73 ఏళ్ళ సీనియర్ హీరో జోడీగా నాలుగోసారి నంటిచబోతున్న నయనతార,
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార 40 ఏళ్ళు వచ్చిన ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది. సీనియర్ హీరోల జంటగా నటిస్తోంది. తాజాగా ఈ తార 73 ఏళ్ళ సీనియర్ హీరోలకు జంటగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో..?

నయనతార కొత్త సినిమా
ఏజ్ బారు అవుతున్న ఏమాత్రం వన్నెతగ్గలేదు లేడీ సూపర్ స్టార్ నయనతారకు. ఫిట్ నెస్, గ్లామర్ విషయంలో కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తోంది సీనియర్ బ్యూటీ. యంగ్ స్టార్స్ తో ఆడిపాడిన నయన్.. ఇప్పుడు సీనియర్ హీరోల జతగా నటిస్తోంది. ప్రస్తుతం నయనతార చేతిలో నాలుగైదు సినిమాలు ఉండగా.. అందులో మలయాళ సినిమా కూడా ఉండటం విశేషం.
లేడీ సూపర్‌స్టార్ నయనతార మహేష్ నారాయణన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. కొచ్చిలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈమూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టికి జంటగా నటిస్తోంది నయన్. వీరిద్దరు షూటింగ్ సెట్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: దేవర 2 షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్, ఎన్టీఆర్ కోసం భారీ స్కెచ్ వేసిన కొరటాల
మళ్ళీ మలయాళంలో నయనతార
నయనతార - మమ్ముట్టి కాంబినేషన్‌లో నాలుగోవ సినిమా గతంలో వీరిద్దరు కలిసి 'ఎంఎంఎంఎన్'. రాప్పకల్, భాస్కర్ ది రాస్కల్, నియమం సినిమాలు చేశారు.మలయాళ మెగాస్టార్, లేడీ సూపర్‌స్టార్ మళ్ళీ కలిసి నటిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. జంటగా నటిస్తున్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటిస్తున్నారనే వార్తే సినిమాపై అంచనాలు పెంచింది.
Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?
మమ్ముట్టి సినిమాలో నయనతార
వీరితో పాటు కుంచాకో బోబన్, ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. గత వారం రేవతి కూడా జాయిన్ అయ్యారు. రంజి పణికర్, రాజీవ్ మీనన్, డానిష్ హుస్సేన్, షాహీన్ సిద్ధిఖ్, సనల్ అమన్, దర్శన రాజేంద్రన్, షెరిన్ షిహాబ్, ప్రకాష్ బెలవాడి తదితరులు నటిస్తున్నారు.
శ్రీలంకలో షూటింగ్ మొదలైంది. రెండు షెడ్యూల్స్ అక్కడ పూర్తయ్యాయి. యూఏఈ, అజర్‌బైజాన్‌లలో ఒక్కో షెడ్యూల్ పూర్తయింది. కొచ్చి షూటింగ్ తర్వాత 14 నుంచి ఢిల్లీలో షూటింగ్ జరుగుతుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది.
Also Read: నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా
మహేష్ నారాయణన్ దర్శకత్వంలో మమ్ముట్టి
'రాప్పకల్' సినిమాలో మమ్ముట్టి - నయనతార జంట మొదటిసారి కలిసి నటించింది. గౌరీ - కృష్ణ జంటకు మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత 2015లో 'భాస్కర్ ది రాస్కల్' విడుదలైంది. దీనికి సిద్ధిఖ్ దర్శకత్వం వహించారు. 2016లో 'పుతియ నియమం' విడుదలైంది. కథతో ఆకట్టుకున్న ఈ సినిమాకు ఎ.కె. సాజన్ దర్శకత్వం వహించారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు నాల్గవ సారి కలుస్తుండటంతో అంచనాలు పెరిగాయి.
Also Read: 20 ఏళ్లుగా రహస్య సాధన చేస్తోన్న రజినీకాంత్, కారణం ఏంటోతెలుసా?