- Home
- Entertainment
- Mega Heroes: డైరెక్టర్లను బ్లైండ్ గా నమ్మి మునిగిపోయిన మెగా హీరోలు.. 5 చెత్త సినిమాలు ఇవే
Mega Heroes: డైరెక్టర్లను బ్లైండ్ గా నమ్మి మునిగిపోయిన మెగా హీరోలు.. 5 చెత్త సినిమాలు ఇవే
చిరంజీవి నుంచి సాయిధరమ్ తేజ్ వరకు మెగా హీరోలు కొందరు దర్శకులని బ్లైండ్ గా నమ్మేసి సినిమాలు చేశారు. కానీ ఆ చిత్రాలు దారుణమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మెగా హీరోల 5 చెత్త సినిమాలు
మెగా ఫ్యామిలీ హీరోలు కొందరు అగ్ర దర్శకులని గుడ్డిగా నమ్మి మునిగిపోయారు. చిరంజీవి నుంచి సాయిధరమ్ తేజ్ వరకు మెగా హీరోలకు ఊహించని పరాజయాలు ఎదురయ్యాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలు బ్లైండ్ గా నమ్మిన దర్శకుడు ఎవరు, ఆ సినిమాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి
ఆచార్య ముందు వరకు కొరటాల శివకి పరాజయమే లేదు. దీనితో చిరంజీవి కొరటాలపై నమ్మకంతో ఆచార్య సినిమా చేశారు. ఈ చిత్ర కథ చూస్తే చిరంజీవి జడ్జిమెంట్ కూడా పూర్తిగా బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది. ఆచార్య సినిమా చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచింది. అసలు కొరటాల శివ ఇలాంటి సినిమా చేస్తాడని మెగా అభిమానులు అస్సలు ఊహించలేదు.
రాంచరణ్
2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో గేమ్ ఛేంజర్ ఒకటి. ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకులలో ఒకరైన శంకర్ ఇలాంటి సినిమా చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ నటిస్తున్న సినిమా కావడం, శంకర్ దర్శకత్వం కావడం విపరీతంగా అంచనాలు పెరిగేలా చేశాయి. కానీ అభిమానులు పెట్టుకున్న ఆశలని శంకర్ నీరుగార్చారు. రాంచరణ్ గుడ్డిగా శంకర్ ని నమ్మి ఈ సినిమా చేసినట్లు ఉంది.
పవన్ కళ్యాణ్
జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ తో చేసిన హ్యాట్రిక్ మూవీ అజ్ఞాతవాసి. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ ఖాయం అని అభిమానులు అనుకున్నారు. త్రివిక్రమ్ సినిమా ఎలా తీసినా మినిమమ్ గ్యారెంటీ హిట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ మరీ ఇంత పరమ చెత్త సినిమా చేస్తారని ఎవరూ భావించలేదు. అజ్ఞాతవాసి దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.
అల్లు అర్జున్
డైరెక్టర్ వివి వినాయక్ పై నమ్మకంతోతో అల్లు అర్జున్ బద్రీనాథ్ అనే చిత్రంలో నటించారు. అప్పట్లో ఈ సినిమాపై మగధీర స్థాయిలో అంచనాలు ఉండేవి. కానీ ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది.
సాయి ధరమ్ తేజ్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటెలిజెంట్ మూవీ డిజాస్టర్ అయింది. ఈ చిత్రానికి కూడా వివి వినాయక్ నే దర్శకుడు. వినాయక్ పై నమ్మకంతోనే ఈ సినిమా చేసినట్లు సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

