MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మా అందరికంటే ఎక్కువ ఆస్తి ఉన్నది ఆయనకే.. చైతన్య కృష్ణ కీలక వ్యాఖ్యలు..

మా అందరికంటే ఎక్కువ ఆస్తి ఉన్నది ఆయనకే.. చైతన్య కృష్ణ కీలక వ్యాఖ్యలు..

Nandamuri Chaitanya: నందమూరి చైతన్య కృష్ణ తమ కుటుంబ ఆస్తులు, వాటి నిర్వహణ గురించి వివరించారు. రామకృష్ణ 70ఎంఎం థియేటర్, స్టూడియోలతో పాటు, తాతగారి వారసత్వం, నాన్న లో ప్రొఫైల్ జీవితం వెనుక కారణాలు తెలిపారు.  

2 Min read
Author : Pavithra D
Published : Jan 26 2026, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తొలి చిత్రం బ్రీత్ ద్వారా..
Image Credit : Chaitanya Krishna\Twitter

తొలి చిత్రం బ్రీత్ ద్వారా..

నందమూరి చైతన్య కృష్ణ తన తొలి చిత్రం బ్రీత్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తమ కుటుంబ చరిత్ర, ఆస్తుల నిర్వహణ, నందమూరి కుటుంబ సభ్యుల విశేషాలపై అనేక విషయాలను పంచుకున్నారు.

25
తమకు రామకృష్ణ 70ఎంఎం థియేటర్
Image Credit : our own

తమకు రామకృష్ణ 70ఎంఎం థియేటర్

నందమూరి తారక రామారావు వారసత్వ ఆస్తుల్లో భాగంగా తమకు రామకృష్ణ 70ఎంఎం థియేటర్ వచ్చిందని తెలిపారు. ఈ థియేటర్ సికింద్రాబాద్‌లో ఎక్కువగా హిందీ సినిమాలను ప్రదర్శించేదని పేర్కొన్నారు. చైతన్య కృష్ణ తండ్రి, నందమూరి జయకృష్ణ కుటుంబ ఆస్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారని, 70ఎంఎం థియేటర్, 35ఎంఎం థియేటర్, హోటల్, స్టూడియో వంటి వాటిని చూసుకునేవారని వివరించారు.

Related Articles

Related image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Related image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
35
ఆయన లో-ప్రొఫైల్‌లో..
Image Credit : our own

ఆయన లో-ప్రొఫైల్‌లో..

ఈ బాధ్యతల కారణంగానే ఆయన లో-ప్రొఫైల్‌లో ఉన్నారని తెలిపారు. తాత ఎన్టీఆర్ శంషాబాద్‌లో 250 ఎకరాల ఫామ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేశారని, దానిని కూడా జయకృష్ణ చూసుకున్నారని, అయితే తర్వాత దాన్ని అమ్మేశారని చెప్పుకొచ్చారు. సాయికృష్ణ రామకృష్ణ 35ఎంఎం, రామకృష్ణ గ్లిటరేటి థియేటర్‌లను నిర్వహిస్తుండగా, హరి హోటల్‌ను, మోహన్ తారక రామ థియేటర్‌ను చూసుకుంటున్నారని తెలిపారు.

45
స్టూడియోలో అందరూ భాగస్వాములు
Image Credit : our own

స్టూడియోలో అందరూ భాగస్వాములు

స్టూడియోలో అందరూ భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. చిన్న బాబాయ్ జయశంకర్ కృష్ణ చెన్నైలోని బజుల్లా రోడ్‌లో ఒక ఇంటిని కలిగి ఉన్నారని, స్టూడియోలో ల్యాండ్, భవనం కూడా ఉన్నాయని, ఆయన ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారని వెల్లడించారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు మారినందున చెన్నైలోని టీ. నగర్ ఇంటిని మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ వస్తువులతో కూడిన పెద్ద మ్యూజియం అమరావతిలో నిర్మించడానికి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారని, దీనికి 400-500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారన్నారు.

55
బాలకృష్ణ వరుస విజయాలతో..
Image Credit : our own

బాలకృష్ణ వరుస విజయాలతో..

నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారని తెలిపారు. బాలకృష్ణ క్రమశిక్షణ, అంకితభావం, కృషి, నిరంతరం పని చేసే తత్వం, సంభాషణలను గుర్తుంచుకునే శక్తి ఎన్టీఆర్ నుంచి వచ్చినవని తెలిపారు. ఉదయం 3 గంటలకే లేచి పూజ, జిమ్ చేయడం వంటి దినచర్యలను ఆయన పాటించడం విశేషం అని అన్నారు. బాలకృష్ణకు రాజ్ కపూర్ అంటే ఎంతో ఇష్టమని, బాల్యంలో రామకృష్ణ 70ఎంఎం థియేటర్‌లో హిందీ సినిమాలు ఎక్కువగా చూసేవారని చెప్పారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ప్రసిద్ధ వ్యక్తులు
వినోదం
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్‌ దేవరకొండ, రష్మిక మెహెందీ ఈవెంట్‌.. రాయల్‌ లుక్‌లో కొత్త జంట
Recommended image2
Divi Vadthya: అలాంటి వాడు దొరకడం లేదట.. దివి ఆవేదన
Recommended image3
Alekhya Reddy: తారకరత్నతో లవ్‌ స్టోరీ, మొదటిసారి ఓపెన్‌ అయిన అలేఖ్యరెడ్డి.. నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టడంపై ఆవేదన
Related Stories
Recommended image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Recommended image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved