MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పెళ్లి పెటాకులు లేవంటూ.. ప్రభాస్ ముఖం మీదే అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎందుకలా అన్నాడంటే?

పెళ్లి పెటాకులు లేవంటూ.. ప్రభాస్ ముఖం మీదే అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎందుకలా అన్నాడంటే?

పెళ్లి పెటాకులు లేవు.. అంటూ ప్రభాస్ ముఖం మీదే అనేశాడు ఓ స్టార్ హీరో. ఆయన అలా ఎందుకు అన్నారు? కారణం ఏంటి? దానికి ప్రభాస్ సమాధానం ఏంటి? ఇంతకీ అసలు విషయం ఏంటంటే? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 14 2026, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
46 ఏళ్ల బ్యాచిలర్ హీరో ప్రభాస్
Image Credit : @ActorPrabhas

46 ఏళ్ల బ్యాచిలర్ హీరో ప్రభాస్

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. 46 ఏళ్లు వచ్చినా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను గడుపుతున్నాడు. ప్రభాస్ పెళ్లి గురించి ఇండస్ట్రీ అంతా చర్చించుకుంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ప్రతీ సినిమా ఈవెంట్ లో ప్రభాస్ పెళ్లిపై ఒక్క ప్రశ్న అయినా వేస్తుంటారు.

 ప్రభాస్ కూడా అప్పటి పరిస్థితులను బట్టి సమాధానం చెప్పి.. తప్పింకుంటాడు. అసలు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? ఎవరితో అన్న అనుమానాలు అభిమానుల్లో కూడా ఉన్నాయి. స్టార్ హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని భార్య.. పిల్లలతో సంతోషంగా ఉంటే.. ప్రభాస్ మాత్రం బ్యాచిలర్ గానే ఉండిపోవడం అభిమానుల్లో కొంత మందికి బాధగానే ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రభాస్ - అనుష్కల పెళ్లి చేసేసిన సోషల్ మీడియా..
Image Credit : our own

ప్రభాస్ - అనుష్కల పెళ్లి చేసేసిన సోషల్ మీడియా..

ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తుంటుంది. ఇదిగో ఇప్పుడు పెళ్లి.. లేదు అప్పుడు పెళ్లి అంటూ.. ఎన్నో రూమర్స్ వైరల్ అవుతుంటాయి. ప్రభాస్ పెళ్లి గురించిన వార్తల్లో అనుష్కతో లింక్ చేసి వచ్చిన రూమర్స్ ఎక్కువగా ఉన్నాయి. అనుష్క కూడా 43 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. స్క్రీన్ పై వీళ్లిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. దాంతో ప్రభాస్ , అనుష్క ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని.. అమెరికాలో కాపురం పెట్టడానికి ఇల్లు కూడా కొనుకున్నారన్న వార్తలు తెగ వైరల్ అయ్యాయి. 

అంతే కాదు ప్రభాస్, అనుష్క కు ఏఐ టెక్నాలజీతో పెళ్లి చేసి.. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానీ అందులో నిజం లేదని.. పలు సందర్భాల్లో అనుష్క, ప్రభాస్ క్లారిటీ కూడా ఇచ్చారు తాము మంచి స్నేహితులమే.. అంతకు మించి ఇంకేమి లేదంటూ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ విరిద్దరిపై రూమర్స్ మాత్రం ఆగడంలేదు.

36
ప్రభాస్ పై బాలయ్య కామెంట్స్..
Image Credit : aha videoIN

ప్రభాస్ పై బాలయ్య కామెంట్స్..

ఇక ఈక్రమంలో ప్రభాస్ ను పెళ్లి గురించి అడుగుతున్నారు కానీ.. ఆయన ముఖం మీదే ఘాటుగా ప్రశ్నించే ధైర్యం మాత్రం ఎవరు చేయరనే చెప్పాలి. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ప్రభాస్ ను ముఖం మీదే పెళ్లి పెటాకులు లేవు అంటూ..అన్నారు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు నటసింహం బాలయ్య బాబు. అవును బాలయ్య హోస్ట్ గా.. ప్రభాస్ గెస్ట్ గా పాల్గొన్న అన్ స్టాపబుల్ షోలో ఈ సంఘటన జరిగింది. అయితే బాలయ్య ఈ మాట అనడం వెనుక వేరే అర్ధం ఉంది. ప్రభాస్ ను విమర్శించడానికి కాకుండా.. ప్రభాస్ పై ప్రేమతో బాలకృష్ణ ఈమాటలు అన్నారు. ఇంతకీ ఆ సందర్భం ఏంటంటే..?

