MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tollywood: ఒకే రోజు ఏకంగా 9 మూవీస్ లాంచ్ చేశాడు.. స్టార్ హీరో అవుతాడనుకుంటే చివరికి విలన్‌గా.!

Tollywood: ఒకే రోజు ఏకంగా 9 మూవీస్ లాంచ్ చేశాడు.. స్టార్ హీరో అవుతాడనుకుంటే చివరికి విలన్‌గా.!

Tollywood: నందమూరి తారకరత్న తన సినీ అరంగేట్రంతోనే ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఒకే రోజు ఏకంగా 9 సినిమాలను ప్రారంభించి టాలీవుడ్‌లోనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఏకైక హీరోగా నిలిచాడు. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 08 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకే రోజు 9 సినిమాలు లాంచ్ చేసిన ఏకైక హీరో
Image Credit : Nandamuri Taraka Ratna\Instagram

ఒకే రోజు 9 సినిమాలు లాంచ్ చేసిన ఏకైక హీరో

టాలీవుడ్ చరిత్రలో ఎంతో మంది హీరోలు అరంగేట్రం చేశారు. కానీ నందమూరి తారకరత్న సృష్టించిన రికార్డు మాత్రం ఇప్పటికీ ఎవరు బద్దలు కొట్టలేరు. నందమూరి తారక రామారావు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అతడు, తన మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఒకే రోజు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది సినిమాలను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

25
ఆ రోజే 9 సినిమాల పూజా కార్యక్రమం
Image Credit : Nandamuri Taraka Ratna\Instagram

ఆ రోజే 9 సినిమాల పూజా కార్యక్రమం

తారకరత్న తన కెరీర్ ప్రారంభంలోనే ఒకేసారి తొమ్మిది కథలను విని, వాటికి సంతకం చేశారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ తొమ్మిది సినిమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఒకే రోజు జరిగాయి. అప్పట్లో ఈ వార్త టాలీవుడ్‌లోనే కాకుండా దేశీయ సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరో దొరికాడని, అతడు పెద్ద స్టార్ అవుతాడని అందరూ భావించారు.

Related Articles

Related image1
Chiranjeevi ప్లాప్ అనుకున్న సినిమాను పట్టుబట్టి చేశారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్
Related image2
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
35
దురదృష్టం వెంటాడుతున్నా..
Image Credit : Nandamuri Taraka Ratna\Twitter

దురదృష్టం వెంటాడుతున్నా..

అయితే, ఆరంభం అంత భారీగా ఉన్నా, బ్యాడ్ లక్ కారణంగా ఆ తొమ్మిది సినిమాలలో కేవలం మూడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. ఆ తర్వాత అతడి కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. అయినప్పటికీ, తారకరత్న తనలోని నటుడిని నిరంతరం నిరూపించుకుంటూనే ఉన్నాడు.

45
విలన్‌గా విశ్వరూపం
Image Credit : Nandamuri Taraka Ratna\Instagram

విలన్‌గా విశ్వరూపం

హీరోగా సక్సెస్ కాకపోయినా, 'అమరావతి' సినిమాలో అతడు పోషించిన విలన్ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో అతడి నటన చాలా టెర్రిఫిక్‌గా ఉంటుందని, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్‌గా అతడు గుర్తింపు పొందాడని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ పాత్రకు గాను అతడికి నంది అవార్డు కూడా దక్కడం విశేషం.

55
రికార్డ్ స్థాయిలో మొదలైన కెరీర్.. చివరికి.!
Image Credit : Nandamuri Taraka Ratna\Instagram

రికార్డ్ స్థాయిలో మొదలైన కెరీర్.. చివరికి.!

తొమ్మిది సినిమాల రికార్డు ప్రారంభంతో మొదలైన తారకరత్న ప్రస్థానం, తెలుగు సినీ చరిత్రలో ఒక అరుదైన పేజీగా నిలిచిపోతుంది. అయితే దురదృష్టవశాత్తూ చిన్న వయస్సులోనే నందమూరి కుటుంబానికి, అభిమానులకు కన్నీళ్లు మిగిల్చి.. ఫిబ్రవరి 18, 2023న గుండెపోటుతో మరణించాడు నందమూరి తారకరత్న.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవితో నటించి స్టార్ హీరోలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. ఒకరైతే అందరికీ బిగ్ సర్ప్రైజ్
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లాఠీ ట్రీట్, బెంగళూరులో ఏం జరిగింది?
Recommended image3
చిరంజీవికి ఎక్కువ డైలాగ్స్ లేకున్నా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా? మెగాస్టార్ కెరీర్ మార్చేసిన మూవీ?
Related Stories
Recommended image1
Chiranjeevi ప్లాప్ అనుకున్న సినిమాను పట్టుబట్టి చేశారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్
Recommended image2
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved