- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: అభిని ఆటాడుకుంటున్న నీలాంబరి.. వేద కాపురంలో విషం చిమ్ముతున్న మాళవిక!
Ennenno Janmala Bandham: అభిని ఆటాడుకుంటున్న నీలాంబరి.. వేద కాపురంలో విషం చిమ్ముతున్న మాళవిక!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. కష్టంలో ఉన్న తన సవతిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ఒక ఇల్లాలి కథ ఈ సీరియల్.

ఎపిసోడ్ ప్రారంభంలో కన్న కొడుకుతో కలిసి ఉండాలని ఏ తండ్రికి ఉండదు కానీ నాలాంటి దురదృష్టవంతులకి అంతా అదృష్టం లేదు అని నిరాశగా మాట్లాడుతాడు యష్. ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతారు ఆదిత్య మన ఇంట్లోనే ఉన్నాడు కదా మనకి ఇంకా అవకాశం ఉంది శాశ్వతంగా తనని ఇక్కడే ఉంచేలాగా ఏర్పాట్లు చేద్దాము. మిమ్మల్ని ఆదిత్యని కలిపే బాధ్యత నాది అని భర్తకి ధైర్యం చెప్తుంది వేద.
సీన్ కట్ చేస్తే స్పృహలోకి వచ్చిన మాళవికకి తను ఎక్కడ ఉందో అర్థం కాదు. పక్కనే పడుకున్న ఆదిత్యని నిద్రలేపి విషయం తెలుసుకుంటుంది. ఏమో అనుకున్నాను కానీ వేద ఆంటీ చాలా మంచిది. తన వల్లే డాడీ నిన్ను ఇంటికి తీసుకువచ్చారు అంటూ వేదని పొగుడుతాడు ఆదిత్య. వీడేంటి వేద చూపిస్తున్న ప్రేమకి కరిగిపోతున్నట్లుగా ఉన్నాడు ఎలాగైనా వీడి మనసు మార్చాలి అనుకుని వేద మీద లేనిపోనివి చెప్తుంది మాళవిక.
తను నీతో ఏం చెప్పినా వచ్చి నాకు చెప్పు అంటూ ఆదిత్య ని పొల్యూట్ చేస్తుంది. మరోవైపు గార్డెన్ లో యోగా చేస్తున్న యష్ కి వేదని చూస్తూనే నడుం పట్టేస్తుంది. ఎందుకు అలా పెట్టేసింది అని అడుగుతుంది వేద. నిన్ను ఇలా చూశాను అలా నడుము పట్టేసింది అంతా నీ వల్లే. నువ్వు డాక్టర్ వి కదా ఏదో ఒకటి చెయ్యు అంటాడు యష్. తన కళ్ళలోకి సూటిగా చూడమంటుంది వేద. యష్ ట్రాన్స్ లో ఉండగా నడుముని సెట్ చేసేస్తుంది వేద.వేద ని మెచ్చుకుంటాడు యష్.
ఫీజు అడుగుతుంది వేద. టక్కున ముద్దు పెట్టేస్తాడు యష్. ఒకసారి గా షాక్ అవుతుంది వేద. మరోవైపు పూజ చేసుకుంటూ ఉంటుంది నీలాంబరి. అంతలో కైలాష్ వస్తాడు. టిఫిన్ అయిందా బ్రో అంటూ అభి ని పలకరిస్తాడు. లేదు ఇంకా పూజ అవుతుంది అంటాడు అభి. అయితే చెల్లెలు చాలా సిస్టమాటిక్ అన్నమాట అంటాడు కైలాష్. తను వచ్చేలోపు నాకు ఒక విషయం చెప్పు అసలు నీకు సిగ్గు అభిమానం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు కైలాష్.