46
సమాజ సేవ కోసం ప్రభాస్ చేస్తున్న పనులు ఇవే..
Image Credit : @ahaTelugu

సమాజ సేవ కోసం ప్రభాస్ చేస్తున్న పనులు ఇవే..

ప్రభాస్ రాజుల కుటుంబంలో పుట్టారు.. ఆయన సంపాదనలో ఎక్కువ శాంతం మంచి పనులకు ఉపయోగిస్తుంటారు... కొన్ని ఎకరాల్లో అడవిని ప్రభాస్ దత్తత తీసుకుని ఫండ్స్ ఇస్తున్నారు. ఖమ్మంలో వృధ్దాశ్రమం కట్టి.. ప్రతీ నెల ఫండ్ కూడా పంపిస్తున్నారు. ఆయన ఇంటికి వచ్చినవారికి పదుల రకాల వంటలతో కడుపునింపి పంపిస్తాడు.. షూటింగ్ లో ఉంటే టీమ్ అంతా.. ప్రభాస్ విందు తినాల్సిందే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. ప్రభాస్ చేసే సమాజ సేవ లిస్ట్ చాలా ఉంది. ఈక్రమంలో బాలయ్య వీటి గురించే ప్రత్యేకంగా మాట్లాడారు.

56
పెళ్లి పెటాకులు లేవన్న బాలకృష్ణ
Image Credit : aha videoIN

పెళ్లి పెటాకులు లేవన్న బాలకృష్ణ

బాలకృష్ణ మాట్లాడుతూ.. అడవులు దత్తత తీసుకుని పెంచుతున్నావు.. కొత్తగా ఇల్లు కట్టుకున్నావు.. చార్టెడ్ ఫ్లైట్ కూడా కొని ఉంటావు కదా అని అడిగారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి కొంటున్నాను.. ప్లైట్ కొనేంత సీన్ ఇంకా రాలేదు.. రీసెంట్ గా చిన్న ఇల్లు కొనుకున్నాను అని అన్నారు. వెంటనే బాలయ్య అందుకుని... ఇల్లు తరువాత పెళ్లా పెటాకులా.. అద్దె ఇంట్లో అయినా ఉండొచ్చు.. ముందు ప్లైట్ కొనుక్కో అంటూ.. సరదాగా సెటైర్లు వేశాడు.. ప్రభాస్ కూడా ఈ టాపిక్ ను సరదాగానే తీసుకున్నారు. కొత్తగా ఇల్లు కొన్నాను.. నాలుగైదు నెలలో పిలుస్తా.. మీ మాన్షన్ హౌస్ పార్టీ అక్కడే చేసుకుందాం అంటూ.. ఆఫర్ చేశాడు ప్రభాస్. గతంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ తాలూకు కటింగ్.. రీసెంట్ గా వైరల్ అయ్యింది.

66
రీసెంట్ గా ఎదురు దెబ్బతిన్న రెబల్ స్టార్..
Image Credit : aha videoIN

రీసెంట్ గా ఎదురు దెబ్బతిన్న రెబల్ స్టార్..

రీసెంట్ గా రాజా సాబ్ సినిమాతో భారీ డిజాస్టర్ ఫేస్ చేశాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాజా సాబ్ డిజాస్టర్ తో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు ప్రభాస్. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. 

అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాను కూడా రీసెంట్ గా ప్రారంభించాడు. స్పిరిట్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రభాస్ ముందుకు వెళ్తున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా
Recommended image2
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image3
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Related Stories
Recommended image1
మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా చెప్పిన పేరు ఎవరిది?
Recommended image2
అతిథులకు అన్నం పెట్టను.. ముఖం మీదే చెప్పిన రామ్ గోపాల్ వర్మ , కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved