- Home
- Entertainment
- లెక్చరర్ ని అవమానించిన చిరంజీవి, తన తప్పు తెలుసుకుని తిరిగి సాయం చేస్తే ఏం జరిగిందో తెలుసా ?
లెక్చరర్ ని అవమానించిన చిరంజీవి, తన తప్పు తెలుసుకుని తిరిగి సాయం చేస్తే ఏం జరిగిందో తెలుసా ?
మెగాస్టార్ చిరంజీవి 1983లో ఖైదీ చిత్రంలో నటించిన తర్వాత టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగారు. చిరంజీవికి కంప్లీట్ గా మాస్ అండ్ యాక్షన్ హీరోగా ఇమేజ్ వచ్చింది.

megastar chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి 1983లో ఖైదీ చిత్రంలో నటించిన తర్వాత టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగారు. చిరంజీవికి కంప్లీట్ గా మాస్ అండ్ యాక్షన్ హీరోగా ఇమేజ్ వచ్చింది. అంత స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా చిరంజీవి తన ఇమేజ్ కి భిన్నంగా కొన్ని చిత్రాల్లో నటించారు. అలాంటి చిత్రాల్లో ఒకటి జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చంటబ్బాయ్.
chiranjeevi
జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో టాలీవుడ్ లో ఒక మిరాకిల్ జరిగింది. ఆ అద్భుతం ఇంకేంటో కాదు.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటుడిగా చంటబ్బాయ్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడమే. కట్ చేస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో బ్రహ్మానందం స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టాలీవుడ్ లో బ్రహ్మానందం అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే కమెడియన్ గా ఎదిగారు. అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా అందుకున్నారు. బ్రహ్మి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నందుకు గాను టాలీవుడ్ చిత్ర పరిశ్రమ బ్రహ్మీని గతంలో సన్మానించింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, చిరంజీవి అనేక విషయాలు పంచుకున్నారు. చిరంజీవికి బ్రహ్మానందం చాలా క్లోజ్ అనే సంగతి తెలిసిందే.
Brahmanandam
ఈ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ తన కెరీర్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. జంధ్యాలకి బ్రహ్మానందం తెలిసిన వ్యక్తి. అందుకే చంటబ్బాయ్ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అయితే ఆ చిత్రంలో బ్రహ్మీ పోషించింది చిన్న పాత్ర మాత్రమే. ఆ తర్వాత బ్రహ్మీ టాలీవుడ్ లో ఎలా ఎదిగారు అనే విషయాన్ని చిరంజీవి తెలిపారు. బ్రహ్మానందం మాట్లాడుతుండగా వెంటపడి మైక్ లాక్కుని మరీ ఒక సంఘటన గురించి చెప్పారు. ఈ ఈవెంట్ లో చిరంజీవితో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి ప్రముఖులు పాల్గొన్నారు.
చంటబ్బాయ్ షూటింగ్ జరిగే సమయంలో బ్రహ్మానందం ఎవరో కూడా ఎవరికీ తెలియదు. చిరంజీవి మాట్లాడుతూ.. నేను సెట్ లో డ్యాన్స్ చేస్తున్నాను. బ్రహ్మానందం ముందుకు వచ్చి నిలబడి విచిత్రంగా చూస్తున్నాడు. అతడి పేస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నాకు చాలా డిస్ట్రబ్ గా అనిపిస్తుంది అంటూ చిరంజీవి నవ్వుతూ చెప్పారు. ఏ బాబు వెన్నక్కి వెళ్ళు అని కోపంగా చెప్పాను.
షూటింగ్ పూర్తయ్యాక జంధ్యాల గారు బ్రహ్మీని నాకు పరిచయం చేశారు. ఇతను లెక్చరర్ అని చెప్పారు. అయ్యో మీరు లెక్చరరా.. సారీ అండీ మీ ఫేస్ చూస్తే అలా అనిపించలేదు అని చిరు అన్నారు. దీనితో అక్కడున్న వారంతా పగలబడి నవ్వేశారు. అందుకే వెనక్కి వెళ్ళమని చెప్పాను అని చిరంజీవి అన్నారు. సారీ మాస్టారు ఏమీ అనుకోవద్దు అని చెప్పాను.
Brahmanandam
తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో సాయంత్రం రూమ్ కి రమ్మని పిలిచాను. కాస్త ఎక్కువ మాట్లాడితే జరిగిన తప్పు గురించి మరచిపోవచ్చు, ఫ్రెండ్స్ కూడా అవ్వొచ్చు అనే ఉద్దేశంతో బ్రహ్మీని రూమ్ కి పిలిచాను. రూమ్ కి తీసుకెళితే అతడు మిమిక్రీ అద్భుతంగా చేసి చూపించాడు. ఇతనిలో ఇంత ట్యాలెంట్ ఉందా అని అనిపించింది. ఇంత ప్రతిభ ఉన్న వ్యక్తి అత్తిలిలో ఉండిపోకూడదు అనే ఉద్దేశంతో వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నాతో పాటు చెన్నై తీసుకువెళ్లినట్లు చిరంజీవి గుర్తు చేసుకున్నారు. కట్ చేస్తే బ్రహ్మానందం టాలీవుడ్ లోనే తిరుగులేని కమెడియన్ అయ్యారు.