ఏం మాట్లాడుతున్నావ్ అంటూ చెంప పగలగొడతాడు అభి. ఆ యష్ వచ్చి నీ పెళ్ళాం ముందే నిన్ను చిదగ్గొట్టి వెళ్ళాడు అయినా నువ్వు కాళ్లు చేతులు ముడుచుకొని కూర్చున్నావు అంటూ రెచ్చగొడతాడు కైలాష్. వాడికి టైం వచ్చింది వాడు కొట్టాడు నాకు కూడా టైం వస్తుంది నేను కొడతాను కొడితే పది జన్మల వరకు మర్చిపోకూడదు అలా కొడతాను అంటూ కోపంగా మాట్లాడుతాడు అభి. అంతలోనే హారతి తీసుకొని వస్తుంది నీలాంబరి.
మన పెళ్లి అనుకోకుండా అయిపోయింది నీ మీద నాకు పూర్తి ప్రేమ ఉంది కానీ నామీద నీకు పూర్తి ప్రేమ ఉందో లేదో చిన్న టెస్టు పెడతాను గెలిస్తే నా మీద ప్రేమ ఉన్నట్లు అంటుంది నీలాంబరి. ప్రేమ ఉందని తెలిస్తే ఏం చేస్తావు అంటాడు కైలాష్. నా ఆస్తికి నా భర్తని వారసుడిని చేస్తాను అంటుంది నీలాంబరి. అభి చేతిలో కర్పూరం పెట్టి వెలిగిస్తుంది. కైలాష్ అభి ఇద్దరు షాక్ అవుతారు. కాలిపోతుంది అంటాడు అభి.
కింద పడేయొద్దు అది పూర్తిగా కాలే వరకు చేతిలో ఉంచుకుంటే నా మీద ప్రేమ ఉన్నట్టు అంటుంది నీలాంబరి. తప్పదన్నట్లు పూర్తిగా హారతి కర్పూరం అయిపోయే వరకు ఉంచుకుంటాడు అభి. వెరీ గుడ్ నామీద కొంచెం ప్రేమ ఉన్నట్లు రుజువు అయింది ఇంకా ఇలాంటి టెస్టులు కొన్ని ఉన్నాయి అవన్ని పాస్ అవ్వాలి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది నీలాంబరి. బాధతో విలవిలలాడుతున్న అభి ని చూసి. ఇది సిస్టమేటిక్ కాదు బ్రో శాడిస్టిక్ అంటాడు కైలాష్.
మరోవైపు ఆదిత్య బలంగా ఉండాలి అంటూ వాడి కోసం సున్నుండలు చేస్తూ ఉంటుంది మాలిని. అప్పుడే వచ్చిన మాళవిక నేను ఏమైనా సాయం చేయనా అని అడుగుతుంది. అక్కరలేదు. ఇప్పటివరకు చేసిన సాయం చాలు. అయినా సిగ్గు లేకుండా ఇళ్లల్లోకి ఎలా వచ్చేస్తారో. వచ్చినా వెంటనే వెళ్ళిపోవాలి కానీ ఇలా తిష్ట వేయడం ఏంటో అంటూ మాళవిక బాధపడేలాగా మాట్లాడుతుంది మాలిని. మాలిని నెమ్మదిగా మందలిస్తుంది వేద.
అప్పుడే నిద్ర లేచావేంటి అంటూ మాళవికతో మాటలు కలుపుతుంది. తరువాయి భాగంలో కూతుర్ని స్కూల్ కి తీసుకు వెళ్తుంటాడు యష్. అదే సమయంలో మాళవిక వచ్చి ఆదిత్యను కూడా తీసుకెళ్లమంటుంది. కానీ యష్ వినిపించుకోడు. అదే పని వేద చెప్తే నవ్వుతూ చేస్తాడు. వేద కి థాంక్స్ చెప్తుంది మాళవిక. ఇది నా బాధ్యత అంటుంది వేద. ఆ బాధ్యతని ఎలా దూరం చేస్తానో చూడు అని మనసులోనే అనుకుంటుంది మాళవిక.