MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Nandamuri Chaitanya Krishna: మొదటి సినిమాలో తనకు జరిగిన అన్యాయంపై చైతన్య కృష్ణ ఆవేదన.. తప్పు జరిగింది అక్కడే

Nandamuri Chaitanya Krishna: మొదటి సినిమాలో తనకు జరిగిన అన్యాయంపై చైతన్య కృష్ణ ఆవేదన.. తప్పు జరిగింది అక్కడే

Nandamuri Chaitanya Krishna: నందమూరి చైతన్యకృష్ణ సినిమాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో తెలిపారు. తనకు మొదటి సినిమా సమయంలో జరిగిన అన్యాయంపై స్పందించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 16 2026, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్రీత్‌ మూవీతో అలరించిన నందమూరి చైతన్య కృష్ణ
Image Credit : Chaitanya Krishna\Twitter

బ్రీత్‌ మూవీతో అలరించిన నందమూరి చైతన్య కృష్ణ

నందమూరి చైతన్యకృష్ణ.. ఎన్టీఆర్‌ మనవడిలో ఒకరు. ఒకప్పుడు హీరోగా నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత చాలా గ్యాప్‌తో ఇటీవల `బ్రీత్‌` అనే చిత్రంతో మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ఈ మూవీ ఆడలేదు. మళ్లీ మూవీస్‌కి గ్యాప్‌ ఇచ్చారు. ఈ క్రమంలో నందమూరి చైతన్యకృష్ణ తనకు సంబంధించి జరిగిన ఒక అన్యాయాన్ని బయటపెట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చైతన్యకృష్ణకి అన్యాయం
Image Credit : our own

చైతన్యకృష్ణకి అన్యాయం

మొదటి సినిమా సమయంలో తనకు అన్యాయం చేశారని తెలిపారు. చెప్పింది ఒకటి, చేసింది మరోటి అన్నారు. కథలో మార్పులు చేయడం వల్లే సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు. హీరో పాత్ర అని చెప్పి, పాత్రని తగ్గించడం వంటి మార్పులు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సంఘటన తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పాల్సి వచ్చిందన్నారు. తాను ఎందుకు సినిమాలు చేయలేదనే ప్రశ్నకి ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.  గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.

Related Articles

Related image1
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Related image2
Balakrishna Wife Background: బాలకృష్ణ భార్య వసుంధర దేవి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే మతిపోతుంది.. పుట్టుకతోనే ఇంత రిచ్చా?
35
ఫ్యామిలీ వ్యాపారాలు చూసుకున్న చైతన్యకృష్ణ
Image Credit : our own

ఫ్యామిలీ వ్యాపారాలు చూసుకున్న చైతన్యకృష్ణ

దాదాపు ఇరవై ఏళ్ల పాటు వెండితెరకు దూరం కావడం, తెరవెనకే ఉండటానికి కారణాలను ఆయన వెల్లడించారు. తాను ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను చూసుకోవడానికే తెరవెనుక ఉండిపోయాడట. ఎన్టీఆర్‌ 1968లో రామకృష్ణ 70ఎంఎం థియేటర్ ని నిర్మించారు. అది తన కొడుకు జయకృష్ణకి వచ్చింది. ఆ థియేటర్ ని మొదట జయకృష్ణ చూసుకున్నారు. ఆ తర్వాత ఆయన కొడుకైన చైతన్య కృష్ణ ఆ బాధత్యలు తీసుకున్నారు. వీటితోపాటు ఇతర వ్యాపారాలను తాను నిర్వహించినట్టు చెప్పారు చైతన్యకృష్ణ.

45
ధమ్‌ మూవీలో జరిగిన అన్యాయం
Image Credit : stockPhoto

ధమ్‌ మూవీలో జరిగిన అన్యాయం

సినిమాలకు దూరంగా ఉండటానికి ఇంకో కారణం చెప్పారు. చైతన్యకృష్ణ నటించిన మొదటి సినిమా `ధమ్‌`. ఈ సినిమాలో ముగ్గురు విద్యార్థులకు హీరో రేంజ్‌ పాత్రలు ఉంటాయని, అందులో జగపతిబాబు పాత్రకి సమానంగా తన పాత్ర ఉంటుందని చెప్పారట. కానీ షూటింగ్‌ చేసే క్రమంలో కథ మొత్తం మారిపోయిందట. పాత్రల ప్రయారిటీ మారిపోయిందట. తనకు చెప్పింది ఒకటి, తెరపై తీసింది మరోటి అని, దాని వల్లే సినిమా పోయిందని తెలిపారు. ఆ సినిమా విషయంలో తనకు జరిగిన అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోయినట్టు తెలిపారు చైతన్యకృష్ణ. అందుకే సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందట. మళ్లీ వ్యాపారాలు చూసుకుంటూ ఉండిపోయినట్టు చెప్పారు. 2013-14 టైమ్‌లో ఇండస్ట్రీ కొంత క్రైసిస్‌లో ఉందని, ఆ సమయంలో సినిమాల సక్సెస్‌ రేటు బాగా పడిపోయిందని, పైరసీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, దీనికితోడు మంచి కథలు రాలేదు, దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే బెటర్‌ అనుకుని  సినిమాలకు దూరంగా ఉన్నట్టు చెప్పారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.

55
జగపతిబాబు హీరోగా ధమ్‌ మూవీ
Image Credit : stockPhoto

జగపతిబాబు హీరోగా ధమ్‌ మూవీ

2003లో వచ్చిన `ధమ్‌‌` చిత్రంలో జగపతిబాబు, సోనియా అగర్వాల్‌, నేహా మెహతా హీరోహీరోయిన్లుగా నటించారు. నందమూరి చైతన్య కృష్ణ కీలక పాత్రలో మెరిశారు. బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్‌ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందింది. రాజు వూపటి దర్శకత్వం వహించారు. యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో సినిమాలకు దూరమైన చైతన్యకృష్ణ సరిగ్గా 20ఏళ్ల తర్వాత 2023లో `బ్రీత్‌`లో నటించారు. ఇది కూడా డిజాస్టర్‌ అయ్యింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Recommended image2
Balakrishna Wife Background: బాలకృష్ణ భార్య వసుంధర దేవి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే మతిపోతుంది.. పుట్టుకతోనే ఇంత రిచ్చా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved