- Home
- Entertainment
- హిట్ 3 ట్విట్టర్ రివ్యూ.. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో మోత మోగించిన నాని, బ్లాక్ బస్టర్ కొట్టేశాడా?
హిట్ 3 ట్విట్టర్ రివ్యూ.. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో మోత మోగించిన నాని, బ్లాక్ బస్టర్ కొట్టేశాడా?
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాని ఇటీవల ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేస్తున్నారు. కానీ హిట్ 3 నాని కెరీర్ లోనే మోస్ట్ వయలెంట్ మూవీ. అర్జున్ సర్కార్ అనే పోలీస్ అధికారి కరుడు కట్టిన క్రిమినల్స్ ని ఎలా వేటాడాడు అనేది ఈ చిత్ర కథ.

Hit 3 Movie
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాని ఇటీవల ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేస్తున్నారు. కానీ హిట్ 3 నాని కెరీర్ లోనే మోస్ట్ వయలెంట్ మూవీ. అర్జున్ సర్కార్ అనే పోలీస్ అధికారి కరుడు కట్టిన క్రిమినల్స్ ని ఎలా వేటాడాడు అనేది ఈ చిత్ర కథ. హిట్ ప్రాంఛైజీలో ఇది మూడవ చిత్రం. హిట్ మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండవ భాగంలో అడివి శేష్ హీరోలుగా నటించారు. ఇప్పుడు హిట్ ది థర్డ్ కేస్ అంటూ నాని రంగంలోకి దిగాడు. సినిమా సినిమాకి హిట్ సిరీస్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
Hit 3 Movie
ఈసారి దర్శకుడు శైలేష్ కొలను ఎలాంటి సర్ప్రైజ్ చేయబోతున్నారు ? ట్విస్టులు ఎలా ఉండబోతున్నాయి ? నాని యాక్షన్ విధ్వంసం ఎలా ఉండబోతోంది ? ఇలాంటి ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ ప్రశ్నలకు ఆన్సర్ దొరికే సమయం వచ్చేసింది. నేడు గురువారం రోజు హిట్ 3 చిత్రం రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి హిట్ 3 చిత్రానికి ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ట్విట్టర్ వేదికగా హిట్ 3 విశేషాలు పంచుకుంటున్నారు. మరి హిట్ 3 ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉందా లేదా అనేది ప్రీమియర్ షోల రెస్పాన్స్ ని బట్టి తెలుసుకుందాం.
Hit 3 Movie
కోర్టు సన్నివేశాలతో కథ మొదలవుతుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి, నాని మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రీ ఇంటర్వెల్ వరకు కథ నెమ్మదిగా ఉంటుంది. అక్కడి నుంచి వేగం పుంజుకోవడం మాత్రమే కాక ఆసక్తికరంగా సన్నివేశాలు ఉంటాయి. ఇంటర్వెల్ సన్నివేశం ఉత్కంఠగా ముగుస్తుంది. ముందుగా చెప్పినట్లుగానే వయలెన్స్ ఎక్కువగా ఉంది. నాని కొన్ని బోల్డ్ డైలాగులు కూడా చెబుతున్నాడు. నాని క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫెరెంట్ గా ఉంది. నానికి ఇలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. వన్ లైన్ డైలాగులు చాలా బావున్నాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగింది.
Hit 3 Movie
ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. నాని తన కెరీర్ లోనే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో ఎంగేజింగ్ గా అనిపించే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. నాని చెప్పినట్లుగానే చివరి 30 నిముషాలు ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లోకి వెళుతుంది. నాని పాత్ర ఆడియన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డైలాగులు, నాని పెర్ఫార్మెన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ చిత్రాన్ని నిలబెట్టాయి.
Hit 3 Movie
అయితే భారీ ట్విస్టులు ఆశించి వెళ్లినవారికి కాస్త నిరాశ తప్పదు. ఈ మూవీలో అద్భుతమైన ట్విస్టులు ఏమీ ఉండవు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా నార్మల్ గా ఉంటాయి. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకం. కానీ ఈ మూవీలో బిజియం ఆశించిన స్థాయిలో లేదు. నిర్మాణ విలువలు, సినిమా టోగ్రఫీ నెక్ట్ లెవల్ లో ఉన్నాయి అని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది.
Hit 3 Movie
చిన్న పిల్లలు, ఆడవారు చూడలేని మితిమీరిన వయలెన్స్ తో కూడిన సన్నివేశాలు ఉన్నాయి. నాని తొలిసారి బోల్డ్ గా డైలాగులు చెప్పడం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. శైలేష్ కొలను ఈసారి హిట్ ప్రాంఛైజీలో థ్రిల్ మూమెంట్స్ కంటే మాస్ మూమెంట్స్ నే ఎక్కువగా నమ్మకున్నారు. ఓవరాల్ హిట్ ది థర్డ్ కేస్ చిత్రం బావుంది కానీ పూర్తి స్థాయిలో అంచనాలని అందుకోలేదు అని అంటున్నారు. నాని మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు అని ఆడియన్స్ అంటున్నారు.