు తనకు కూడా అర్థం లేదని తెలిపింది. దీంతో బాధ పడినా, వెంటనే తేరుకున్నానని చెప్పింది. ఇవన్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో భాగమే అని తెలిపింది సౌమ్యరావు. కామెడీ షో చేస్తున్నప్పుడు ఇవన్నీ కామన్‌ అని, వాటిని తీసుకుంటేనే షోస్‌ చేయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలని తెలిపింది. 
 

66

ఇక ఇప్పుడు కొత్తగా షోస్‌ చేయకపోవడం, సీరియల్స్ లోనూ కనిపించకపోవడంపై స్పందిస్తూ, ఎవరూ తనకు సరైన స్క్రిప్ట్ లు ఆఫర్‌ చేయడం లేదని తెలిపింది. ఇంకా సరైన ఎంకరేజ్‌మెంట్‌ రావడం లేదని అన్నారు. ఆ విషయంలో తనకు ఎంతో వెలితి ఉందని చెప్పింది. అయితే తన పాత్ర ఎలివేట్‌ అయ్యేలా, బలంగా ఉన్న వాటికే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపింది సౌమ్య రావు. కమ్‌ బ్యాక్‌ కోసం వెచి చూస్తున్నట్లు వెల్లడించింది సౌమ్య రావు.

ఆమె జబర్దస్త్ షోకి అనసూయ స్థానంలో వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాదికిపైగానే చేసింది కానీ ఉన్నట్టుండి తొలగించారు. ఆ తర్వాత సిరి వచ్చింది. చివరకు ఒక షో మొత్తం ఎత్తేసి ఒక్క షో జబర్దస్ ని మాత్రమే నడిపిస్తున్నారు. అయితే సౌమ్య రావుని తప్పించడానికి ఆమె అంతగా ఆకట్టుకోలేకపోవడమే కారణమని, రేటింగ్‌ రాకపోవడమే కారణమని తెలుస్తుంది. 

read more: `విడుదల 2` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విజయ్‌ సేతుపతి విశ్వరూపం చూపించాడా?

also read: `బచ్చల మల్లి` మూవీ రివ్యూ, రేటింగ్‌.. అల్లరి నరేష్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved