- Home
- Entertainment
- Nandamuri Balakrishna: క్లాస్ సినిమాతో బాలయ్యకి చుక్కలు చూపించిన జగపతి బాబు.. పాపం సుమన్ బలి
Nandamuri Balakrishna: క్లాస్ సినిమాతో బాలయ్యకి చుక్కలు చూపించిన జగపతి బాబు.. పాపం సుమన్ బలి
సాధారణంగా అగ్ర హీరోల మాస్ సినిమాలు విడుదలైతే వాటి ముందు మీడియం రేంజ్ హీరోల సినిమాలు నిలబడడం కష్టం. కానీ జగపతి బాబు ఒక క్లాస్ మూవీతో బాలయ్యకి చుక్కలు చూపించారు. ఆ వివరాలు ఈ కథనంలో..

బాలకృష్ణ బొబ్బిలి సింహం మూవీ
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో కోదండరామిరెడ్డి ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో అనేక సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. బాలయ్య కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో నారీ నారీ నడుమ మురారి, అనసూయమ్మగారి అల్లుడు, బొబ్బిలి సింహం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. బొబ్బిలి సింహం మూవీలో ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా ఉంది.
బొబ్బిలి సింహం చిత్రానికి పోటీగా వచ్చిన సినిమాలు
ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 1994 సెప్టెంబర్ 23న ఈ చిత్రం విడుదలయింది. ఈ సినిమాకి పోటీగా కొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయి. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సుమన్, రాజశేఖర్ లాంటి హీరోలు బొబ్బిలి సింహం చిత్రానికి పోటీగా తమ సినిమాలు రిలీజ్ చేశారు. అసలు బొబ్బిలి సింహం జోరు ముందు ఏ సినిమా అయినా నిలబడగలదా అని భావిస్తున్న తరుణంలో జగపతి బాబు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
బాలయ్యకి ఎదురు నిలబడింది జగపతి బాబు ఒక్కడే
బొబ్బిలి సింహం రిలీజైన 2 రోజుల గ్యాప్ లో జగపతి బాబు శుభలగ్నం మూవీ రిలీజ్ అయింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన శుభలగ్నం మూవీ బొబ్బిలి సింహం చిత్రానికి ధీటుగా సంచలన విజయం అందుకుంది. బాలయ్య సినిమా జోరు కొనసాగుతున్నప్పటికీ జగపతి బాబు ఎక్కడా తగ్గలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే బొబ్బిలి సింహం, శుభలగ్నం రెండు సినిమాల్లో రోజా హీరోయిన్ గా నటించారు.
సుమన్ సినిమా ఫ్లాప్
మరోవైపు బొబ్బిలి సింహం మూవీ కంటే వారం ముందు రిలీజైన రాజేంద్ర ప్రసాద్ నటించిన అల్లరోడు మూవీ ఫ్లాప్ అయింది. రెండు వారాల తర్వాత విడుదలైన సుమన్ హలో అల్లుడు చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ టైంలోనే వచ్చిన రాజశేఖర్ ఆవేశం మూవీ కూడా ఫ్లాప్ అయింది. డబ్బింగ్ సినిమాగా వచ్చిన శంకర్ ప్రేమికుడు హిట్ అయింది.
బొబ్బిలి సింహం రీ రిలీజ్ కావాలి
మొత్తంగా బాలయ్య బొబ్బిలి సింహం సినిమాకి పోటీగా వచ్చిన శుభలగ్నం సంచలన విజయం అందుకోగా.. సుమన్, రాజశేఖర్ సినిమాలు బలయ్యాయి. బాలయ్యతో చేసిన సినిమాల్లో బొబ్బిలి సింహం అంటే తనకు చాలా ఇష్టం అని కోదండరామిరెడ్డి అన్నారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతి రోజూ నిద్రపట్టేది కాదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా.. షూటింగ్ కి వెళదామా అనే ఆసక్తి ఉండేది అని కోదండరామిరెడ్డి అన్నారు. ఆ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ అయితే బావుంటుంది అని తెలిపారు.

