- Home
- Entertainment
- Prema Entha Madhuram: అంజలిపై చెయ్యి పడనివ్వని నీరజ్.. మరో ముప్పు తేవడానికి కంకణం కట్టుకున్న మాన్సీ?
Prema Entha Madhuram: అంజలిపై చెయ్యి పడనివ్వని నీరజ్.. మరో ముప్పు తేవడానికి కంకణం కట్టుకున్న మాన్సీ?
Prema Entha Madhuram: స్టార్ మాలో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భార్య ప్రవర్తనకి విసిగిపోయి ఆత్మహత్యకి సిద్ధపడ్డ ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకండి అంటూ ఆర్య కి సంజాయిషి ఇస్తుంది అంజలి. వేలం నిర్వాహకుల దగ్గరికి వెళ్లి దయచేసి వేలాన్ని ఆపండి 13 కోట్లకి సరిపడా ప్రాపర్టీస్ ని నేను ఇస్తున్నాను వీటిని అమ్మి అప్పులు సెటిల్ చేయండి అంటుంది. ప్రాపర్టీస్ ని ఎస్టిమేషన్ వేసి ఏ విషయము చెప్తాము అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు నిర్వాహకులు.
వేలం పాట పాడటానికి వచ్చిన వాళ్ళందరికి కృతజ్ఞతలు చెప్పి పంపించేస్తుంది అంజలి. నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా నాకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా అంటూ మందలిస్తాడు మదన్. నేను నీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు నా వర్ధన్ ఫ్యామిలీకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అంటుంది అంజలి.
రేపు అక్కడ ఏమైనా జరిగితే నువ్వు వచ్చేది నా ఇంటికి అంటాడు. కోపంగా గో టు హెల్ అంటుంది అంజలి. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మదన్. అసలు ఏం జరిగింది అని నీరజ్ ని నిలదీస్తాడు ఆర్య. తనని ఏమీ అడక్కండి దీని అందరికి కారణం నేనే తను సూసైడ్ చేసుకోబోయేడు అంటూ జరిగిందంతా చెప్తుంది అంజలి.
మీ అన్నయ్య మీద ప్రేమ ఉంటే చనిపోవటం ఎందుకు నేను చెప్పినట్లు చేస్తావా.. నాకు కూడా ఆర్య సార్ అంటే అభిమానమే ఆయన కోసం మనమిద్దరం పెళ్లి చేసుకోవాలి అంటుంది అంజలి. అందుకు ఒప్పుకోడు నీరజ్. కానీ నీరజ్ ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను అని ఆర్య కి చెప్తుంది అంజలి. అసలు పెళ్లి అంటే ఏంటో తెలుసా నీకు? నా భర్తని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ అంజలి మెడలో తాళి తెంపటానికి ప్రయత్నిస్తుంది మాన్సీ.
మాన్సీ చెంప చెళ్లుమనిపిస్తాడు నీరజ్. ఇప్పుడు తను నా భార్య అంటాడు నీరజ్. మీరేమీ మాట్లాడరేమి బ్రో ఇన్ లా అంటుంది మాన్సీ. ఆర్య ఏమి మాట్లాడకపోవడంతో అవున్లెండి వాళ్ళిద్దరూ మీకోసమే పెళ్లి చేసుకున్నారు కదా మీరు ఎందుకు మాట్లాడతారు.. 1300 కోట్ల కోసం మరీ ఇంత దిగజారిపోతారు అనుకోలేదు అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది మాన్సీ. అంతకుమించి ఇంకొక మాట మాట్లాడితే తోటి కోడలని కూడా చూడను అంటూ హెచ్చరిస్తుంది అను.
అవును పెయిన్ నీకు కాదు నాకు కదా అంటూ అంజలి దగ్గరికి వెళ్లి ఆర్య సార్ అంటే రెస్పెక్ట్ అంటున్నావు కదా ఆయననే పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది మాన్సీ. ఆయనకి పెళ్లి అవ్వకపోతే అదే చేసేదాన్ని అంటుంది అంజలి. మరి నీరజ్ కి పెళ్లయింది కదా వైఫ్ ని నేనున్నాను కదా అంటుంది మాన్సీ. నువ్వు ఉన్నా లేనట్లే.. నీ వల్ల నా తమ్ముడు చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు దేన్నైనా క్షమిస్తాను కానీ ప్రేమించే మనుషుల్ని వదులుకోను అంటాడు ఆర్య.
అంటే అంజలిని చేరదీసి నన్ను దూరం పెడుతున్నారన్నమాట. సరే మీరు చేయవలసింది మీరు చేశారు. నేనేం చేస్తాను ఇక మీదట చూస్తూ ఉండండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాన్సీ. మీకు చెప్పకుండా నీరజ్ ని పెళ్లి చేసుకున్నందుకు క్షమించండి అని శారదమ్మతో అంటుంది అంజలి. నువ్వు చేసిన త్యాగానికి నేనే నీకు థాంక్స్ చెప్పాలి. వర్ధన్ కుటుంబం నీకు రుణపడి ఉంటుంది అంటుంది.
అంత మాట అనకండి ఆర్య సార్ కి నేను రుణపడి ఉన్నాను. ఆర్య సార్ అను ఇద్దరు నా కోసం ఎంతో చేశారు. వాళ్ళిద్దరి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే అంటుంది అంజలి. ఇంతలో వేలంపాట నిర్వాహకులు వచ్చి ప్రాపర్టీ వాల్యూ సరిపోయింది అని చెప్తారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి మీరు నాకు చాలా సాయం చేశారు కనీసం థాంక్స్ కూడా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు తప్పదు అంటుంది అంజలి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.