- Home
- Entertainment
- Intinti Gruhalashmi: లాస్య, నందు ఉచ్చులో అభి.. లాస్యపై కోపంతో రగిలిపోతున్న తులసి..?
Intinti Gruhalashmi: లాస్య, నందు ఉచ్చులో అభి.. లాస్యపై కోపంతో రగిలిపోతున్న తులసి..?
Intinti Gruhalashmi: బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో భాగ్య (bagya)లాస్య దగ్గరికి వచ్చి ఇప్పుడు అభి నీ గుప్పిట్లో ఉన్నాడు నువ్వు రెచ్చిపో అని చెప్పడంతో నువ్వు చెప్పినంత ఈజీ కాదు అని అంటుంది లాస్య. పాపం మా తులసి అక్క అభి కోట్లకు అధిపతి అవుతాడు అని తెలియక దూరం చేసుకుంది అనే భాగ్య అనడంతో ఇప్పటికైనా ఎం మించిపోలేదు మళ్లీ దగ్గర చేసుకుంటుంది అని లాస్య( lasya ) అనడంతో అప్పుడు వెంటనే భాగ్య అభి కూడా ఇంచుమించు నాలాగే అని అంటుంది.
అప్పుడు లాస్య అభి ని ఈజీగా మార్చవచ్చు కానీ అంకితను అంత ఈజీగా మార్చలేము అని అంటుంది. మరొకవైపు తులసి(tulasi) జాగింగ్ కోసం అనే పార్కులోకి వెళ్లగా అక్కడ తులసికి లాస్య ఎదురు పడుతుంది. అప్పుడు లాస్య నువ్వు నా నుంచి పారిపోవడానికి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా అని అనడంతో అసలు విషయం ఏంటి అనేది నీ అంతరాత్మకు తెలుసు అంటూ లాస్య(lasya)కు గట్టిగా బుద్ధి చెబుతుంది తులసి.
అభి(abhi) కి వచ్చిన కోట్ల ఆస్తి నేను నా సొంతం చేసుకుంటారు అని లాస్య అనడంతో అప్పుడు తులసి అది నీ వల్ల కాదు అని అనగా నా వల్ల కాకపోయిన నందువల్ల అవుతుంది కదా అని అంటుంది లాస్య. ఎలా అయినా నందు(nandu)ని అడ్డుపెట్టుకొని అభిని మా గుప్పెట్లో పెట్టుకుంటాను అంటూ తులసితో ఛాలెంజ్ చేస్తుంది లాస్య.
మరొకవైపు దివ్య,పరంధామయ్య ను కామెడీ గా ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో తులసి(tulasi) రావడంతో పరంధామయ్య ను మళ్లీ ఎక్కువగా ఆటపట్టిస్తూ ఉంటుంది. ఇంతలో సంగీతం నేర్చుకోవడానికి పిల్లలు వస్తారు. పిల్లలను చూసి తులసి ఆనందపడుతుంది. మరొకవైపు అభి కోసం లాస్య(lasya) నందు హడావిడిగా వంటలు చేస్తూ ఉంటారు.
ఇంతలోనే అభి నందు ఇంటికి వస్తాడు. ఆ తరువాత అభి ని కూర్చొబెట్టి వంట లు చేసాము తిను అని పాయసం వడ్డీస్తారు. అప్పుడే లాస్య లేనిపోని మాటలు చెప్పి అభి(abhi)ని వలలో వేసుకుంటుంది. అప్పుడు నందు కపట ప్రేమ చూపిస్తూ అభిని నమ్మించ ప్రయత్నిస్తాడు. అప్పుడు లాస్య (lasya)డబ్బు విషయం గురించి మాట్లాడుతూ మీ నాన్న కు నువ్వు అంటే చాలా ఇష్టమని అని అంటుంది.
అప్పుడు అభి(abhi) మీరేం భయపడకండి మీకు అన్ని విధాలుగా నేను నీకు తోడు ఉంటాను అని అంటాడు. ఆ తర్వాత అభి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. రేపటి ఎపిసోడ్ లో అంకిత(ankitha)ను ట్రాప్ చేయడానికి లాస్య నందు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. వారి ప్లాన్ తులసికి తెలియడంతో కోపంతో రగిలి పోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.