Intinti Gruhalakshmi: తులసిపై విరుచుకుపడిన నందు.. తులసి కి సపోర్ట్ గా సామ్రాట్?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో లాస్య, నందు ఇద్దరు తులసి ఇంటికి వెళుతూ ఉంటారు. ఇప్పుడు లాస్య మరికొద్ది సేపట్లో నందు అనే బాంబు పేల పోతుంది అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు తులసి ఇంట్లో అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు శృతి డాన్స్ చేస్తూ కింద పడిపోవడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు శృతి కడుపునొప్పి అని అల్లాడుతూ ఉండగా అందరూ కలిసి శృతిని హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తారు. ఇంతలోనే నందు లాస్య అక్కడికి వస్తారు. అప్పుడు లాస్య చేసినంత చేసి పిల్లలది తప్పు లేదు వాళ్లను ఏమి అనకు తప్పంతా ఆ తులసిదే అని అంటూ మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.
అక్కడ ఇంటికి తలుపు వేసి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేకపోవడంతో నందు లాస్య ఆలోచనలు పడతారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో నందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు నందు ఇంట్లో వాళ్లకి ఫోన్ చేస్తూ ఉండగా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరొకవైపు తులసి ఫ్యామిలీ అందరూ కలిసి శృతిని హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తారు. శృతిని లోపలికి పిలుచుకొని వెళ్తారు. ఇంతలోనే డాక్టర్ రావడంతో డాక్టర్ కి జరిగింది మొత్తం చెబుతుంది తులసి. లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు తులసి ఏడుస్తూ ఉండగా సామ్రాట్ ఎం కాదు ధైర్యంగా ఉండండి అని ఓదారుస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా జరుగుతోంది శుభవార్త జరిగిన రోజే ఇలా అనర్ధనం జరగడం ఏంటి.
అందరికంటే ముందే మీకు శుభవార్త చెబుతున్నాను ఆంటీ అంటూ సంతోషంతో పొంగిపోతు నాకు చెప్పింది. ఆ సంతోషాన్ని పూర్తిగా అనుభవించక ముందే ఎందుకు ఇలా దేవుడు ఏడిపిస్తున్నాడు అంటూ తులసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు పొద్దున హారతి చేతిలోనుంచి కింద పడిపోయినప్పుడు ఏంటి ఈ అపశకునం అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అనుకుంటూ ఉంటుంది తులసి. అప్పుడు తులసి మీ అమ్మ దురదృష్టవంతురాలు అని తెలుసు కదరా ఎందుకు శృతిని మన ఇంటికి తీసుకు వచ్చావు చూడు నా దురదృష్టం ఎలా చుట్టుకుందో అని ఏడుస్తూ ఉంటుంది తులసి. అప్పుడు ఎంతమంది ఓదారుస్తున్న తులసి ఏడుస్తూనే ఉంటుంది.
మరొకవైపు నందు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి కోపంతో రగిలిపోతూ ఉండగా అప్పుడు తులసి మీద లేనిపోనివన్నీ చెప్పి నందుని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది లాస్య. అప్పుడు అభికి నందు ఫోన్ చేస్తాడు. అప్పుడు అభి ఫోన్ లిఫ్ట్ చేసి డాడ్ మీద మరి తర్వాత మాట్లాడుతాను మీరు ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వస్తాను అనడంతో నందు కోపంతో మీరు ఎక్కడున్నారో చెప్తారా లేదా అని అభి పై సీరియస్ అవుతాడు. అప్పుడు అభి జరిగింది మొత్తం వివరించడంతో నందు షాక్ అవుతాడు. మరొకవైపు హాస్పిటల్ లో తులసి వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు అభి వెళ్లి తులసి పక్కలో కూర్చుని అక్కడి నుంచి టెన్షన్ పడుతూ లేచి వెళ్ళిపోతుండగా అప్పుడు అభి చేయి పట్టుకుని తులసి మా అందరి టెన్షన్ లో కంటే నీ టెన్షన్లు ఏదో తేడా కనిపిస్తోంది.
ఏం జరిగింది అభి అని అడుగుతుంది. అప్పుడు అభి డాడ్ వాళ్లు ఫోన్ చేశారు జరిగింది మొత్తం చెప్పాను అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు దివ్య అన్నయ్య మనం మనశ్శాంతిగా ఉండడం ఆ లాస్యకి ఇష్టం లేదు ఇక్కడికి వస్తే ఇక్కడ మొత్తం రచ్చ రచ్చ చేస్తుంది మన పరువు మొత్తం పోతుంది అనడంతో తులసి చిన్నపిల్లలకు ఉన్న బుద్ధి కూడా నీకు లేదు అనడంతో నాతో సెంటిమెంట్ ప్లే చేసి చెప్పించారు మామ్ అని అంటాడు అభి. మీరంతా ఇక్కడే ఉండండి అని తులసి అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఇంతలోనే అక్కడికి నందు వస్తాడు. నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు నందు కోపంలో తులసి మీద విరుచుకుపడుతూ ఉంటాడు. తులసిని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటాడు.
నువ్వు అసలు మా ఫ్యామిలీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని నిలదీస్తాడు నందు. తులసి నేనేం చేశాను అనడంతో చేసింది మొత్తం నువ్వే అని నందు సీరియస్ అవుతాడు. నిన్ను అసలు వదిలిపెట్టను చేసిందంతా నువ్వే అని తులసి మీదకు వెళుతుండగా సామ్రాట్ వచ్చి అడ్డుపడతాడు. అప్పుడు అడ్డు తప్పుకో అనడంతో నీకే కాదు నాకు కోపం వస్తుంది ఇది హాస్పిటల్ ఏరియా పబ్లిక్ ప్లేస్ మనిషిలా మాట్లాడి మనిషిలా ప్రవర్తించు అని అంటాడు. అప్పుడు నువ్వు ఎవడ్రా అనడంతో మైండ్ యువర్ లాంగ్వేజ్ నంద గోపాల్ అని సీరియస్ అవుతాడు సామ్రాట్. అప్పుడు లాస్య సామ్రాట్ మీద సీరియస్ అవుతూ నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటుంది.
అప్పుడు నందు లాస్య ఇద్దరు తులసి సామ్రాట్ల బంధం గురించి తప్పుగా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంటారు. అప్పుడు లాస్య నందుని మరింత రెచ్చగొడుతూ తులసి మీద లేనిపోని నిందలు అన్నీ వేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ ఇందులో అమ్మ తప్పులేదు మేమే పిలవకుండా అమ్మ ఇంటికి వెళ్ళాము అమ్మ వద్దు అన్న సెలబ్రేషన్స్ చేసుకున్నాము అని అంటాడు. అప్పుడు అమ్మ పిలవదు రా కుండానే వచ్చేలా చేసుకుంటుంది చేసేదంతా చేస్తుంది అని అంటాడు నందు.