MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా చెప్పిన పేరు ఎవరిది?

మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా చెప్పిన పేరు ఎవరిది?

టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. స్టార్ హీరోగా ఎదిగాడు మహేష్ బాబు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఆయనే స్వయంగా వెల్లడించిన పేరు ఎవరిది? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 13 2026, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే..
Image Credit : youtube/@ColliderInterviews

ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే..

కృష్ణ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు.. ఇండస్ట్రీలో తన తండ్రి పడ్డ కష్టం కళ్లారా చూసిన ఆయన.. తక్కువ సినిమాలతో.. ఎక్కువ ప్రభావం చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తుంటాడు సూపర్ స్టార్. 

ఆ ఒక్క సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. ఈక్రమంలోనే మహేష్ బాబు ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేసి.. స్టార్ స్టేటస్ ను సంపాదించాడు. తెలుగు సినిమాలతోనే హిందీ, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు మహేష్ బాబు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్..
Image Credit : @namratashirodkar

ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్..

మహేష్ బాబు అందరు హీరోల్లా కాదు.. చాలా రిజర్వ్ గా ఉంటాడు. ఎక్కువగా ఎవరితో మాట్లాడడు.. బాగా క్లోజ్ గా ఉంటే మాత్రం.. ఆయన వేసే పంచ్ లకు తట్టుకోవడం కష్టం. ఎవరిని ఎక్కువగా నమ్మి నెత్తిన పెట్టుకోడు. అందుకే ఆయన కెరీర్ లో ఫ్రెండ్స్ ఉంటారు కానీ.. బెస్ట్ ప్రెండ్స్ అంటూ ఎవరు ఉన్నట్టు ఇంత వరకూ కనిపించలేదు.

 సినిమాలు ఉంటే షూటింగ్స్ తో బిజీగా ఉండే మహేష్.. షూటింగ్స్ లేకపోతే మాత్రం టైమ్ అంతా ఫ్యామిలీకే కేటాయిస్తారు... కాస్త టైమ్ దొరికినా.. భార్య పిల్లలతో వెకేషన్ కు ఫారెన్ చెక్కేస్తుంటాడు మహేష్. హైదరాబాద్ లో ఉన్నా... సినిమా పార్టీలకు దూరంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం అయితేనే తప్ప బయటకు రాడు, ఎక్కడికి వెళ్లినా.. తప్పకుండా భార్య నమ్రత పక్కనే ఉంటుంది.

36
మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎందుకు..?
Image Credit : Asianet News

మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎందుకు..?

మహేష్ బాబు నటుడిగా కెరీర స్టార్ట్ చేసి 40 ఏళ్లుపైనే అవుతోంది. హీరోగా మారి 25 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల ఆయన కెరీర్ లో మహేష్ బాబు కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ వీళ్లే అని ఎప్పుడు ఎవరి పేరు వినిపించలేదు. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని సూపర్ స్టార్ కు ఓ సందర్భంలో ప్రశ్న ఎదురయ్యింది. అప్పుడు ఆయన ఏమాత్రం ఆలోచించుకుండా ''మై వైఫ్ '' అని చెప్పేశాడు. అంటే తన భార్య మాత్రమే తనకు మంచి స్నేహితురాలని.. ఇండస్ట్రీలో అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరని ఆయన చెప్పకనే చెప్పిన్నట్టు అయ్యింది. అంతే కాదు నమ్రత కూడా ఇదే సమాధానం చెప్పింది. తనకు బెస్ట్ ప్రెండ్ మహేష్ మాత్రమే అనేసింది.

46
మహేష్ వెంటుండి నడిపిస్తున్న నమ్రత..
Image Credit : Asianet News

మహేష్ వెంటుండి నడిపిస్తున్న నమ్రత..

ఒక రకంగా మహేష్ బాబును వెంటుండి నడిపిస్తుండి నమ్రతనే అంటుంటారు. ఆమెతో పెళ్లి తరువాతే మహేష్ బాబుకు కలిసి వచ్చిందని ఇండస్ట్రీ టాక్. అంతే కాదు మహేష్ బాబు సినిమాల విషయంలో ఆమె నిర్ణయాలకే ఎక్కువగా విలువ ఉంటుందట. ఆమె అంత జాగ్రత్తగా ఉండబడ్డే.. వరుస ఫెయిల్యూర్స్ నుంచి మహేష్ బాబు బయటపడ్డాడని టాక్. గతంలో కథలు, దర్శకులు విషయాల్లో సూపర్ స్టార్ తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ఆతరువాత కాలంలో మహేష్ కాస్త చూసుకుని అడుగులు వేస్తున్నాడు. అందకే ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు మహేష్.

56
ఇండస్ట్రీలో మహేష్ బాబు స్నేహితులు
Image Credit : youtube/@ColliderInterviews

ఇండస్ట్రీలో మహేష్ బాబు స్నేహితులు

కొందరు దర్శకులతో కొంత కాలం ట్రావెల్ చేశాడు సూపర్ స్టార్.. వంశీ పైడిపల్లి, మోహర్ రమేష్, కొరటాల శివ లాంటి వారితో ఫ్యామిలీ వెకేషన్స్ కు కూడా వెళ్లారు. కానీ ఆతరువాత మళ్లీ ఆ దర్శకులతో కలిసి కనిపించినట్టు చూడలేదు. ఏదైనా ఈవెంట్ కు వెళ్లినా.. ఇంటర్వ్యూకు వెళ్లినా.. అక్కడ ఉన్న హీరోలతో కలిసి మెలిసి ఉంటాడు. అందరితో మంచిగా మాట్లాడుతాడు. అందరికి గౌవరం ఇస్తాడు మహేష్. అంత కాదు కలిసి పార్టీలు చేసుకోవడం.. పర్సనల్ గా మాత్రం ఇన్వాల్వ్ అవ్వడు. తనకు ఉన్న ఖాళీ టైమ్ ను తన ఫ్యామిలీకి మాత్రమే కేటాయిస్తుంటాడు మహేష్.

66
రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా..
Image Credit : Mahesh Babu\Twitter

రాజమౌళి సినిమాతో ఫుల్ బిజీగా..

ఈమధ్య వరకూ టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిన మహేష్ బాబు.. ఇప్పుడు పాన్ ఇండియాను కూడా దాటుకుని పాన్ వరల్డ్ ను టార్గెట్ చేసుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళితో వారణాసి మూవీలో నటిస్తున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈసినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.

 దాదాపు 1500 కోట్లవరకూ బడ్జెట్ ను ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్టగా సమాచారం. ఈమూవీ ఇండియాన్ సినిమా చరిత్రను తిరగరాస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. గతంలో బాహుబలి సినిమాతో రాజమౌళి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వారణాసితో మరోసారి అదే పని చేయబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరగుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేయడంతో.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
రామ్ చరణ్ , ఉపాసన తమ కవల పిల్లలకు పెట్టిన పేర్లు ఏంటో తెలుసా? నిజం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved