- Home
- Entertainment
- 18 ఏళ్లలో ఒకే బ్లాక్‌బస్టర్, అది కూడా రామ్ చరణ్ మూవీతో.. ఆమెకి అంత ఆస్తి ఎలా వచ్చింది ?
18 ఏళ్లలో ఒకే బ్లాక్‌బస్టర్, అది కూడా రామ్ చరణ్ మూవీతో.. ఆమెకి అంత ఆస్తి ఎలా వచ్చింది ?
Neha Sharma: నటి నేహా శర్మకు 38 ఏళ్లు నిండాయి. భారత సినీ పరిశ్రమలోని అత్యంత అందమైన నటీమణులలో నేహా ఒకరు. గత 18 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే, బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఆమె నటించిన ఒక్క సినిమా మాత్రమే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

నేహా శర్మ తండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే
నేహా శర్మ భాగల్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అజిత్ శర్మ కుమార్తె. ఆయన 2014 ఉప ఎన్నికలో, 2015, 2020 ఎన్నికల్లో గెలిచారు. 2024లో భారతీయ జనతా పార్టీకి చెందిన రోహిత్ పాండే చేతిలో ఓడిపోయారు. నేహా శర్మ 1987 నవంబర్ 21న భాగల్‌పూర్‌లో జన్మించారు. ఆమెకు అయేషా శర్మ అనే సోదరి కూడా ఉంది. నేహా శర్మ శుక్రవారం రోజు తన పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
2007 నుంచి సినిమాల్లో నటిస్తున్న నేహా శర్మ
నేహా శర్మ సినిమాల్లోకి వచ్చి 18 ఏళ్లు అయింది. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'చిరుత' సినిమాతో అరంగేట్రం చేశారు. ఇది రామ్ చరణ్ మొదటి సినిమా కూడా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. అయితే, ఆమె రెండో తెలుగు సినిమా 'కుర్రాడు' ఫ్లాప్ అయింది. ఇందులో వరుణ్ సందేశ్ హీరో. 2010లో ఇమ్రాన్ హష్మీ నటించిన 'క్రూక్'తో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది.
నేహా శర్మ కెరీర్‌లో ఏకైక బ్లాక్‌బస్టర్
నేహా శర్మ కెరీర్‌లో ఏకైక బ్లాక్‌బస్టర్ 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్'. 2020లో విడుదలైన ఈ సినిమాలో అజయ్ దేవగన్, కాజోల్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నేహా శర్మ కమలా దేవి అనే చిన్న పాత్రలో కనిపించారు. బాక్స్ ఆఫీస్ ఇండియా ప్రకారం, రూ.172 కోట్లతో తీసిన ఈ సినిమా, ఇండియాలో రూ.269.77 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.358.77 కోట్లకు పైగా వసూలు చేసింది.
నేహా శర్మకు కోట్లాది రూపాయల ఆస్తి
2024 ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం, నేహా శర్మ ఆస్తి విలువ 4 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.35 కోట్లకు పైనే. భాగల్‌పూర్‌లో ఆమెకు సొంత ఇల్లు ఉందని కొన్ని రిపోర్ట్ లు చెబుతున్నాయి. కానీ అది ఆమె తండ్రి అజిత్ శర్మ ఇల్లు. నేహా వద్ద రూ.1 కోటి విలువైన మెర్సిడెస్ బెంజ్ GLE వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
నేహా శర్మ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది
ఫ్లాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నేహా శర్మ కోట్లాది రూపాయల సంపదను ఎలా కూడబెట్టారు? రిపోర్ట్ ల ప్రకారం, ఆమె సినిమాలకు దాదాపు రూ.1 కోటి వసూలు చేస్తారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఆమెకు మంచి ఆదాయం వస్తుంది. సోషల్ మీడియా, ఇతర ప్రొఫెషనల్ వెంచర్లు కూడా ఆమె సంపాదనకు మూలాలు. ఆమె పేరుతోనే ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఉంది. గార్నియర్, స్పావెక్, అవిటా వంటి బ్రాండ్లతో కూడా పనిచేస్తున్నారు.

