- Home
- Entertainment
- Chiranjeevi: చిరంజీవితో పోటీ, అది నచ్చకే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయా.. నిజాలు బయటపెట్టిన క్రేజీ హీరో
Chiranjeevi: చిరంజీవితో పోటీ, అది నచ్చకే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయా.. నిజాలు బయటపెట్టిన క్రేజీ హీరో
సీనియర్ నటుడు నరేష్ ఒక దశలో సినిమాలు మానేసి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలా ఇండస్ట్రీని వదిలి వెళ్ళడానికి కారణాలు చెబుతూ నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో పోటీ గురించి ప్రస్తావించారు.

హీరోగా రాణించిన నరేష్
80, 90 దశకాలలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి కొత్త తరం హీరోలు ఇండస్ట్రీలో రైజ్ అయ్యారు. ఆ సమయంలోనే కృష్ణంరాజు, కృష్ణ లాంటి లెజెండ్స్ కెరీర్లు ముగిశాయి. లెజెండ్రీ నటి విజయ నిర్మల తనయుడు, ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్ గా ఉన్న నరేష్ కూడా ఆ సమయంలోనే కెరీర్ ప్రారంభించారు.
కామెడీ చిత్రాలతో అదరగొట్టిన నరేష్
అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు మాస్ సినిమాలతో రాణిస్తుంటే.. నరేష్, రాజేంద్రప్రసాద్ కామెడీ చిత్రాలతో అదరగొట్టారు. వీరికి ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఎక్కువగా ఉండేది. 80 దశకంలో నరేష్ హీరోగా కెరీర్ ప్రారంభించారు. 90 వ దశకం సెకండ్ హాఫ్ లో హీరోగా నరేష్ కెరీర్ ముగిసింది. కొంత కాలం నరేష్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు.
చిరంజీవితో పోటీపై కామెంట్స్
నరేష్ కెరీర్ లో చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఇండస్ట్రీకి దూరం కావడం పై నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా సినిమాలకు అప్పట్లోనే 5 కోట్లు, 4 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. అవి అగ్ర హీరోల సినిమాల వసూళ్లతో సమానం. అయినా కూడా నేనే ఎవ్వరితోనూ పోటీ పడలేదు. చిరంజీవితో కూడా పోటీ పడలేదు.
రొటీన్ సినిమాలు ఇష్టం లేదు
రాజేంద్ర ప్రసాద్ తో మాత్రం పోటీ ఉండేది. అది కూడా ఇండస్ట్రీలో ఉన్న వారు కంపేర్ చేసేవాళ్ళు. కానీ నా సినిమాలు నాకు ఉండేవి. ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలు చేయాలనేది నా కోరిక. కానీ ఒక దశకు వచ్చే సరికి రొటీన్ కామెడీ, రొటీన్ కథలు అనిపించాయి. కొన్ని సినిమాలు వెరైటీగా ట్రై చేశా. కానీ ఆడియన్స్ ఆ సినిమాలని ఆదరించేంత అడ్వాన్స్డ్ స్థాయిలో లేరు.
అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నా
రొటీన్ సినిమాలు చేసి జనాలకు బోర్ కొట్టిస్తున్నాను అనే చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఇండస్ట్రీని వదిలేయడం బెటర్ అనిపించింది. అందుకే సినిమాలకు దూరం జరిగి పాలిటిక్స్ లోకి వెళ్లినట్లు నరేష్ తెలిపారు. రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల వల్ల నేను కనీసం ఎమ్మెల్యేని కూడా కాలేకపోయినట్లు నరేష్ అన్నారు. తనకి హిందూపురం నుంచి పోటీ చేయాలనే కోరిక ఉండేదని కానీ కుదర్లేదని నరేష్ అన్నారు.

