- Home
- Entertainment
- అఖండ 2 బాక్సాఫీస్ టార్గెట్ ఎంతో తెలుసా ? దరిదాపుల్లో కూడా లేని బాలయ్య టాప్ 5 సినిమాలు
అఖండ 2 బాక్సాఫీస్ టార్గెట్ ఎంతో తెలుసా ? దరిదాపుల్లో కూడా లేని బాలయ్య టాప్ 5 సినిమాలు
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 బాక్సాఫీస్ టార్గెట్ చాలా పెద్దది. బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీ కలెక్షన్స్ అఖండ 2 టార్గెట్ కి దరిదాపుల్లో కూడా లేదు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

బాలకృష్ణ అఖండ 2 మూవీ
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ హంగామా మొదలైంది. ఇటీవల విడుదలైన అఖండ 2 ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ గ్యారెంటీ అనే వైబ్స్ వచ్చేస్తాయి. సింహా, లెజెండ్, అఖండ ఇలా బాలయ్య, బోయపాటి కాంబినేషన్ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది.
అఖండ 2 బాక్సాఫీస్ టార్గెట్ ఇదే
అఖండ 2లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆది పినిశెట్టి, కబీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖండ పాత్రలో బాలయ్య గెటప్, చేస్తున్న యాక్షన్ స్టంట్స్ అభిమానులని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అఖండ 2 డిసెంబర్ 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అఖండ 2 చిత్రానికి బాక్సాఫీస్ టార్గెట్ చాలా భారీగా ఉంది. అఖండ 2 చిత్రానికి 120 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అంటే ఈ చిత్రం హిట్ కావాలంటే 120 కోట్లకి పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. గ్రాస్ పరంగా చూస్తే 220 కోట్ల వరకు రాబట్టాలి. ఇది ఊహకందని భారీ టార్గెట్ అనే చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ సినిమాల హైయెస్ట్ గ్రాస్ ఇప్పటి వరకు 150 కోట్ల మార్క్ దాటలేదు. కాబట్టి అఖండ 2 టార్గెట్ రీచ్ కావాలి అంటే అద్భుతం జరగాల్సిందే. బాలకృష్ణ కెరీర్ లో టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అఖండ
బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ చిత్రం 2021లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రం 125 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్ లో ఇదే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం. అఖండ 2 హిట్ కావలసి అంటే దీనికి అదనంగా మరో 100 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది.
డాకు మహారాజ్
డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన డాకు మహారాజ్ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై 120 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ నటించారు.
వీర సింహా రెడ్డి
బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన వీరసింహా రెడ్డి మూవీ మాస్ ప్రియులని మెప్పించింది. ఈ చిత్రం 118 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది.
భగవంత్ కేసరి
బాలకృష్ణ తొలిసారి తెలంగాణ యాసలో డైలాగులు చెప్పిన చిత్రం ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 113 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
గౌతమిపుత్ర శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం బాలయ్యకి 100వ మూవీ. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 80 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది.

